ప్రముఖుల నివాళి.. ఆలోచనల్లో యువకుడు | Tollywood Heroes pay Condolences To Director Singeetham Srinivasarao Demise | Sakshi
Sakshi News home page

ప్రముఖుల నివాళి.. ఆలోచనల్లో యువకుడు

Oct 5 2026 4:27 AM | Updated on Oct 5 2026 4:27 AM

Tollywood Heroes pay Condolences To Director Singeetham Srinivasarao Demise

‘కాలానికి ముందే ఆలోచించిన వ్యక్తి, ఆలోచనల్లో ఆయన యువకుడు, సింగీతంగారు చూపిన మార్గం రాబోయే తరాలకు స్ఫూర్తి, ఆయనొక దిగ్గజ దర్శకుడు, ఇది ఒక అసాధారణ అధ్యాయానికి ముగింపు’’ అంటూ పలువురు చిత్రరంగ ప్రముఖులు లెజెండరీ డైరెక్టర్‌ సింగీత శ్రీనివాసరావు మృతి పట్ల తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. శనివారం రాత్రి సింగీతం శ్రీనివాసరావు తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు ఈ విధంగా స్పందించారు.

⇒ సింగీతంగారు తాను ఆశించినట్లే తనలోని యవ్వనం (ఆలోచనల రీత్యా) తోనే తుది శ్వాస విడిచారు. ఆయనలోని ఆ యవ్వనం చాలామందికి ఉండదు. ఆ లక్షణం అబ్బాలని ఆయన చేయి పట్టుకుని నడిచిన స్నేహితులు, శిష్యుల్లో నేనూ ఉన్నాను. సింగీతంగారిని కలిసినప్పట్నుంచి ఆయన్ను ఆరాధిస్తున్నాను. ఇప్పుడు ఆయనలా జీవించాలని ఆశిస్తున్నాను.        – కమల్‌హాసన్‌

⇒  కొత్త ఆలోచనలను అన్వేషించడంలో సింగీతంగారికి ఉన్న ధైర్యం, అద్భుతమైన ఊహాశక్తి భారతీయ సినిమాకు ఎన్నో చిరస్మరణీయమైన చిత్రాలను అందించాయి. ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘సింగ్‌ గీతం’ సినిమా కథల పట్ల ఆయనకు ఉన్న అంతులేని తపనకు అద్భుతమైన నిదర్శనం. వయసు పైబడినా ఆయన మనసులో యువకుడే. కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఉత్సుకత, ఏదైనా సృష్టించాలనే ఉత్సాహం ఆయనలో ఎప్పుడూ ఉండేవి.     – చిరంజీవి

⇒  భారతీయ సినిమాకే ఒక కొత్త ముద్ర వేసిన ‘ఆదిత్య 369, తెలుగులో మొట్టమొదటి కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ ఆధారిత చిత్రమై, బాక్సాఫీస్‌ వద్ద చరిత్ర సృష్టించి, జానపద చిత్రాలలో ఇప్పటికీ తిరుగులేనిదిగా నిలిచిన ‘భైరవ ద్వీపం’, ΄పౌరాణిక చిత్రం ‘శ్రీ కృష్ణార్జున విజయం’.... ఈ మూడు చిత్రాల్లో ఒకే దర్శకుడితో నేను సాంఘిక, చారిత్రక, జానపద, ΄పౌరాణిక అనే నాలుగు ప్రధాన జానర్‌లలోని పాత్రలను పోషించాను.     – బాలకృష్ణ

⇒ 94 ఏళ్ల వయసులో కూడా సినిమాల పట్ల   నిత్యయవ్వనంతో కూడిన ఆలోచనలు ఉన్న వ్యక్తి సింగీతంగారు. మీకున్న అంకితభావమే మీ గొప్ప వారసత్వం.     – రవితేజ

⇒ ‘పుష్పక విమానం, విచిత్ర సోదరులు, మయూరి, ఆదిత్య 369, ‘మైకేల్‌ మదన కామరాజు’ లాంటి చిత్రాల్లో సింగీతం శ్రీనివాసరావు గారు చేసిన ప్రయోగాలు, చూపిన సృజన ప్రేక్షకులను మెప్పించాయి. ఆయన రూ పొందించిన ‘అమెరికా అమ్మాయి, పంతులమ్మ’ లాంటి చిత్రాల్లోని గీతాలు ఎంతో ప్రాచుర్యం  పొందాయి. 94 ఏళ్ల వయసులోనూ ‘సింగ్‌ గీతం’ అనే చిత్రానికి దర్శకత్వం వహించడం ఆయనకి సినిమా పట్ల ఉన్న ఆసక్తిని తెలియజేసింది.      – పవన్‌ కల్యాణ్‌ 

⇒  ప్రియమైన సింగీతంగారు... మీరు మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారు.   – నాగార్జున

⇒  సినిమాని విభిన్న కోణాల్లో చూపించవచ్చని నమ్మిన అరుదైన దర్శకుడు సింగీతంగారు. ఆయన మరణం తెలుగు సినిమా చరిత్రలో ఒక అసాధారణ అధ్యాయానికి ముగింపు.   – వెంకటేశ్‌

⇒  సింగీతం శ్రీనివాసరావుగారు ఒక లెజెండ్‌. అద్భుతమైన ఊహాశక్తి, ధైర్యం, ప్రతిభ కలిగిన దర్శకుడు. భారతీయ సినిమా ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటుంది.   – మహేశ్‌బాబు

⇒ ‘ఆదిత్య 369, పుష్పక విమానం, మయూరి’... ఇలా కాలానికి ముందే ఆలోచించి, తరాలు మారినా కొత్తగా అనిపించే సినిమాలు అందించిన దార్శనికుడు సింగీతం శ్రీనివాసరావుగారు.      – ఎన్టీఆర్‌

⇒ మన దేశం చూసిన అత్యంత ప్రత్యేకమైన సినీ దర్శకుల్లో సింగీతంగారు ఒకరు. ఆయన సృజనాత్మకతను ప్రత్యక్షంగా చూసే అవకాశం నాకు లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన పని, ఆయన చూపిన దార్శనికత రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.   – అల్లు అర్జున్‌

⇒  సింగీతం శ్రీనివాసరావుగారు ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తూ, ఏ ఒక్క జానర్‌ లేదా ఫార్ములాకు తనను తాను పరిమితం చేసుకోలేదు. ఆయన తీసిన ప్రతి సినిమా ఒక పాఠ్యపుస్తకం వంటిది. తమ   సినిమాల మాయాజాలంతో నన్ను ప్రేమలో పడేలా చేసిన దర్శకుల్లో ఒకరిగా ఆయన  నాకు ఎప్పటికీ గుర్తుండిపోతారు.    – మంచు విష్ణు

⇒ గొప్పవాళ్లలోనే గొప్పవారైన ఒకరు వెళ్లిపోయారు. ఒక అసాధరణ జీవితం గడిపి, తన మేధస్సుతో మనల్ని ఆశీర్వదించిన గొప్ప బాలుడు ఆయన. ఫోన్‌ చేసినా, మేసేజ్‌ చేసినా... 94 సంవత్సరాల వయసులో కూడా తాను చేయబోయే సినిమాలను గురించిన ఆలోచనతోనే మాట్లాడేవారు. ఆ వయసులో ఆ ఉత్సాహం, ఉత్సుకత అద్భుతం. ఆయన శకంలో నేనూ ఉన్నందుకు గర్వపడుతున్నాను.     – నాని 

⇒ సింగీతం సార్‌... మీ నమ్మకాలు, ఆలోచనలు, మీ కథలు మాతో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. ‘పెళ్ళి చూపులు’ సినిమా విడుదలైనప్పట్నుంచి మీరు నాపై చూపిన ప్రేమ, ఆ ప్యాయతలను మర్చిపోలేను. మీ విజన్‌లో నుంచి వచ్చిన ‘సింగ్‌ గీతం’లో నేను భాగం అయినందుకు సంతోషంగా ఫీలయ్యాను.     – విజయ్‌ దేవరకొండ

⇒ సాంకేతిక సాధనాలు, సరైన బడ్జెట్‌లు లేని సమయాల్లోనే తన చుట్టూ ఉన్న వారందరికంటే పెద్ద కలలు కనే ధైర్యం చేసిన వ్యక్తి సింగీతం శ్రీనివాసరావుగారు. సింగిల్‌ డైలాగ్‌ లేకుండా సినిమా తీశారు. మనల్ని కాలంతో ప్రయాణించేలా చేశారు. కామెడీ నుంచి ఫ్యాంటసీ నుంచి హ్యూమన్‌ డ్రామా వరకు... జానర్ల మధ్య ఎలాంటి గీతా లేదని చె΄్పారు. సినిమాకు ఉన్న ఏకైక నిజమైన పరిమితి ఊహ మాత్రమేనని ఆయన మా తరానికి చూపించారు.     – రాజమౌళి

⇒ కళాఖండాలను రూ పొందించినా, నిరాడంబరుడిగానే చివరి వరకూ మసలిన దార్శనిక ముని సింగీతం శ్రీనివాసరావుగారు. ఒక ప్పుడు ఆయనతో సినిమా చేద్దామనుకున్నా కథ కలిసి రాలేదు. కానీ నా కల ఆగిపోలేదు. ’సింగ్‌ గీతం’ రూపంలో వైజయంతి పతాకం మీద శాశ్వతంగా వెలుగుతూనే ఉంటుంది. మరణం లేని మహనీయుడు.    – అశ్వినీదత్‌

⇒ సింగీతం శ్రీనివాసరావుగారు తీసిన ప్రతి సినిమా ప్రయోగాత్మకమే. ఆయన పద్మభూషణ్‌ పురస్కారానికి అర్హులు. పద్మ అవార్డుల కోసం దరఖాస్తు చేయాలని ఎన్నోసార్లు ఆయన్ను కోరాము. ప్రయోగాత్మక చిత్రాలు తీసిన సింగీతం వంటి దర్శకుడికి సముచిత గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. సింగీతం పేరును పద్మ అవార్డులకు సిఫార్సు చేయాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరుతున్నాను.          – కాట్రగడ్డ ప్రసాద్‌

⇒ ‘ఆదిత్య 369’ సినిమా సింగీతం శ్రీనివాసరావుగారు నాకు ఇచ్చిన వరం. ఆ సినిమా నిర్మాతగా నన్ను ఇప్పటికీ గుర్తిస్తున్నారు. ఈ మధ్యే ఆయన ఓ కథకు ఐడియా ఇస్తానని అన్నారు. గద్దర్‌ అవార్డుల్లో సింగీతంగారికి బీఎన్‌రెడ్డి పురస్కారం లభించడం, ఆ జ్యూరీ సభ్యుడిగా నేను ఉండటం నా అదృష్టం.    – శివలెంక కృష్ణ ప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement