దేశభక్తి రగిలించేలా ‘భగ భగ..’ సాంగ్‌ | Bhaga Bhaga Song Out From China Piece | Sakshi
Sakshi News home page

దేశభక్తి రగిలించేలా ‘భగ భగ..’ సాంగ్‌

Jan 23 2026 8:30 AM | Updated on Jan 23 2026 8:30 AM

Bhaga Bhaga Song Out From China Piece

నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం ‘చైనా పీస్‌’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేసింది. యూనిక్ కాన్సెప్ట్,  ప్రెజెంటేషన్‌, యాక్షన్‌, థ్రిల్ ,హ్యుమర్ ఎలిమెంట్స్ తో టీజర్ సినిమా పై అంచనాలు పెంచింది. 

తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి భగ భగ సాంగ్ రిలీజ్ చేశారు. కంపోజర్ కార్తిక్  దేశభక్తి రగిలించేలా ఈ పాటని స్వపరిచారు. కాల భైరవ పవర్ ఫుల్ వోకల్స్ సాంగ్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళింది. తన పదాలని ఆయుధాలుగా మార్చి రెహమాన్ రాసిన లిరిక్స్ అందరినీ హత్తుకున్నాయి. ఫిబ్రవరి చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement