తెలుగు హీరో సుహాస్ ఈ మధ్య కాస్త స్పీడు తగ్గించాడు. గత రెండేళ్లలో దాదాపు 10కి పైగా సినిమాల్లో కనిపించిన ఇతడు.. ఈ ఏడాది మాత్రం 'హే బల్వంత్' అని ఒకే మూవీతో వచ్చాడు. కామెడీగా ఉన్న ఈ చిత్రం పర్లేదనిపించింది. ఇక ఇదే ఏడాది తమిళంలోకి 'మండాడి'తో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సెప్టెంబరు 10న ఇది తెలుగు, తమిళంలో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నైలో శుక్రవారం జరగ్గా.. ఇందులో సుహాస్.. హీరో సూరి కాళ్లు మొక్కాడు.
(ఇదీ చదవండి: ఊపేస్తున్న 'ప్యారడైజ్' కొత్త పాట.. లిరికల్ వీడియో రిలీజ్)
'మండాడి' సినిమా విషయంలో తనకు అన్ని విధాల సూరి అన్న అండగా నిలిచాడని చెబుతూ సుహాస్ భావోద్వేగానికి గురయ్యాడు. స్టేజీపైనే అందరి ముందు కాళ్లు మొక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇకపోతే ఈ మూవీని భిన్నమైన స్క్రీన్ ప్లేతో పూర్తిగా సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో జరిగే స్టోరీగా తెరకెక్కించారు. తమిళం వరకు సూరి హీరో, సుహాస్ విలన్‌గా కనిపించనుండగా.. తెలుగులోకి వచ్చేసరికి సుహాస్ హీరోగా, సూరి విలన్‌గా కనిపించనున్నారట. ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ ఓ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు మతిమారన్ పుళగెంది దర్శకుడిగా వ్యవహరించాడు.
(ఇదీ చదవండి: అమ్మ జ్ఞాపకార్థం.. కొత్తింట్లోకి తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా)
#Suhas:
"Soori Anna is my strength, my backbone & my piller of #Mandaadi. This is from the bottom of my heart. I also came from Junior Artist to Hero. Thank you for inspiring me & many. Love you Anna♥️" pic.twitter.com/aiWTEVhnyj— AmuthaBharathi (@CinemaWithAB) August 28, 2026


