పంబ, నిలక్కల్‌లో 'హరివరాసనం' షూటింగ్ | Harivarasanam Movie Shooting Update | Sakshi
Sakshi News home page

పంబ, నిలక్కల్‌లో 'హరివరాసనం' షూటింగ్

Aug 30 2026 3:26 PM | Updated on Aug 30 2026 3:26 PM

Harivarasanam Movie Shooting Update

శబరిమల నేపథ్యంలో తీస్తున్న కొత్త సినిమా 'హరివరాసనం'. దీని షూటింగ్ కొత్త షెడ్యూల్ పంబలో ప్రారంభమైంది. ప్రముఖ నటుడు సైజు కురుప్, తమిళ కమెడియన్ యోగి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం నిలక్కల్, పంబ, త్రివేణి పరిసర ప్రాంతాలలో ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. రాజేష్ నాయర్ దర్శకత్వం వహిస్తుండగా డాక్టర్ అంబాడి స్క్రీన్‌ప్లే సమకూర్చారు. వినాయక్ అజిత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

​షూటింగ్ అనుమతుల విషయంలో కేరళ హైకోర్టు జోక్యం అనంతరం, చిత్ర బృందం ట్రావెన్‌కోర్ దేవస్వోం బోర్డు (TDB), అటవీ శాఖల నుంచి అవసరమైన అన్ని అనుమతులు తీసుకుని చిత్రీకరణ కొనసాగిస్తోంది. ​సన్నిధానం, పదునెట్టాంబడి సెట్ తిరువనంతపురంలోని చిత్రాంజలి స్టూడియోలో శబరిమల సన్నిధానం, పవిత్రమైన 18 మెట్ల (పదునెట్టాంబడి) భారీ ప్రతిరూప సెట్‌ని నిర్మించారు. ఈ చిత్రానికి'మాళికాపురం' ఫేమ్ రంజిన్ రాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement