ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ | Panchanama Series OTT Telugu Release Date | Sakshi
Sakshi News home page

Panchanama OTT: తెలుగు థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Aug 29 2026 6:13 PM | Updated on Aug 29 2026 6:36 PM

Panchanama Series OTT Telugu Release Date

ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ వస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా వివిధ భాషల్లో రిలీజయ్యే థ్రిల్లర్స్ వీలైనంత ఎక్కువగా ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే దాదాపు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ అన్నీ ఈ జానర్‌లోని సినిమాలు, సిరీస్‌లని స్ట్రీమింగ్‌లోకి తీసుకొస్తుంటాయి. ఇప్పుడు అలానే ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రిలీజ్ డేట్ ప్రకటించారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా)

'ప్రేమిస్తే' లాంటి డబ్బింగ్ బొమ్మతోపాటు పలు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు భరత్.. ప్రధాన పాత్ర చేసిన తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ 'పంచనామా'. మేధారెడ్డి, ఉదయభాను కీలక పాత్రలు చేశారు. సెప్టెంబరు 11 నుంచి జీ5 ఓటీటీలో దీన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ అనౌన్స్‌మెంట్ వీడియోని వదిలారు.

యాంకర్‌గా చాలా గుర్తింపు తెచ్చుకున్న ఉదయభాను.. పెళ్లి తర్వాత కొంత గ్యాప్ ఇచ్చింది. చాన్నాళ్లకు మళ్లీ యాంకరింగ్, మరోవైపు యాక్టింగ్ చేస్తూ కాస్తంత బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉంది. అలా ఈ సిరీస్‌లోనూ నటించింది. మరి 'పంచనామా' ఏమైనా ఉదయభాను ఫేట్ మారుస్తుందేమో చూడాలి?

(ఇదీ చదవండి: ఓటీటీలో 'ఆకలిరాజ్యం 2026' తెలుగు రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement