ఈమె తెలుగు సూపర్‌హిట్ సినిమా హీరోయిన్.. గుర్తుపట్టారా? | Sampangi Movie Actress Kanchi Kaul Latest News | Sakshi
Sakshi News home page

Guess The Actress: అప్పట్లో హిట్ బ్యూటీ.. ఇప్పుడు ఫ్యామిలీతో బిజీ

Aug 30 2026 9:17 PM | Updated on Aug 30 2026 9:17 PM

Sampangi Movie Actress Kanchi Kaul Latest News

తెలుగు సినిమా మహాసముద్రం లాంటిది. ప్రతి ఏడాది పదుల సంఖ్యలో హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అయితే వాళ్లలో సక్సెస్ అందుకుని ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించే భామలు కొందరే ఉంటారు. అలాంటి వాళ్లలో ఈమె ఒకరు. 90స్‌లో వచ్చిన మ్యూజికల్ మూవీతో అద్భుతమైన హిట్ కొట్టింది. ఇప్పుడు మాత్రం ఇలా ఉంది. ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

(ఇదీ చదవండి: జానీ మాస్టర్ భార్యకు షాక్.. పదవి నుంచి తొలగింపు)

పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు కాంచీ కౌల్. శ్రీనగర్‌లో పుట్టి పెరిగిన ఈమె 2001లో వచ్చిన 'సంపంగి' అనే తెలుగు చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. తొలి మూవీనే అయినప్పటికీ సక్సెస్ అందుకుని తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. చెప్పాలంటే ఈ సినిమాలోని పాటలు అప్పట్లో విశేషాదరణ దక్కించుకున్నాయి. ఈ మూవీ తర్వాత 'చెప్పాలని ఉంది', 'ఫ్యామిలీ సర్కస్', 'అశోక్ గాడి లవ్ స్టోరీ', 'శివరామరాజు' లాంటి సినిమాలు కాంచీ చేసింది.

తెలుగు సినిమాలతో పాటు హిందీ చిత్రాల్లోనూ సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా, టీవీ సీరియల్స్‌లోనూ కాంచీ పనిచేసింది. హిందీలో పనిచేస్తున్న టైంలో టీవీ నటుడు షబ్బీర్ అహ్లూవాలియాతో ప్రేమలో పడి అతడిని పెళ్లి చేసుకుంది. షబ్బీర్ హిందీ టీవీ ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘కుంకుం భాగ్య’తో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు. 2013-14లో చివరగా సీరియల్‌లో కనిపించిన కాంచీ తర్వాత పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేసింది. ప్రస్తుతానికైతే భర్త, ఇద్దరు కొడుకులతో కలిసి సంతోషంగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.

(ఇదీ చదవండి: ఆమిర్ నిజంగానే 'గజిని'.. అందుకే మర్చిపోయాడు: సోనమ్ వాంగ్ చుక్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement