మరోసారి ప్రేక్షకుల ముందుకు ప్రభాస్‌, త్రిష..! | Prabhas Blockbuster Movie Varsham Set For 4K Re-Release In Theatres On His Birthday, Check Release Date Inside | Sakshi
Sakshi News home page

మరోసారి ప్రేక్షకుల ముందుకు ప్రభాస్‌, త్రిష..!

Aug 30 2026 4:59 PM | Updated on Aug 30 2026 6:21 PM

Prabhas Blockbuster Movie To Re-Release In Theatres

టాలీవుడ్‌లో ప్రస్తుతం రీరిలీజ్‌ ట్రెండ్‌ కొనసాగుతోంది. స్టార్‌ హీరోల పుట్టినరోజున వారి బ్లాక్‌బాస్టర్‌ సినిమాలను మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే మహేశ్‌బాబు, చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ల చిత్రాలు రీరిలీజ్‌ అయ్యి ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు ఈ తరహాలోనే రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించిన ‘వర్షం’ సినిమా రీరిలీజ్‌ కానున్నట్లు తెలుస్తోంది.
అక్టోబర్‌ 23వ తేదీన?
ప్రభాస్‌ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రం వర్షం. ఈ చిత్రాన్ని మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నాట్లు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ పుట్టినరోజు అక్టోబర్‌ 23న ఈ సినిమా రీరిలీజ్‌ చేయనున్నట్లు సమాచారం. అయితే ఈసారి 4కే అల్ట్రా హెచ్‌డీ ఫార్మాట్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాన్నారట. అయితే ఎన్ని థియేటర్లలో రిలీజ్‌ చేస్తున్నారు. అనే పూర్తి సమాచారం త్వరలోనే ప్రకటించనున్నారు.
2004లో విడుదలై..
2004లో విడుదలైన వర్షం చిత్రాన్ని శోభన్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడిగా త్రిష నటించింది. గోపిచంద్‌ విలన్‌గా కనిపించాడు. సుమంత్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఎం.ఎస్‌ రాజు నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇన్నేళ్లు గడిచినా.. ఇందులోని పాటలు, కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ యూత్‌కి ఫేవరెట్‌గానే ఉన్నాయి. 

ఇదీ చదవండి: ట్రెండింగ్‌లో 'ఏష నాగుల'... టాలీవుడ్‌ను ఏలుతున్న తెలంగాణ ఫోక్!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement