ఇదో కొత్త అనుభూతి.. ‘టాక్సిక్‌’పై స్టార్‌హీరోల ప్రశంసలు | Rishab Shetty Sudeep Back Yash Amid Toxic Mixed Response | Sakshi
Sakshi News home page

ఇదో కొత్త అనుభూతి.. ‘టాక్సిక్‌’పై స్టార్‌హీరోల ప్రశంసలు

Aug 30 2026 1:31 PM | Updated on Aug 30 2026 1:41 PM

Rishab Shetty Sudeep Back Yash Amid Toxic Mixed Response

యశ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా టాక్సిక్. గీతూ మోహన్ దాస్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 26న థియేటర్లలో విడుదలైంది. తొలిరోజే నెగెటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా వసూళ్ల పరంగా బాగానే రాణించింది. మొదటి రోజే రూ.140 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. అయితే యాశ్‌ నటించిన ఈ ప్రయోగాత్మక చిత్రానికి కన్నడ చిత్రసీమ నుంచి గట్టి మద్దతు లభిస్తోంది. యశ్‌ను ప్రశంసిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఇలా చేయడానికి ధైర్యం కావాలి
‘ఓ పాత్రను తెరపై ఆవిష్కరించేందుకు నటుడు ఎంతగా కష్టపడతాడో ‘టాక్సిక్‌’లో యశ్‌ చూపించాడు. కథ, పాత్రలు సినిమాల తరహాలో లేకపోయినా కొత్తగా ప్రయాణించడం తప్పు కాదు. మనసులో పుట్టిన ఆలోచనను తెరపై తీసుకురావడం అంత సులభం కాదు. యశ్‌ ఈ సినిమాలో పూర్తిగా లీనమైపోయాడు. ఇలాంటి ప్రయోగం చేయడానికి ముందుకు వచ్చినందుకు హ్యాట్సాఫ్‌’ అంటూ రిషబ్‌ శెట్టి ప్రశంసించాడు.

( యశ్ టాక్సిక్ వసూళ్లు.. రెండో రోజే తేల్చేశారు..!)

‘సాధారణమైన, ఊహించని మార్గాన్ని ఎంచుకోకుండా కొత్తగా ప్రయత్నించారు. ఇలాంటి సినిమా చేయడానికి నమ్మకం, ధైర్యం అవసరం. టాక్సిక్‌ అసాధారణమైన, ప్రశంసించదగన ప్రయత్నం’ అంటూ కిచ్చా సుదీప్‌ సైతం పేర్కొన్నాడు.
‘టాక్సిక్‌ ఒక ఫెయిరీ టేల్‌. కానీ పెద్దల కోసం. అద్భుతమైన సినిమా. సరికొత్త ప్రపంచం, పూర్తిగా కొత్త అనుభూతి. యశ్‌తో పాటు మొత్త చిత్రబృందానికి హ్యాట్సాఫ్‌’ అంటూ నటుడు ఉపేంద్ర పోస్ట్‌ చేశారు.

ఇదీ చదవండి: రాసింది ఒకటి.. తీసింది మరోకొటి.. ‘టాక్సిక్‌’ దర్శకురాలి వ్యాఖ్యలు వైరల్‌
అసలు టాక్సిక్‌లో ఏం చూపించారంటే..
గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వం వహించిన టాక్సిక్‌ గ్యాంగ్‌ స్టార్‌ డ్రామాగా తెరకెక్కించారు. పోర్చిగీసు కాలం నాటి గోవా నేపథ్యాన్ని జోడించి తీశారు. యశ్‌ పోషించిన రాయా అనే పాత్ర నేరాలు చేయడానికి గల కారణాలు ఏంటి? అతడితో సోదరి అనుభందం ఏంటి? అనే అంశాల చుట్టు కథ నడుస్తూ ఉంటుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement