ఓటీటీలోకి 'కొరియన్ కనకరాజు'.. అధికారిక ప్రకటన | Varun Tej Korean Kanakaraju Movie OTT Release Date Confirmed, Check Out Streaming Platform Details Inside | Sakshi
Sakshi News home page

Korean Kanakaraju OTT: తెలుగు హారర్ కామెడీ సినిమా.. ఓటీటీలోకి ఎప్పుడంటే?

Aug 30 2026 4:47 PM | Updated on Aug 30 2026 6:14 PM

Korean Kanakaraju OTT Release Date Update

ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. మెగా హీరో వరుణ్ తేజ్ చేసిన హారర్ కామెడీ మూవీ 'కొరియన్ కనకరాజు'. గత నెలలో థియేటర్లలో రిలీజైంది. సూపర్ కాకపోయినప్పటికీ ప్రేక్షకుల్ని మంచి స్పందన రాబట్టుకుని చెప్పుకోదగ్గ వసూళ్లు కూడా సాధించింది. ఇదే ఇప్పుడు ‍స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది.

(ఇదీ చదవండి: ఓటీటీలో 'ఆకలిరాజ్యం 2026' తెలుగు రివ్యూ)

సాధారణంగా హారర్ అంటే మన దేశ నేపథ్యంగానే తీస్తుంటారు. కానీ ఈ సినిమాలో మాత్రం హీరో ఒంటిలోకి కొరియన్ ఆత్మ ప్రవేశిస్తుంది. తద్వారా వచ్చే కామెడీని బేస్ చేసుకుని తెరకెక్కించారు. వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ నటించింది. సత్య కీలక పాత్ర చేశాడు. మేర్లపాక గాంధీ దర్శకుడు. ఆగస్టు 07న థియేటర్లలో రిలీజ్ కాగా ఇప్పుడు సెప్టెంబరు 04 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి తీసుకురానున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు. అధికారికంగా నెట్‌ఫ్లిక్స్ అప్‌డేట్ ఇచ్చేసింది.

'కొరియన్ కనకరాజు' విషయానికొస్తే.. ఓ వ్యక్తి చనిపోతాడు. అతడి అస్తికల్ని కొరియన్ కుండలో ఉంచుతారు. అనుకోకుండా అగ్ని ప్రమాదం లాంటిది జరిగి ఆ కుండ కనిపించకుండా పోతుంది. అది అలా అలా చేతులు మారి అనూహ్యంగా అనంతపురం చేరుతుంది. కట్ చేస్తే పెనుకొండలో ఉండే కనకరాజు (వరుణ్ తేజ్)కి కోపం ఎక్కువ. ఆ కోపంలో ఎవర్నైనా చితకబాదుతాడు. అదే ఊరిలో చైత్ర (రితికా నాయక్) కియా కంపెనీలో ఉద్యోగం చేస్తుంటుంది. ఇదిలా ఉండగా ఆ అనంతపురం వచ్చిన అస్తికల కుండ ఒక బార్‌కి చేరుతుంది.

అయితే ఒకరోజు గొడవలో కనకరాజు.. ఆ అస్తికల కుండతో ఒకడిని కొట్టడంతో దాని మూత ఊడుతుంది. దాని డిజైన్ ఎదో బాగుందనుకుని అందులో మందు మిక్స్ చేసుకుని తాగుతాడు. అంతే అందులో ఉన్న కొరియన్ ఆత్మ కనకరాజుని ఆవహిస్తుంది. తర్వాత ఏమైంది? ఆ కొరియన్ ఆత్మ ఎవరిది? అది చేసే పనులేంటి? కనకరాజు ఆ ఆత్మ బారి నుంచి ఎలా తప్పించుకున్నాడనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement