నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా తెరకెక్కిస్తోన్న స్పై డ్రామా చైనా పీస్. ఈ మూవీని అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ సినిమాను మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా అభిమానులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో హర్షిత, శ్రీషా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా జేమ్స్ బాండ్ అనే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటకు దినేష్ కక్కర్ల లిరిక్స్ అందించగా.. స్పూర్తి జితేందర్, హారిక నారాయణ్ ఆలపించారు. ఈ పాటకు కార్తీక్ రోడ్రిగ్స్ సంగీతమందించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు.


