breaking news
Nihal Kodhaty
-
రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
తెలుగు సినిమాలు ఎప్పటికప్పుడు థియేటర్లలో రిలీజ్ అవుతూనే ఉంటాయి. కాకపోతే వీటిలో ఓటీటీ, టీవీలోకి వచ్చేవి మాత్రం చాలా తక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. కొన్నింటికి నెలలు లేదంటే ఏళ్ల తర్వాత మోక్షం దక్కుతుంది. అలా దాదాపు రెండేళ్ల తర్వాత ఓ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: సినిమా వివాదం.. 'సలార్' విలన్ కి నోటీసులు)నిహాల్, ద్రిషిక చందర్ నటించిన మిస్టరీ థ్రిల్లర్ సినిమా 'ద స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫల్ గర్ల్'. 2023 మే 12న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రంలో స్టార్స్ లేకపోవడంతో ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఇప్పుడు దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి ఎలాంటి హడావుడి లేకుండా వచ్చేసింది. ప్రస్తుతం రూ.99కు రెంట్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.'ద స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫల్ గర్ల్' విషయానికొస్తే.. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ చరిత్ర (ద్రిషిక) కనిపించకుండా పోతుంది. దీంతో ఐపీఎస్ ఆఫీసర్ ఆదిత్య రంగంలోకి దిగుతాడు. విక్రమ్ అనే వ్యక్తిని కలుస్తాడు. ఇతడి చెప్పిన దానిబట్టి రవి (నిహాల్)తో చరిత్ర ప్రేమలో ఉందనే విషయం బయటపడుతుంది. మరి ఆదిత్య.. చరిత్ర ఆచూకీ కనుగొన్నాడా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 18 మూవీస్) -
ఓ యువతి కథ
కర్ణాటక రాష్ట్రంలో హళిబేడు ఆలయానికి సమీపంలో ఉన్న గిరిజన తండాలో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా నిర్మాత కేఎస్ రామారావు పర్యవేక్షణలో తెరకెక్కిన పీరియాడికల్ ఫిల్మ్ ‘శాంతల’. నిహాల్ కోదాటి, అశ్లేషా ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించగా, వినోద్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో నటించారు. ఇండో అమెరికన్ ఆర్ట్స్ పతాకంపై డా. యిర్రంకి సురేష్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 17న తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ, హిందీ, మరాఠీ భాషల్లో విడుదల కానుంది. ‘‘ఓ గిరిజన తండాలో అమాయక స్త్రీలను చెరబట్టే అరాచకానికి ఒడిగడుతున్న ఒక కామాంధుడి బారి నుండి విముక్తి ΄పొందిన ఒక యువతి కథే ‘శాంతల’ చిత్రకథ. బేలూరు, హళిబేడు జంట దేవాలయాల వద్ద అత్యంత సుందరమైన సన్నివేశాలు, పాటలను చిత్రీకరించాం. అలాగే కీలక సన్నివేశాలను కర్ణాటకలోని మారుమూల ప్రాంతాల్లో దర్శకుడు శేషు పెద్దిరెడ్డి నిర్దేశకత్వంలో కేఎస్ రామారావు షూటింగ్ కార్యక్రమాలను నిర్వహించారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్. -
`ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్` మూవీ రివ్యూ
టైటిల్ : ది స్టోరీ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ నటీనటులు : నిహాల్ కోదాటి, దృషిక చందర్, మధు నందన్, భార్గవ్ పోలుదాస్ తదితరులు నిర్మాతలు : ప్రసాద్ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వరపు దర్శకత్వం: రవి ప్రకాశ్ బోడపాటి విడుదల తేది: మే 12, 2023 కథేంటంటే.. ప్రముఖ వాయిస్ ఆర్టిస్ట్ చరిత్ర(దృషికా చందర్)మిస్సింగ్ కేసుతో కథ ప్రారంభమవుతుంది. ఒక సెలబ్రెటీ మిస్ అవ్వడంతో ఈ వార్త రాష్ట్రంలో సంచలనంగా మారుతుంది. ఈ కేసును విచారించడం కోసం ఢిల్లీ నుంచి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆదిత్య (భార్తవ పోలుదాసు) రంగంలోకి దిగుతాడు. చరిత్ర కేసును విచారించే క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త విక్రమ్(సమర్థ్ యుగ్)తో ఆమెకు సన్నిహిత సంబంధం ఉందని గుర్తిస్తారు. అతన్ని విచారించగా.. చరిత్ర తప్పిపోయిన రోజు తనతో కలిసి డేట్‌కి వెళ్లిన మాట నిజమేనని.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని చెబుతాడు. ఆ తర్వాత కేసు గురించి కొన్ని వివరాలు కావాలంటే.. పోలీసులకు టైమ్ ఇవ్వకుండా తప్పించుకుంటాడు. మరోవైపు ఇదే కేసులో చరిత్రకు క్లోజ్‌గా ఉన్న రవి(నిహాల్ కోదాటి)ని విచారిస్తారు. అతను ఒక జీవిత భీమా ఏజెంట్. చిన్నప్పటి నుంచి చరిత్రతో కలిసి ఉంటాడు. ఇద్దరు ప్రేమించుకున్నామని, గత రెండు నెలలుగా చరిత్ర తనకు దూరంగా ఉంటుందని చెబుతాడు. అసలు చరిత్ర ఎలా మిస్ అయింది? రవిని ప్రేమించిన చరిత్ర విక్రమ్‌తో ఎందుకు డేట్‌కి వెళ్లింది? ఆమె బతికే ఉందా? చనిపోయిందా? ఆమెని మిస్సింగ్ వెనుక ఉన్నదెవరు? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆదిత్య ఐపీఎస్ ఈ కేసును ఎలా విచారించాడు? ఈ నేపథ్యంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? అసలు నిందితుడు ఎవరు? అనేది తెలియాలంటే ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ మూవీ చూడాల్సిందే. ఎలా ఉందంటే... బ్లాక్మెయిల్ మాఫియా అమ్మాయిల జీవితాలతో ఎలా ఆడుకుంటుందనేని ఈ సినిమా ద్వారా చూపించారు. ఆన్లైన్ వేదికగా అమ్మాయిలకు ఎలాంటి వేధింపులు ఎదురవుతన్నాయనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కించారు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. అయితే దానికి తెరరూపం ఇవ్వడంలో కాస్త తడబడ్డాడు. అయితే చరిత్రకు ఏమైంది? ఎవరు కిడ్నాప్ చేశారు? అసలు బతికుందా లేదా? అనే థ్రిల్లింగ్ పాయింట్స్‌ని చివరి వరకు రివీల్ చేయకుండా ప్రేక్షకుడికి క్యూరియాసిటీ కలిగించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. చరిత్ర మిస్సింగ్‌కి అసలు కారకులు ఎవరనేది రిలీల్ చేసే ట్విస్ట్ ఊహించని విధంగా మలిచాడు. చరిత్ర మిస్సింగ్.. విచారణ కోసం స్పెషల్ టీమ్ రంగంలోకి దిగడం... రవి, చరిత్రల లవ్‌స్టోరీతో ఫస్టాఫ్ ఇంట్రెస్టింగ్ సాగుతుంది. ఇక సెకండాఫ్‌లో చరిత్ర మిస్సింగ్‌కి గల కారణాలు ఒక్కోక్కటి రివీల్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో కథ చాలా వరకు అక్కడక్కడే తిరిగిందనే ఫీలింగ్ కలుగుతుంది. స్లో నెరేషన్ కూడా ఇబ్బందిగా మారుతుంది. ఇన్వెస్టిగేషన్లో కొన్నిసీన్లు అనవసరం అనిపిస్తుంది. రవి, చరిత్ర లవ్ స్టోరీ, వారి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు కొత్తగా ఉంటాయి. యూత్‌ని బాగా ఆకట్టుకునేలా ఉంటాయి. ఎవరెలా చేశారంటే.. రవి పాత్రకి నిహాల్ కోదాటి న్యాయం చేశాడు. పూర్ బాయ్‌గా, గొప్ప ప్రేమికుడిగా చక్కగా నటించాడు. ఇక చరిత్రగా దృషికా చందర్ అద్భుతంగా నటించింది. నిహాల్, దృషికాల కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా భార్గవ పోలుదాసుసెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేశారు. ఎస్సై బాషాగా మధునందన్ కూడా డీసెంట్ పెరఫార్మన్స్ చేశారు. ఇక నెగెటివ్ షేడ్స్ ఉన్న విక్రమ్ పాత్రలో సమర్థ్ యుగ్ ఒదిగిపోయాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. గిడియన్ కట్టా సంగీతం పర్వాలేదు. పాటలు బాగున్నాయి. కానీ బీజీఎం యావరేజ్‌గా అనిపిస్తుంది. అమర్ దీప్ గుత్తుల సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని అందంగా చూపించారు. ఎడిటర్ ప్రవీణ్ పూడి తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని అనవసరపు సన్నివేశాలను ఉన్నాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్‌గా కట్ చేస్తే బాగుండేదేమో. నిర్మాత విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి.