రెండు దశాబ్దాలు దాటిన అగ్ర కథానాయకిగా నటిస్తున్న అతి కొద్దిమంది హీరోయిన్లలో నయనతార ఒకరు. తమిళంలో అయ్యా చిత్రం ద్వారా కథానాయకిగా తన సినీ పయనాన్ని ప్రారంభించిన నయనతార ఆ తర్వాత వరుస విజయాలతో క్రేజీ హీరోయిన్‌గా మారారు. అలా తమిళం, తెలుగు, మలయాళం, హిందీ తదితర భాషల్లో నటిస్తూ దక్షిణాదిలోని అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కథానాయకి స్థాయికి ఎదిగారు. నానుమ్ రౌడీదాన్ చిత్ర షూటింగ్ సమయంలో దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో పరిచయం ప్రేమగా మారి , అది పెళ్లికి దారి తీసింది. ఆ తర్వాత నయనతార సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి అయిన విషయం తెలిసిందే. వారికి ఉలగం, ఉయిర్ అని నామకరణం చేశారు.
(చదవండి: ‘ఇరుముడి’ హిట్.. రవితేజ కీలక నిర్ణయం!)
ఇకపోతే కెరియర్ పరంగా ఇప్పటికీ పలు భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న నయనతార నటించిన తాజా చిత్రాల్లో కన్నడంలో యష్‌తో కలిసిన పాన్ ఇండియా చిత్రం టాక్స్, అదేవిధంగా తను కథానాయకిగా నటించి నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరించిన హాయ్ చిత్రం ఇటీవల ఒకేసారి తెరపైకి వచ్చాయి.
ఈ సందర్భంగా నటి నయనతార ఒక భేటీలో పేర్కొంటూ నటిగా, అమ్మగా సక్రమంగా బాధ్యతలు నిర్వహించడం అంత సులభమైన విషయం కాదన్నారు. అయితే కొడుకులు ఉయిర్, ఉలగం తనకు పెద్ద బలంగా నిలిచారన్నారు. కుటుంబ మద్దతు చాలా ముఖ్యం అన్నారు. తాను తన పిల్లలతో గడిపేటప్పుడు వారికే పూర్తిగా సమయాన్ని కేటాయిస్తానన్నారు. ఇతర పనులపై దృష్టి సారించనని, అదే తనకు మానసిక బలాన్ని చేకూరుస్తుందని నయనతార పేర్కొన్నారు.


