‘దృశ్యం’ ఫ్రాంచైజీకి మరో సీక్వెల్‌..! | Drusyam4 Movie Big Update | Sakshi
Sakshi News home page

‘దృశ్యం’ ఫ్రాంచైజీకి మరో సీక్వెల్‌..!

Aug 23 2026 8:57 PM | Updated on Aug 23 2026 8:57 PM

Drusyam4 Movie Big Update

2013లో వచ్చిన ‘దృశ్యం’ ప్రారంభమైన ఈ ప్రాంచైజీ మోహన్‌లాల్‌, జీతూ జోసెఫ్‌ కాంబినేషన్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దీంతో అప్పటి నుంచి సీక్వెల్స్‌ తీస్తూనే వచ్చారు. ఇప్పుడు మళ్లీ దృశ్యం ఫ్రాంచైజీకి మరో సీక్వెల్‌ ఉంటుందా? అంటే అవుననే వార్తలు వినిపిస్తునాయి. నిర్మాత ఆంటోని పెరుంబవూర్‌ ‘దృశ్యం-4’ పై అప్‌డేట్‌ ఇచ్చి నట్లు తెలుస్తోంది.  

‘దృశ్యం-4 ‍కచ్చితంగా ఉంటుంది. ఈ మాటను మనస్ఫూర్తిగా చెబుతున్నా’ అని మజవిల్‌ మనోరమ అవార్డ్స్‌ కార్యక్రమంలో ఆయన పేర్కొన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే మోహన్‌లాల్‌, దర్శకుడు జీతూ జోసెఫ్‌ నుంచి ఈ అప్‌డేప్‌పై ఇంతవరకు ఏ విధంగా స్పందించలేదు. 
దృశ్యం 3లో..
ఇటీవలే మోహన్ లాల్, మీనా జంటగా మే 21న విడుదలైన ‘దృశ్యం-3’తో జార్జ్‌కుట్టి కథ మరో మలుపు తిరిగింది. జార్జ్‌కుట్టి పాత్ర సినీ ప్రేక్షకుల్లో ఎంతో పాపులర్‌ అయింది. అయితే కథను పూర్తిగా ముగించకుండా కొనసాగింపునకు అవకాశం ఉండేలా ముగించారు. తమ కుమారుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న సిద్ధిఖ్‌, ఆశా శరత్‌ పాత్రల కథ కూడా ఇంకా మిగిలే ఉంది. దీంతో నాలుగో భాగంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement