‘టాక్సిక్‌’కు ‘ఏ’ సర్టిఫికేట్‌..!‌ కంటెంట్‌ సంగతేంటి? | Yash Toxic Movie Get A Certificate | Sakshi
Sakshi News home page

‘టాక్సిక్‌’కు ‘ఏ’ సర్టిఫికేట్‌..!‌ కంటెంట్‌ సంగతేంటి?

Aug 21 2026 1:27 PM | Updated on Aug 21 2026 1:52 PM

Yash Toxic Movie Get A Certificate

కన్నడ స్టార్‌ యశ్‌ హీరోగా వస్తోన్న యాక్షన్‌ మూవీ ‘టాక్సిక్‌’. గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నెల 26న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజ్‌ అయిన ట్రైలర్‌  అంచనాలను పెంచేసింది. అయితే ఈ సినిమాలో ఎలాంటి సన్నివేశాలు తొలగించకుండా సెన్సార్‌ బోర్డు( CBFC) ‘ఏ’ సర్టిఫికేట్‌ జారీ చేసినట్లు సమాచారం. సినిమా నిడివి 3 గంటల 12 నిమిషాలు ఉండనుందట.

అనుమతి ఎలా ఇస్తారంటూ..
కన్నడ భాషలో కేవలం రెండు నుంచి మూడు పదాలు మాత్రమే మ్యూట్‌ చేశారట. ఇప్పటికే యాశ్‌ ఈ సినిమాపై స్పందిస్తూ ఇది పెద్దవాళ్లకి మాత్రమే అని సూచించాడు . అయితే సెన్సార్‌బోర్డు ఎలాంటి సన్నివేశాలు తొలగించకపోవడంపై సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పెద్దవాళ్లకి మాత్రమే అన్నప్పుడు ఒక్క సీన్‌ కూడా తొలగించకుండా అనుమతి ఎలా ఇస్తారంటూ సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

కాగా గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో నయనతార, కియారా, హుమా ఖురేషి, తదితరులు కీలక పాత్రలు వహిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. 

ఇదీ చదవండి: ‘మూకుత్తి అమ్మన్‌2’ చిత్రానికి భారీ ఓటీటీ డీల్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement