ఒకేసారి ఐదు భాషల్లో ‘బిగ్‌బాస్‌’.. ఎవరు ఎక్కడ హోస్ట్‌! | Bigg Boss New Seasons Coming On September 6th 2026, Check Out Hosts Across 5 Languages, Read Story Inside | Sakshi
Sakshi News home page

ఒకేసారి ఐదు భాషల్లో ‘బిగ్‌బాస్‌’.. ఎవరు ఎక్కడ హోస్ట్‌!

Aug 23 2026 6:59 PM | Updated on Aug 23 2026 7:56 PM

Who Is Hosting In Biggboss Upcoming Seasons

బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్‌బాస్‌ సిద్ధమవుతోంది.  ఒకేసారి అయిదు భాషల్లో కొత్త సీజన్లు ప్రారంభం కానున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీలో కూడా సెప్టెంబర్‌ 6న కొత్త సీజన్లలతో ప్రారంభం కానున్నాయి. ఫ్రాంచేజీ చరిత్రలోనే తొలిసారిగా ఇలా ఏకకాలంలో ప్రారంభం కానున్నాయని జీయోస్టార్‌ ప్రకటించింది.

హోస్ట్‌లుగా వీరే.. 
కొత్త సీజన్లలోనూ పలువురు స్టార్‌ హీరోలు మళ్లీ సందడి చేయనున్నారు. బిగ్‌బాస్‌ మలయాళంకు మోహన్‌లాల్‌, తమిళ్‌లో విజయ్‌ సేతుపతి, తెలుగులో నాగార్జున, కన్నడలో  సుదీప్‌, హిందీలో సల్మాన్‌ ఖాన్‌లు హోస్టులుగా వ్యవహరించనున్నారు.

బెంగాలీలో ఆగస్టు 31 నుంచే..
బిగ్‌బాస్‌ 3 బెంగాలీ ఆగస్టు 31 నుంచి ప్రతిరోజూ రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానుంది. దీనికి హోస్టుగా సౌరవ్‌ గంగూలీ వ్యవహరించనున్నారు.

తెలుగులో మంచి ఆదరణ
బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 9 గ్రాండ్‌ ఫినాలేకు 19.6 టీవీఆర్‌ నమోదైనట్లు జియాస్టార్‌ వెల్లడించింది. తెలుగు బిగ్‌బాస్‌ ఇప్పటివరకు 36 కోట్ల వ్యూయింగ్‌ మినిట్స్‌ను నమోదు చేసినట్లు తెలిపింది. 
తమిళంలోనూ ..
విజయ్‌ సేతుపతి హోస్టుగా వ్యవహరించిన బిగ్‌బాస్‌ తమిళ్‌కు కూడా మంచి స్పందన వచ్చిందని జియాస్టార్‌ తెలిపింది. 2025 అక్టోబరు 5న ప్రారంభమైన సీజన్‌ 9 తొలి రోజే 1.5 బిలియన్‌ వ్యూయింగ్‌ మినిట్స్‌ను నమోదు చేసిందని జియోస్టార్‌ తెలిపింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement