కాల్‌మనీ వేధింపులకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి బలి | Outsourcing employee falls victim to call money harassment | Sakshi
Sakshi News home page

కాల్‌మనీ వేధింపులకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి బలి

Nov 26 2026 5:19 AM | Updated on Nov 26 2026 5:19 AM

Outsourcing employee falls victim to call money harassment

తిరువూరు: ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు మున్సిపాలిటీలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి షేక్‌ బాజీ(35) కాల్‌మనీ వేధింపులు తాళలేక బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకెళ్తే.. కుటుంబ అవసరాల నిమిత్తం బాజీ రెండేళ్ల కిందట ఓ వడ్డీ వ్యాపారి వద్ద నుంచి నూటికి రూ.10 వడ్డీకి రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. ఆ సమయంలో బాజీ, అతని కుటుంబ సభ్యుల నుంచి ఖాళీ ప్రామిసరీ నోట్లు, బ్యాంకు చెక్కులు తీసుకున్న వడ్డీ వ్యాపారి ఇప్పటి వరకు వడ్డీ నిమిత్తం ప్రతి నెలా రూ.10 వేలు చొప్పున వసూలు చేశాడు. ఇలా రూ.2 లక్షలకు పైగా బాజీ చెల్లించాడు.

డబ్బు కోసం తనపై నిత్యం వేధింపులకు పాల్పడుతున్న వడ్డీ వ్యాపారిపై చర్యలు తీసుకుని తన ఖాళీ నోట్లు, చెక్కులు తిరిగి ఇప్పించాలని బాజీ ఇటీవల తిరువూరు సీఐకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ వడ్డీవ్యాపారి తనను, కుటుంబ సభ్యులను వేధిస్తుండడంతో బాజీ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. బాజీ మృతికి వడ్డీ వ్యాపారే కారణమని ఆయన భార్య మాలీన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శాతకర్ణి తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement