తెలుగు యూనియన్ డ్యాన్సర్స్ సంచలన నిర్ణయం | Telugu Union Dancers Seek Raghu Master As New President, Majority Oppose Sumalatha Leadership | Sakshi
Sakshi News home page

తెలుగు యూనియన్ డ్యాన్సర్స్ సంచలన నిర్ణయం

Aug 30 2026 2:37 PM | Updated on Aug 30 2026 8:40 PM

Telugu Dancers Union Propose Raghu Master As President

తెలుగు యూనియన్ డ్యాన్సర్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. కృష్ణానగర్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో సమావేశమై, డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్‌ని ఎన్నుకోవాలని అనుకుంటున్నారు. ఈ మేరకు మెజారిటీ యూనియన్ డాన్సర్స్ తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. ప్రస్తుత డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత కార్యవర్గాన్ని కాకుండా మెజారిటీ డాన్సర్స్ ఎన్నుకొనే రఘు మాస్టర్‌ని ప్రెసిడెంట్‌గా గుర్తించాలని ఫిల్మ్ ఫెడరేషన్‌ని కోరనున్నారు.

ఇప్పటికే సుమలత కార్యవర్గానికి ఫెడరేషన్ సహాయ నిరాకరణ చేస్తోంది. సుమలత కార్యవర్గం బదులుగా రఘు మాస్టర్ కార్యవర్గానికి మద్దతు ఇవ్వాలని మెజారిటీ డాన్సర్స్ కోరనున్నారు. సుమలత ఏక పక్షనిర్ణయాలు, నియంతృత్వ ధోరణితో అసోసియేషన్‌ని పాడు చేశారని, చిరంజీవి వంటి పెద్దలు, ఫిలిం ఛాంబర్ పెద్దలు ఫెడరేషన్ పెద్దలు చెప్పిన వినకుండా ఉప ఎన్నికలు నిర్వహించడంపై మెజారిటీ డాన్సర్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

600 మంది డాన్సర్స్ ఉన్న అసోసియేషన్‌లో ఉప ఎన్నికల్లో పాల్గొన్న వారు కేవలం 116 మంది మాత్రమే.. మెజారిటీ డాన్సర్స్ ఉపఎన్నికల్లో పాల్గొనలేదు. దాదాపు 350 మంది డాన్సర్స్ రఘు మాస్టర్‌తోనే ఉన్నారని యూనియన్ డాన్సర్స్ అంటున్నారు. రఘు మాస్టర్‌కి సపోర్ట్‌గా శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, భాను మాస్టర్, ప్రకాష్ మాస్టర్, విజయ్ పోలాకి మాస్టర్, విజయ్ బిన్నీ మాస్టర్, సృష్టి మాస్టర్ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement