సాక్షి,అమరావతి: గుంటూరులో కిడ్నాప్ కలకలం రేపుతోంది. వ్యాపారవేత్త మాదల శ్రీనివాస్‌ను ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వర్గం కిడ్నాప్‌కు యత్నించింది. ఈ క్రమంలో వ్యాపారవేత్త శ్రీనివాస్ పట్టాభిపురం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
శుక్రవారం సాయంత్రం మా ఇంటికి కొంతమంది వ్యక్తులు వచ్చారు. నన్ను కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. స్వయంగా రఘురామకృష్ణరాజే నాకు ఫోన్ చేశారు. తాను పంపిన వాళ్లతో రావాలని బెదిరించారు. రఘురామకృష్ణరాజుకు చెందిన కంపెనీలను బ్యాంక్ ఆక్షన్‌లో కొనుగోలు చేశా. రఘురామకృష్ణరాజుతో నాకు ప్రాణహాని ఉంది. నాకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరా’అని వ్యాపారవేత్త మాదల శ్రీనివాస్ తెలిపారు.


