మహబూబాబాద్ అర్బన్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ గురుకుల కళాశాల హాస్టల్‌లో బుధవారం ఉద యం కలకలం రేగింది. డిగ్రీ మొదటి సంవత్స రం చదువుతున్న ఓ విద్యార్థిని హాస్టల్ బాత్రూంలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, పుట్టిన కొద్దిసేపటికే ఆ నవజాత శిశువు మృతి చెందినట్లు కళాశాల ప్రిన్సిపాల్ బిందుమాధురి, వైద్యురాలు అరుణ తెలిపారు. ప్రిన్సిపాల్ తెలిపి న వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం నిర్వహించే ప్రార్థనకు సదరు విద్యారి్థని గైర్హాజరైంది. దీంతో తోటి విద్యార్థినులు ఆమె కోసం హాస్టల్ గదులు, కళాశాల ప్రాంగణంలో వెతికారు.
ఎక్కడా కనిపించకపోవడంతో అనుమా నం వచ్చి బాత్రూంలో పరిశీలించగా, శిశువుకు జన్మనిచ్చి స్పృహతప్పి పడిపోయిన స్థితిలో ఆమె కనిపించింది. వెంటనే కళాశాల సిబ్బంది మహి ళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పృహతప్పిన విద్యారి్థనిని అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. విషయం తెలిసి ఆస్పత్రికి చేరుకున్న విద్యారి్థని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మహబూబాబాద్ టౌన్ సీఐ రఘుపతిరెడ్డి వెల్లడించారు.


