ట్రైలర్: 'ఇరుముడి' తర్వాత వస్తున్న మరో దేవుడి సినిమా | Mahendragiri Varahi Movie Trailer | Sakshi
Sakshi News home page

Mahendragiri Varahi: వారాహి అమ్మవారి శాపం ఓ రహస్యం.. అదరగొట్టిన ట్రైలర్

Aug 28 2026 9:11 PM | Updated on Aug 28 2026 9:11 PM

Mahendragiri Varahi Movie Trailer

రీసెంట్ టైంలో దేవుడి నేపథ్యంత తీసిన సినిమాలు హిట్ అవుతున్నాయి. 'ఇరుముడి'లో తండ్రి కూతురి ఎమోషన్ ఉన్నప్పటికీ ‍అయ్యప్ప స్వామి పాటలు, సీన్స్ కూడా మూవీకి చాలా ప్లస్ అయ్యాయి. ఇప్పుడు మరో దేవుడి కథతో వస్తున్న తెలుగు చిత్రం 'మహేంద్రగిరి వారాహి'. సెప్టెంబరు 11న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంటూ అంచనాలు పెంచేస్తోంది.

(ఇదీ చదవండి: ఓటీటీలో 'ఆకలిరాజ్యం 2026' తెలుగు రివ్యూ)

సుమంత్, ఐశ్వర్య రాజేశ్, సిద్ధు జొన్నలగడ్డ తదితరులు నటించిన ఈ సినిమా.. వారణాసి గ్రామదేవత వారాహీ అమ్మవారి కథతో తెరకెక్కించారు. ట్రైలర్‌లోని విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయి. మూవీ కూడా ఇలానే ఉంటే హిట్ అయ్యే అవకాశముంది. హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్.. ఇందులో వారాహీ అమ్మవారిగా కనిపించనుంది. సిద్ధు జొన్నలగడ్డ అతిథి పాత్ర చేయడం విశేషం.

(ఇదీ చదవండి: 'ఇరుముడి' నాగులు మొత్తం రెమ్యునరేషన్ ఎంతంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement