టీడీపీ నేత వేధింపులు తాళలేక వైఎస్సార్‌సీపీ నేత ఆత్మహత్య | Chittoor: YSRCP Leader Dies After Alleged Harassment by TDP Leader | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత వేధింపులు తాళలేక వైఎస్సార్‌సీపీ నేత ఆత్మహత్య

Jul 31 2026 8:04 PM | Updated on Jul 31 2026 8:12 PM

Chittoor: YSRCP Leader Dies After Alleged Harassment by TDP Leader

సాక్షి,చిత్తూరు: టీడీపీ నేత వేధింపులు తాళలేక వైఎస్సార్‌సీపీ నేత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. చిత్తూరు జిల్లా పలమనేరులో టీడీపీ నేత శ్రీనివాసులు వేధింపులు తాళలేక వైఎస్సార్‌సీపీ నేత కృష్ణప్ప ఆత్మహత్యకు పాల్పడ్డారు. గడ్డురు కాలనీ సమీపంలోని మామిడి తోపులో ఆయన ఉరివేసుకున్నారు. 

కృష్ణప్ప ఆత్మహత్యకు టీడీపీ నేత శ్రీనివాసులే కారణమని ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీగా విలపించారు. నిందితుడైన శ్రీనివాసులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఘటనపై పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ స్పందించారు. కృష్ణప్ప కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని హామీ ఇస్తూ, బాధ్యుడైన నేతపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement