హీరో వెంకట్ 'హరుడు' రిలీజ్ ఎప్పుడంటే? | Venkat Harudu Movie Release Date | Sakshi
Sakshi News home page

హీరో వెంకట్ 'హరుడు' రిలీజ్ ఎప్పుడంటే?

Mar 30 2026 6:14 PM | Updated on Mar 30 2026 6:25 PM

Venkat Harudu Movie Release Date

శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, ప్రేమ కోసం, శివ రామరాజు తదితర సినిమాలతో అప్పట్లో సక్సెస్ అందుకున్న హీరో వెంకట్.. తర్వాత అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉన్నాడు. గతేడాది రిలీజైన 'ఓజీ'లోనూ పవన్ కల్యాణ్‌కి అన్నగా నటించాడు. ఇతడు హీరోగా చేసిన 'హరుడు' సినిమా విడుదలకు సిద్ధమైంది.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్)

రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు డాక్టర్.దిక్కల లక్ష‍్మణ్ రావు, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేశారు. తాజాగా మే 8న చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. హెబ్బా పటేల్ , సలోని , నటషా , అలీ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

(ఇదీ చదవండి: తెలుగు వాళ్లకు ఈ సినిమా నచ్చితే రూ.1000 కోట్లు)

Advertisement
 
Advertisement
Advertisement