సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శులు(పార్లమెంట్) నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఎం.సుదీర్ కుమార్ రెడ్డి, నంద్యాల జిల్లాకు చెందిన టి.నరేంద్రకుమార్ రెడ్డిలను రాష్ట్ర కార్యదర్శులు(పార్లమెంట్)గా నియమించారు.


