ఫుల్‌ జోష్‌లో... | Laxman and Srini meeting Ravi Teja | Sakshi
Sakshi News home page

ఫుల్‌ జోష్‌లో...

Aug 29 2026 3:11 AM | Updated on Aug 29 2026 3:11 AM

Laxman and Srini meeting Ravi Teja

శ్రీని, వివేక్‌ ఆత్రేయ, రవితేజ, లక్ష్మణ్‌

‘ఇరుముడి’ సక్సెస్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు రవితేజ. వరుసగా సినిమాలను ప్రకటిస్తున్నారు. రవితేజ హీరోగా హసిత్‌ గోలి డైరెక్షన్‌లోని సినిమా ప్రకటన ఈ వారంలో వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రవితేజ హీరోగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందనున్న మూవీని ప్రకటించారు.

 బ్రిడ్జ్‌ ప్రోడక్షన్స్‌పై లక్ష్మణ్, శ్రీని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘ఇరుముడి’తో సూపర్‌ హిట్‌ అందుకున్న రవితేజను లక్ష్మణ్, శ్రీని కలిసి అభినందించి, ఈ చిత్రాన్ని ప్రకటించారు. ‘‘రవితేజ ఎనర్జీ, స్క్రీన్‌ ప్రెజెన్స్‌కు తగ్గట్లు ఈ సినిమా ఉంటుంది. వివేక్‌ ఆత్రేయ తనదైన శైలిలో రూపొందించే కొత్త ప్రపంచంలోకి రవితేజ అడుగు పెట్టనున్నారు’’ అని నిర్మాతలు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement