స్పై డ్రామా సినిమా 'సీక్రెట్ సోల్జర్' ట్రైలర్ రిలీజ్ | Secret Soldier Movie Trailer | Sakshi
Sakshi News home page

స్పై డ్రామా సినిమా 'సీక్రెట్ సోల్జర్' ట్రైలర్ రిలీజ్

Aug 30 2026 3:14 PM | Updated on Aug 30 2026 3:14 PM

Secret Soldier Movie Trailer

నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా చేసిన సినిమా 'సీక్రెట్ సోల్జర్'. అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకుడు. స్పై డ్రామా కథతో దీన్ని తెరకెక్కించారు. సెప్టెంబర్ 18న మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు. హైదరాబాద్‌లో శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన డైరెక్టర్ శైలేష్ కొలను, రైటర్ బీవీఎస్ రవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రైటర్, డైరెక్టర్ బీవీఎస్ రవి మాట్లాడుతూ.. “సీక్రెట్ సోల్జర్ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సెన్సార్‌లోనే 8 నెలల పాటు ఈ సినిమా ఉందని విన్నాను. కచ్చితంగా అందరికీ నచ్చడం వల్లే సెన్సార్ నుంచి బయటకు వచ్చింది. నిర్మాత ఈ మూవీ కోసం తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చుపెట్టి తీశారు. ఖచ్చితంగా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని చెప్పారు.

హీరో నిహాల్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కు వెళ్లిన సినిమాల్లో ‘దురంధర్’, సల్మాన్ ఖాన్ సినిమా, మూడోది మా సినిమా. అంత పెద్ద సినిమా ఇది. మా సినిమాలో ఉన్న ఐడియా, ఎఫర్ట్, విజువల్‌ను చూడండి. చాలా అద్భుతమైన సినిమా తీశామని చెప్పుకొచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement