సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ | Tamil Actress Janani Wedding Latest | Sakshi
Sakshi News home page

Actress Wedding: గతేడాది నిశ్చితార్థం.. ఇప్పుడు పెళ్లి

Mar 30 2026 5:04 PM | Updated on Mar 30 2026 5:16 PM

Tamil Actress Janani Wedding Latest

హీరోయిన్‌గా తమిళంలో సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ జనని అయ్యర్ (Janani Iyer) ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. గతేడాది ఏప్రిల్‌లో నిశ్చితార్థం చేసుకోగా.. దాదాపు పదకొండు నెలల తర్వాత ఇప్పుడు పైలట్ సాయి రోషన్‌తో ఏడడుగులు వేసింది. తమిళ సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలని జనని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి శివాజీ-లయ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)

201‍1లో వచ్చిన విశాల్-ఆర్య 'వాడు-వీడు' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన జనని.. తర్వాత మలయాళ, తమిళంలో వరస మూవీస్ చేస్తూనే ఉంది. చివరగా 2024లో 'హాట్ స్పాట్'లో ఓ కథానాయికగా నటించింది. ప్రస్తుతం ఈమె చేతిలో మూడు చిత్రాలున్నాయి. అలానే తమిళ బిగ్‌బాస్ రెండో సీజన్‌లోనూ పార్టిసిపేట్ చేసింది గానీ 4వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇప్పుడు పెళ్లి చేసుకుంది. తర్వాత కూడా నటిగా కొనసాగుతుందా లేదా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: తెలుగు వాళ్లకు నచ్చితే ఈ సినిమాకు రూ.1000 కోట్లు)

Advertisement
 
Advertisement
Advertisement