breaking news
China Piece Movie
-
'చైనా పీస్' టీజర్ రిలీజ్.. మెచ్చుకున్న సందీప్ కిషన్
నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ లీడ్ రోల్స్ చేసిన సినిమా 'చైనా పీస్'. అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకుడు. స్పై డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇదివరకే ఫొటోలు, వీడియోలు రాగా.. ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు. హీరో సందీప్ కిషన్ టీజర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొని మూవీని ప్రశంసించారు. యూనిక్ కాన్సెప్ట్, ప్రెజెంటేషన్, యాక్షన్, థ్రిల్ ,హ్యుమర్ ఎలిమెంట్స్ తో టీజర్ ఆకట్టుకుంటోంది.(ఇదీ చదవండి: బేబీ బంప్తో తొలిసారి కనిపించిన మెగా కోడలు)కొత్త ఫిలిం మేకర్స్, కొత్తవాళ్లు నటించినప్పుడు ఆ సినిమాకు వెళ్లి వాళ్ళ ఆలోచనని చూడడం బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. టీజర్ చాలా బాగుంది. సినిమా కూడా చాలా బాగుంటుందని కోరుకుంటున్నానని సందీప్ కిషన్ అన్నాడు. ఈ సినిమా చేతికి రావడానికి రెండేళ్లు పట్టింది. నిజంగా కలలు కని దానికి 100 శాతం కష్టపడితే గొప్ప పనులన్నీ జరుగుతాయనే నమ్మకం కుదిరింది. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని హీరో నిహాల్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
'చైనా పీస్' మూవీలో వాలిగా నిహాల్
నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటిస్తున్న సినిమా 'చైనా పీస్'. అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా నిహాల్ పుట్టినరోజు సందర్భంగా అతడు చేస్తున్న వాలి పాత్ర ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కోర్ట్'.. ఆ రోజే స్ట్రీమింగ్ కానుందా?)ఇకపోతే ఈ సినిమాకు కార్తీక్ రోడ్రిగ్జ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకోగా.. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
భారత్-చైనా సంబంధాల ఇతివృత్తంతొ ‘చైనా పీస్’
నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రలలో అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "చైనా పీస్". రిపబ్లిక్ డే సందర్భంగా పాన్ ఇండియా స్టార్ హీరో నిఖిల్ సిద్ధార్థ ఈ చిత్రం ఫస్ట్ లుక్, హై కాన్సెప్ట్ పోస్టర్ను లాంచ్ చేశారు. లిప్స్టిక్ , యుఎస్ బీ డ్రైవ్ ఇమేజ్ కాంబినేషన్ ని మిక్స్ చేస్తూ ఆసక్తికరంగా చూపిస్తూ ఒక మిసైల్ ని పోలివున్న ఈ పోస్టర్ చాలా క్యురియాసిటీని పెంచింది. దేశభక్తి, భారతదేశం-చైనా సంబంధాల ఇతివృత్తంతో ఈ కథ ఉండబోతుందని పోస్టర్ సూచిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఒక డిఫరెంట్ సినిమాటిక్ జర్నీని ప్రామిస్ చేస్తోంది. మూన్ లైట్ డ్రీమ్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో హర్షిత, శ్రీషా నూలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు.