ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా | Venkat Harudu Movie OTT Streaming Now | Sakshi
Sakshi News home page

Harudu OTT: మూడు నెలల తర్వాత తెలుగు మూవీ స్ట్రీమింగ్

Aug 28 2026 3:04 PM | Updated on Aug 28 2026 3:21 PM

Venkat Harudu Movie OTT Streaming Now

దాదాపు 25 ఏళ్ల క్రితం తెలుగు సినిమాల్లో నటుడిగా కెరీర్ ప్రారంచిన వెంకట్.. ఇప్పటికీ అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉన్నాడు. చాన్నాళ్ల తర్వాత హీరోగా చేసిన చిత్రం ఈ ఏడాది థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడీ చిత్రం మూడు నెలల తర్వాత పెద్దగా హడావుడి లేకుండానే స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో ఉంది?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, భలేవాడివి బాసు, శివరామరాజు తదితర సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న వెంకట్.. తర్వాత కాలంలో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయాడు. రీసెంట్ టైంలో అయితే ఓజీ, మా నాన్న సూపర్ హీరో తదితర చిత్రాల్లో సహాయ పాత్రలు చేశాడు. ఇతడు హీరోగా నటించిన 'హరుడు' అనే పోలీస్ డ్రామా మే 15న థియేటర్లలో రిలీజైంది. ప్రేక్షకుల్ని ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడిది ఆహా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. ఇందులో వెంకట్ సరసన హెబ్బా పటేల్, సలోనీ, నటాషా సింగ్ నటించారు.

'హరుడు' విషయానికొస్తే.. ముంబైలో మాఫియాని వణికించిన డీసీపీ శంకర్ అలియాస్ ఎన్‌కౌంటర్ శంకర్.. బదిలీపై హైదరాబాద్‌కి వస్తాడు. రావడం రావడమే క్రిమినల్స్ ఆటకట్టించడం షురూ చేస్తాడు. ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్మే వరదరాజులు (శ్రీహరి పైలా) చేస్తున్న అరాచకాలు శంకర్ దృష్టిలో పడతాయి. నిరుద్యుగులైన కొందరు విద్యార్థులు.. 'ఫుడ్ కోర్ట్' పెట్టుకోవాలనే ఆశతో కార్ల ఇంజిన్స్ దొంగతనం చేస్తూ పోలీసులకు చిక్కుతారు. అయితే వీళ్ల వెనకున్నది ఎమ్మెల్మే అని శంకర్‌కి అర్థమవుతుంది. తన భార్య ప్రియ (నటాషా సింగ్) హత్యకు, ఈ ఇంజిన్ల దొంగతనానికి ఉన్న సంబంధమేంటి? వీటన్నిటిని శంకర్ ఎలా ఛేదించాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

ఈ సినిమాతో పాటు ఈ వారం కేజీక్యూ, ఐ నోబడీ, అన్బే డయానా, ఆల్ఫా, బబితా సింగ్ రిపోర్టింగ్, ఆకలిరాజ్యం 2026, పార్ట్ టైమర్స్, న్యూటన్స్ థర్డ్ లా తదితర చిత్రాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement