మహేశ్‌బాబు ‘వారణాసి’లో ఎన్ని పాటలంటే..! | How Many Songs In Mahesh Babu Varanasi Movie, Keeravani Completes 6 Songs And Background Score Work To Begin Soon | Sakshi
Sakshi News home page

మహేశ్‌బాబు ‘వారణాసి’లో ఎన్ని పాటలంటే..!

Aug 21 2026 11:05 AM | Updated on Aug 21 2026 11:40 AM

How Many Songs In Varanasi movie

దర్శకధీరుడు రాజమౌళి , సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుత్ను చిత్రం వారణాసి. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  
వచ్చే నెలలో..
వారణాసి కోసం మొత్తం ఆరు పాటలని కీరవాణి స్వరపరిచినట్లు సమాచారం. ప్రస్తుతం పాటల పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. వచ్చే నెల నుంచి ఈ సినిమా నేపథ్య సంగీతం పనులను ప్రారంభించనున్నట్లు సమాచారం. మహేశ్‌బాబు, రాజమౌళి తొలిసారి కలిసి పనిచేస్తున్న చిత్రం వారణాసి కావడంతో భారీ అంచానాలు ఉన్నాయి. ప్రియంకచోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా మహేశ్‌ బాబు.. రుద్ర, శ్రీరాముడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నటం విశేషం. 2027 ఏప్రిల్‌ 7 నాటికి థియేటర్లలతో విడుదల చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement