కియారాకు సౌత్‌ కలిసిరావట్లేదా? | Kiara Advani Mostly fails in South Movies Why | Sakshi
Sakshi News home page

కియారాకు సౌత్‌ కలిసిరావట్లేదా?

Aug 27 2026 11:50 PM | Updated on Aug 27 2026 11:56 PM

Kiara Advani Mostly fails in South Movies Why

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కియారా అద్వానీకి సౌత్‌ సినిమా పెద్దగా కలిసి రావడం లేదనే టాక్‌ వినిపిస్తోంది. అప్పట్లో కొరటాల శివ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సరసన నటించిన ‘భరత్‌ అనే నేను’ చిత్రం మాత్రమే దక్షిణాదిలో ఆమెకు మంచి విజయాన్ని అందించింది. ఆ తరువాత దక్షిణాదిన ఆమె సినిమా చేసిన ప్రతిసారి ఏదో తేడా కొడుతోంది.

అప్పట్లో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో చేసిన ‘వినయ విధేయ రామ’, తరువాత అదే హీరోతో చేసిన ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రాలు నిరాశపరిచాయి. తాజాగా పాన్‌ ఇండియా రాకింగ్‌ స్టార్‌ యశ్‌ సరసన నటించిన ‘టాక్సిక్‌’ కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదనే టాక్‌ వస్తోంది. దీంతో ‘భరత్‌ అనే నేను’ మినహా సౌత్‌లో కియారా సినిమాలు అన్నీ వరుసగా నిరాశపరుస్తున్నాయి.

ఇక త్వరలోనే కోలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది ఈ భామ. ఓ తమిళ సినిమాకు ఓకే చెప్పానని.. త్వరలో వివరాలు వెల్లడిస్తానని ఇటీవల టాక్సిక్ సినిమా ప్రచారంలో తెలిపింది. ఇక మరోవైపు ముంబైలో సముద్రానికి ఎదురుగా ఓ కొత్త ఫ్లాట్‌ను కియారా కొనుగోలు చేసింది. దాని ఇంటీరియర్‌ పనుల కోసం కొంతకాలం సినిమాలకు విరామం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement