breaking news
Harudu Movie
-
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
దాదాపు 25 ఏళ్ల క్రితం తెలుగు సినిమాల్లో నటుడిగా కెరీర్ ప్రారంచిన వెంకట్.. ఇప్పటికీ అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉన్నాడు. చాన్నాళ్ల తర్వాత హీరోగా చేసిన చిత్రం ఈ ఏడాది థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడీ చిత్రం మూడు నెలల తర్వాత పెద్దగా హడావుడి లేకుండానే స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, భలేవాడివి బాసు, శివరామరాజు తదితర సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న వెంకట్.. తర్వాత కాలంలో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయాడు. రీసెంట్ టైంలో అయితే ఓజీ, మా నాన్న సూపర్ హీరో తదితర చిత్రాల్లో సహాయ పాత్రలు చేశాడు. ఇతడు హీరోగా నటించిన 'హరుడు' అనే పోలీస్ డ్రామా మే 15న థియేటర్లలో రిలీజైంది. ప్రేక్షకుల్ని ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడిది ఆహా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. ఇందులో వెంకట్ సరసన హెబ్బా పటేల్, సలోనీ, నటాషా సింగ్ నటించారు.'హరుడు' విషయానికొస్తే.. ముంబైలో మాఫియాని వణికించిన డీసీపీ శంకర్ అలియాస్ ఎన్కౌంటర్ శంకర్.. బదిలీపై హైదరాబాద్‌కి వస్తాడు. రావడం రావడమే క్రిమినల్స్ ఆటకట్టించడం షురూ చేస్తాడు. ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్మే వరదరాజులు (శ్రీహరి పైలా) చేస్తున్న అరాచకాలు శంకర్ దృష్టిలో పడతాయి. నిరుద్యుగులైన కొందరు విద్యార్థులు.. 'ఫుడ్ కోర్ట్' పెట్టుకోవాలనే ఆశతో కార్ల ఇంజిన్స్ దొంగతనం చేస్తూ పోలీసులకు చిక్కుతారు. అయితే వీళ్ల వెనకున్నది ఎమ్మెల్మే అని శంకర్‌కి అర్థమవుతుంది. తన భార్య ప్రియ (నటాషా సింగ్) హత్యకు, ఈ ఇంజిన్ల దొంగతనానికి ఉన్న సంబంధమేంటి? వీటన్నిటిని శంకర్ ఎలా ఛేదించాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఈ సినిమాతో పాటు ఈ వారం కేజీక్యూ, ఐ నోబడీ, అన్బే డయానా, ఆల్ఫా, బబితా సింగ్ రిపోర్టింగ్, ఆకలిరాజ్యం 2026, పార్ట్ టైమర్స్, న్యూటన్స్ థర్డ్ లా తదితర చిత్రాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా) -
యాక్షన్ హీరోలా చూపించారు: వెంకట్
‘‘హరుడు’ సినిమాను పూర్తి చేయడానికి యాక్టింగ్‌తో పాటు నిర్మాతగా కూడా బాధ్యతలు తీసుకో వాల్సి వచ్చింది. నన్ను యాక్షన్ హీరోలా చూపించారు. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన మా సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని హీరో వెంకట్ చెప్పారు. ‘శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి, శివ రామరాజు’ వంటి చిత్రాల్లో నటించిన వెంకట్ హీరోగా నటించిన తాజా సినిమా ‘హరుడు’.హెబ్బాపటేల్, సలోని హీరోయిన్లుగా నటించారు. రాజ్ తాళ్లూరి దర్శకత్వంలో వీఆర్ ఎంటర్టైన్మెంట్స్పై నిర్మించిన ఈ సినిమా మే 8న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రాజ్ తాళ్లూరి మాట్లాడుతూ–‘‘మంచి సినిమాలను మన ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. మా ‘హరుడు’ మూవీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
హీరో వెంకట్ 'హరుడు' రిలీజ్ ఎప్పుడంటే?
శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, ప్రేమ కోసం, శివ రామరాజు తదితర సినిమాలతో అప్పట్లో సక్సెస్ అందుకున్న హీరో వెంకట్.. తర్వాత అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉన్నాడు. గతేడాది రిలీజైన 'ఓజీ'లోనూ పవన్ కల్యాణ్‌కి అన్నగా నటించాడు. ఇతడు హీరోగా చేసిన 'హరుడు' సినిమా విడుదలకు సిద్ధమైంది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్)రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు డాక్టర్.దిక్కల లక్ష్మణ్ రావు, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేశారు. తాజాగా మే 8న చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. హెబ్బా పటేల్ , సలోని , నటషా , అలీ తదితరులు కీలక పాత్రలు పోషించారు.(ఇదీ చదవండి: తెలుగు వాళ్లకు ఈ సినిమా నచ్చితే రూ.1000 కోట్లు) -
హరుడు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన డైరెక్టర్ ఆర్జీవీ.. ఫోటోలు
-
‘శివరామరాజు’ ఫేమ్ వెంకట్ హీరోగా ‘హరుడు’... ఆకట్టుకుంటున్న గ్లింప్స్
శివరామరాజు ఫేమ్ వెంకట్ తొలిసారి మాస్ హీరోగా నటిస్తున్న చిత్రం హరుడు. డాక్టర్ ప్రవీణ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్ తాళ్ళూరి దర్శకుడు. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్న హరుడు చిత్రం గ్లింప్స్ శనివారంనాడు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేశారు.అనంతరం నిర్మాత డాక్టర్ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ, సినిమా ఈ స్థాయికి రావడానికి కారణం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారు. ఈ సినిమా దర్శకుడు రాజ్ తాళ్లూరి రాత్రింబవళ్ళు పనిచేశారు. హీరో వెంకట్, శ్రీహరి, సలోని, హెబ్బా పటేల్ నటించారు. ఇందులోని పాటలు ఆదరణ పొందేలా వున్నాయి. జెన్నా పాటలకు సంగీతం బాగా సమకూర్చారు. ఈరోజు విడుదలైన గ్లింప్స్ చాలా బాగున్నాయి. మంచి విజయం సాధించాలని కోరుకుంటన్నా అన్నారు.దర్శకుడు రాజ్ తాళ్ళూరి మాట్లాడుతూ, ముందుగా నిర్మాత డాక్టర్ ప్రవీణ్ రెడ్డి కి థ్యాంక్స్. ఐదు నిముషాల్లోనే కథ విని ఓకే చేశారు. వెంకట్ గారితో ఐదేళ్ళ జర్నీ వుంది. లవర్ బాయ్ గా చేసిన ఆయన మాస్ హీరోగా ఇందులో చేశారు. నటశాసింగ్ కూడా నటించింది. సంగీత దర్శకుడు జిన్నా, ఎడిటర్ మారుతీ బాగా పనిచేశారు. నాకు దర్శకుల టీమ్ సపోర్ట్ గా వుండడంతో అవుట్ పుట్ బాగా వచ్చింది అన్నారు.హీరో వెంకట్ మాట్లాడుతూ, హరుడు చిత్రం కమర్షియల్ ఎలిమెంట్ తో మాస్ ఎంటర్ టైనర్ గా వుంటుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా 60 శాతం పూర్తయింది. నిర్మాత డాక్టర్ అయినా... సినిమా పై తపనతో వచ్చారు. ఆయనకు మంచి హిట్ పడాలని ఆశిస్తున్నాను. నాకు పవర్ ఫుల్ రోల్ దర్శకులు ఇచ్చారు. మాస్ పాత్ర నేను మొదటిసారి చేశాను. నా పాత్రకు ధీటుగా హెబ్బాపటేల్ పాత్ర వుంటుంది. డబ్బింగ్ లో ఆమె నటన చూశాను. అలాగే నటశాసింగ్ మరో పాత్ర చేసింది. స్పెషల్ సాంగ్ లో సలోని చేశారు. ఇందులో ఐదు పాటలున్నాయి. సంగీత దర్శకుడు మణి జెన్నా మంచి బాణీలు ఇచ్చారు. మాస్ సినిమాకు ఫైట్స్ కీలకం. శివరాజ్ మాస్టర్ బాగా కంపోజ్ చేశారు. లోగడ షూటింగ్ లో నాకు గాయాలు అయ్యాయి. అందుకే కొంత గేప్ కూడా తీసుకున్నాను. ఈ సినిమాలో తగు జాగ్రత్తలు తీసుకుని ఫైట్స్ చేశాను. వచ్చే నెలలో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాం అని చెప్పారు.


