టాక్సిక్ మేకర్స్‌కు షాక్.. కేసు నమోదు | Toxic Pre Release Event Turns Chaotic, Police Files Case On Movie Makers And Malla Reddy College Over Stampede | Sakshi
Sakshi News home page

Toxic Movie: టాక్సిక్ మేకర్స్‌కు షాక్.. కేసు నమోదు

Aug 23 2026 1:28 PM | Updated on Aug 23 2026 2:23 PM

Police Files case on Yash Toxic Movie Makers and Mallareddy college

టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈవెంట్‌లో తొక్కిసలాట జరగడంతో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఈవెంట్‌ నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు టాక్సిక్ చిత్ర యూనిట్‌తో పాటు మల్లారెడ్డి కాలేజీపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

కేజీఎఫ్ స్టార్ యశ్ హీరోగా వస్తోన్న మూవీ టాక్సిక్. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. మల్లారెడ్డి కాలేజీలో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో యష్ మాట్లాడుతుండగా భారీ సౌండ్ బాక్స్ సెట్ కుప్పకూలింది. ఈ క్రమంలోనే ఇద్దరు యువకులకు కాళ్లు విరిగినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరమ్మాయిలకి గాయలు కాగా.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరు స్పృహ కోల్పోయినట్లు తెలిసింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఈవెంట్ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తాజాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement