యాక్షన్‌ హీరోలా చూపించారు: వెంకట్‌ | Harudu Movie Trailer Launch Event | Sakshi
Sakshi News home page

యాక్షన్‌ హీరోలా చూపించారు: వెంకట్‌

Apr 12 2026 3:05 AM | Updated on Apr 12 2026 3:05 AM

Harudu Movie Trailer Launch Event

రాజ్‌ తాళ్లూరి, వెంకట్‌

‘‘హరుడు’ సినిమాను పూర్తి చేయడానికి యాక్టింగ్‌తో పాటు నిర్మాతగా కూడా బాధ్యతలు తీసుకో వాల్సి వచ్చింది. నన్ను యాక్షన్‌ హీరోలా చూపించారు. మంచి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన మా సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని హీరో వెంకట్‌ చెప్పారు. ‘శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి, శివ రామరాజు’ వంటి చిత్రాల్లో నటించిన వెంకట్‌ హీరోగా నటించిన తాజా సినిమా ‘హరుడు’.

హెబ్బాపటేల్, సలోని హీరోయిన్లుగా నటించారు. రాజ్‌ తాళ్లూరి దర్శకత్వంలో వీఆర్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌పై నిర్మించిన ఈ సినిమా మే 8న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో రాజ్‌ తాళ్లూరి మాట్లాడుతూ–‘‘మంచి సినిమాలను మన ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. మా ‘హరుడు’ మూవీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement