అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘రాకా’. అట్లీ దర్శకత్వంలో కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథనం పునర్జన్మల నేపథ్యంలో ఉంటుందని, వివిధ కాలమానాల్లో సాగుతుందనే ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో అల్లు అర్జున్ త్రి పాత్రాభినయం చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. తాజాగా ఈ చిత్రం గురించి మరో టాక్ వినిపిస్తోంది.
అదేంటంటే... ఈ చిత్రంలో తండ్రి... ఇద్దరు కొడుకులు... ఇలా ట్రిపుల్ రోల్స్ చేస్తున్నారట అల్లు అర్జున్. అంతేకాదు... ఈ మూడు పాత్రల్లో ఒకటి విలన్ రోల్ అని సమాచారం. ఇదే నిజమైతే ‘రాకా’ చిత్రంలో హీరోగా, విలన్‌గా అల్లు అర్జున్ నటన చూడొచ్చు. ఈ సినిమాలోని ఓ లీడ్ రోల్‌లో దీపికా పదుకోన్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది.


