డబ్బు కోసం పామర్రు పోలీసులు వేధిస్తున్నారు | Complaint against police in High Court | Sakshi
Sakshi News home page

డబ్బు కోసం పామర్రు పోలీసులు వేధిస్తున్నారు

Aug 1 2026 4:43 AM | Updated on Aug 1 2026 4:43 AM

Complaint against police in High Court

హత్య కేసులో సాక్షి ఆరోపణ 

రూ. లక్షన్నర ఇవ్వాలని వేధిస్తున్నారన్న బాధితుడు 

ఎస్పీకి ఫిర్యాదు చేసినా చర్యలు లేకపోవడంతో హైకోర్టులో ఫిర్యాదు 

సాక్షి ప్రతినిధి, విజయవాడ: హత్య కేసులో సాక్షినైన తనను డబ్బు కోసం పోలీసులు వేధిస్తున్నాడంటూ ఓ వ్యక్తి తీవ్ర ఆరోపణలు చేయడం పోలీ­సు శాఖలో కలకలం రేపింది. కృష్ణా జిల్లా పామర్రు సీఐ, ఎస్సై తనను లక్షా యాభై వేల రూపాయలు లంచం ఇవ్వా­లని, లేదంటే ఒక హత్య కేసులో ఇరికిస్తామంటూ వేధిస్తున్నారని కొలు­సు అయ్యప్ప శుక్రవారం మీడియా ఎదుట వాపోయాడు. కొలుసు అయ్యప్ప తన అత్తను మామ కొట్టి చంపిన కేసులో సాక్షిగా ఉన్నాడు. డబ్బు కోసం తనను సీఐ కొట్టాడని, కానిస్టేబుల్‌ను పలుమార్లు ఇంటికి, పనిచేసే చోటకి పంపించి వేధిస్తున్నారని తెలి­పాడు. 

తాము తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించాలని, లేదంటే లక్షన్నర రూపాయలు ఇవ్వాల్సిందేనంటూ సీఐ, ఎస్‌ఐ తనను వేధిస్తున్నారని ఆరో­పించాడు. ఈ విషయంపై తాను సీఐ, ఎస్‌ఐతో మాట్లాడిన ఆడియో రికార్డులను కృష్ణా జిల్లా ఎస్పీకి అందచేసి ఫిర్యాదు చేశానని, అయినా చర్యలు తీసుకోకపోవడంతో పోలీసుల వేధింపులపై కోర్టును ఆశ్రయించానని చెప్పా­డు. 

పోలీసులు లంచం డిమాండ్‌ చేసిన ఆడియో రికార్డులను అయ్యప్ప తరపు న్యాయవాది కోర్డుకు సమర్పించాడు. శుక్రవారం హైకోర్టులో జరిగిన విచారణలో అయ్య­ప్ప దొంగతనం చేశాడని పోలీసులు ఆరోపించారు. అయితే మూడు నెలలు అయినా ఇప్పటివరకూ కేసు ఎందుకు నమోదు చేయలేదని పోలీసులను న్యా­య­మూర్తి నిలదీసినట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement