డిసెంబరులో లెగసీ | Vishwak Sen Legacy to release in December | Sakshi
Sakshi News home page

డిసెంబరులో లెగసీ

Aug 28 2026 12:09 AM | Updated on Aug 28 2026 12:09 AM

Vishwak Sen Legacy to release in December

డిసెంబరులో విశ్వక్‌ సేన్‌ ‘లెగసీ’ థియేటర్స్‌కి రానుంది. విశ్వక్‌ సేన్‌ హీరోగా సాయి కిరణ్‌ దైదా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లెగసీ’. ఏక్తా రాథోడ్‌ హీరోయిన్‌గా నటిస్తు్తన్నారు. యశ్వంత్‌ దగ్గుమాటి, సాయికిరణ్‌ రెడ్డి దైదా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌ మదనపల్లె పరిసర ప్రాంతాల్లో గురువారం  ప్రారంభమైంది. విశ్వక్‌ సేన్‌ పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

‘‘మదనపల్లె, పరిసర ప్రాంతాల్లో నెల రోజుల షెడ్యూల్‌ ప్లాన్‌ చేశాం. ఈ చిత్రంలో విశ్వక్‌ సేన్‌ పవర్‌ఫుల్‌ రోల్‌లో కనిపిస్తారు. అధికారం, కుటుంబం, ప్రేమ, ద్రోహం అంశాలతో సాగే ఈ కథలో ఒక వారసుడు ప్రమాదకరమైన ప్రపంచంలోకి అడుగుపెడతాడు. అతను తన తండ్రి గతానికి సంబంధించి దాగి ఉన్న నిజాలను ఎదుర్కొంటూ, శక్తివంతమైన ప్రత్యర్థులతో పోరాడుతూ తనపై పడిన వారసత్వపు భారాన్ని మోసే పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నదే ఈ సినిమా కథనం’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: గోవింద్‌ వసంత.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement