Singeetham Srinivasa Rao
-
'మూవీ రిలీజ్ తర్వాత ట్రైలర్..' జూనియర్ ఎన్టీఆర్ ఫిదా
దాదాపు 94 ఏళ్ల వయసులో డైరెక్షన్ అంటే ఎవరికైనా అసాధ్యమే. అదేం కాదంటూ సింగీతం శ్రీనివాసరావు నిరూపించాడు. వయసులో సెంచరీ కొట్టినా కూడా దర్శకత్వం చేయొచ్చనే సంకేతాలిచ్చాడు. ఇదంతా చూస్తుంటే సినిమా అంటే ఆయనకు ఎంత పిచ్చో అన్నది మనకు అర్థమైపోతోంది. తాజాగా సింగ్ గీతం అనే మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సరికొత్త ప్రయోగంతో తన దర్శకత్వ టాలెంట్‌ను ఈ వయసులోనూ చూపించారు.దీంతో ఈ మూవీపై టాలీవుడ్ అగ్రతారలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, కమల్ హాసన్ ఈ సినిమాను అభినందించారు. తాజాగా ఈ లిస్ట్ మన యంగ్ టైగర్ కూడా చేరిపోయారు. సింగ్ గీతం ట్రైలర్ రిలీజ్ చేసిన జూనియర్.. సింగీతం శ్రీనివాసరావును కొనియాడారు. ఈ మూవీ తన హృదయానికి హత్తుకుందన్నారు. 94 ఏళ్ల వయసులోనూ ఆయన సృజనాత్మకత, వివేకాన్ని ప్రదర్శించడం ఎంతో స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.ఎన్టీఆర్ తన ట్వీట్లో రాస్తూ.. "నా హృదయాన్ని హత్తుకున్న ఒక అందమైన చిత్రం సింగ్ గీతం. 94 ఏళ్ల వయసులోనూ సింగీతం శ్రీనివాసరావు గారు తనదైన శైలి, సృజనాత్మకత, వివేకాన్ని ప్రదర్శించడం ఎంతో స్ఫూర్తిదాయకం. దేవి శ్రీ ప్రసాద్ సినిమా అంతటా అదరగొట్టారు. ప్రతి సన్నివేశానికీ మ్యాజిక్ తీసుకొచ్చారు. నాగ్ అశ్విన్ ఆయన 40 ఏళ్ల కలను నెరవేర్చడం దైవ వరమే. వైజయంతి ఫిల్మ్స్ కలిసి సింగీతం గారికి మీరిచ్చిన అద్భుతమే ఈ చిత్రం. చిత్ర బృందానికి నా అభినందనలు. సింగీతం శ్రీనివాసరావు గారి సినిమాలు ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరిచినట్లే.. మూవీ విడుదలైన తర్వాత ట్రైలర్ విడుదల చేయడం అతిపెద్ద ఆశ్చర్యం. ఈ ట్రైలర్ మీ అందరికీ అందించడం నాకు దక్కిన గౌరవం. థియేటర్లలోకి వెళ్లి సినిమాను ఆస్వాదించండి." అంటూ పోస్ట్ చేశారు.కాగా.. నాగ్ అశ్విన్ నిర్మించిన 'సింగ్ గీతం' జూన్ 12న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ అందుకుంటోంది. ఇందులో శాలిని కొండేపూడి, అహల్య, అయాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ బంగారు గనులు ఉన్న కుబేరపురం అనే గ్రామంలో జరుగుతుంది. సంపద కోసం గనులను అమ్మి, చెట్లను నరికివేయాలన్న గ్రామస్తుల ప్రణాళికను వ్యతిరేకించే ఒక యువతి కథే సింగ్ గీతం. ఈ పోరాటంలో ఆమెకు ఒక యువకుడు మద్దతుగా నిలుస్తాడు. కానీ గ్రామ దేవత శాపం కారణంగా గ్రామస్తులు సాధారణ సంభాషణలకు బదులుగా.. కేవలం పాటల ద్వారా మాత్రమే మాట్లాడుకోవడంతో వారి పోరాటం ఊహించని మలుపు తీసుకుంటుంది. ఆ తర్వాత ఏమైందన్నదే ఈ మూవీ కథ. #SingGeetham is a beautiful film that touched my heart. Legendary Singeetham Srinivasarao garu at 94 delivering creativity and wisdom like only he can is deeply inspiring to witness.https://t.co/V3I1C0jAth @ThisIsDSP, you nailed it throughout! You brought magic to every…— Jr NTR (@tarak9999) June 15, 2026 -
సింగ్ గీతం.. 94 ఏళ్ల వయసులో అదే డెడికేషన్..!
సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కిచిన తాజా చిత్రం సింగ్ గీతం. ఆయన ఇంటి పేరుతోనే వచ్చిన ఈ మూవీకి 94 ఏళ్ల వయసులో దర్శకత్వం వహించారు. ఈ వయసులో సినిమాకు దర్శకత్వం వహించడం అంటే మాటలు. దాదాపు 90 ఏళ్లు పైబడిన వ్యక్తి సెట్‌కు వచ్చి తెరకెక్కించడం సవాల్‌తో కూడుకున్న పనే. అయినా కూడా ఆయన పట్టుదలతో ఈ మూవీని రూపొందించారు. ఈ వయసులో కూడా కథ చెప్పడం పట్ల ఆయనకున్న అభిరుచి, నిబద్ధతతో ఇప్పటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ చిత్రాన్ని కేవలం 77 రోజుల్లోనే పూర్తి చేయడం మరో విశేషం. ఈ విషయాన్ని మూవీ టీమ్ సన్నిహితులు వెల్లడించారు.ఈ మూవీ కోసం సింగీతం శ్రీనివాసరావు పనిచేసిన తీరును కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ పంచుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు ఎలా దర్శకత్వం వహించారో వివరించారు. ఈ మూవీ కోసం ఎన్నో సర్దుబాట్లు అవసరమయ్యాయని అన్నారు. చెన్నైలో షూటింగ్ బాగానే జరిగిందని.. కానీ హైదరాబాద్‌లో మాత్రం కష్టంగా అనిపించిందని చెప్పారు. ఆయన ప్రయాణించలేని సమయంలో ఇంట్లోనే ఒక వర్చువల్ మానిటర్‌ను ఏర్పాటు చేశారు. సింగీతం హెడ్సెట్ ద్వారా నటీనటులకు, సిబ్బందికి మార్గనిర్దేశం చేస్తూ వచ్చారు. దూరం నుంచే షూటింగ్‌ను పర్యవేక్షించారు.అయినప్పటికీ ఆయన ఎక్కువ భాగం ఆయన భౌతికంగా సెట్లోనే ఉన్నారని తెలిపారు. ఈ మూవీ చివరి రెండు నెలల్లో దర్శకుడికి దగ్గు రావడం.. అది తీవ్రమై ఇన్ఫెక్షన్గా మారిందని నాగ్ అశ్విన్ గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో కొంచెం బరువు తగ్గారని.. కానీ అదేమీ ఆయన ఉత్సాహాన్ని తగ్గించలేదన్నారు. సింగీతం అభిరుచి ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తుందని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. కాగా.. ఈ చిత్రంలో అయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండేపూడి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించారు. -
‘సింగ్ గీతం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: సింగ్ గీతంనటీనటులు: అయాన్, అహల్య బమ్రూ, షాలిని కొండేపూడి, తులసి, బెనర్జీ, శివనారాయణ, అగు స్టాన్లీ తదితరులునిర్మాణ సంస్థ: వైజయంతీ మూవీస్, స్వప్న సినిమానిర్మాత: నాగ్ అశ్విన్దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావుసంగీతం: దేవిశ్రీ ప్రసాద్విడుదల తేది: జూన్ 12, 2026ట్రెండ్‌కి భిన్నంగా ఆలోచించే దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. అన్ని జానర్లో సినిమా తీయడమేకాదు.. అందులో కొత్త ప్రయోగాలు చేసి విజయం సాధించాడు. ఆదిత్య 369, విచిత్ర సోదరులు, భైరవద్వీపం, మైఖెల్ మదన కామ రాజు.. ఇలా అప్పట్లోనే ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసి మెప్పించాడు. చాలా ఏళ్ల తర్వాత మెగా ఫోన్ చేతపట్టి ‘సింగ్ గీతం’అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సారి కూడా మరో కొత్త ప్రయోగమే. మాటలనే పాటగా మార్చి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. మరి 94 ఏళ్లు యువకుడు తీసిన చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. కుబేర పురం అనే ఒక ఫిక్షనల్ విలేజ్ చుట్టూ ఈ సినిమా కథనం తిరుగుతుంది. ఆ ఊరంతా బంగారమే ఉంటుంది. దాన్ని దోచుకోవడానికి రేణూ (షాలిని కొండేపూడి), ఆమె తండ్రి మైనింగ్ సాగిస్తుంటారు. ఆ మైనింగ్‌ను ఓ విదేశీ వ్యాపారాస్తుడికి అమ్మేయడానికి ప్లాన్ చేస్తారు. అదే సమయంలో తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూములు అక్కడ ఉన్నాయని తెలుసుకుని ప్రతాప్ (అయాన్) ఆ ఊరికి వస్తాడు. తన భూమిలో బంగారు గనులున్నాయని తెలుసుకొని రేణూతో చేతులు కలుపుతాడు. బంగారాన్ని దోచుకోవడానికి ఆ ఊర్లో ఉన్న ఆఖరి చెట్టుని కూడా నరికేస్తారు. ఆ చెట్టుని తన తల్లిలా భావించి గౌరి(అహల్య) వద్దని అడ్డుకున్నా ఆ చెట్టుని తొలగిస్తారు. దీంతో ఆ ఊరి దేవుడు కుబేరుడికి కోపం వస్తుంది. ఆ ఊరికి ఓ శాపం ఇస్తాడు. ఎవరి నోట్లోంచి మాటే రాదు. కేవలం పాట మాత్రమే వస్తుంది. ఏం మాట్లాడాలన్నా పాట రూపంలోనే మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంతేకాదు నిజాలు మాత్రమే బయటకు వస్తుంటాయి. మరి ఈ పాటల వల్ల, వాళ్లు చెబుతున్న నిజాల వల్ల వారి జీవితాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేది మిగతా కథ. ఎలా ఉందంటే.. మాటలు లేకుండా పాటలతో సినిమా చేయడం.. వినడానికి ఇప్పటికీ విచిత్రంగా ఉంది కదా? కానీ 40 ఏళ్ల కిందటే సింగీతం శ్రీనివాసరావు ఈ ఆలోచన చేశాడు. ఇలాంటివి పేపర్‌పై రాసుకోవడానికి బాగుంటాయి. కానీ ఆచరణలో పెట్టడమే చాలా కష్టం. ప్రతి మాట.. ఎమోషన్ని పాట రూపంలో చెప్పడం అంత ఈజీ కాదు. కానీ సింగీతం అది చేసి చూపించాడు. 40 ఏళ్ల కింద రాసుకున్న కథ అయినప్పటికీ.. నేటికీ నవ్యత లోపించలేదు. నేటితరానికి ఇవ్వాల్సిన మంచి సందేశం ఈ కథలో ఉంది. ప్రకృతి ఎంత గొప్పదో చెబుతూనే.. మనిషి అత్యాశతో పర్యావరణాన్ని ఎలా నాశనం చేస్తున్నాడో ఇందులో చూపించాడు. అయితే ఈ సినిమా మొత్తం పాటలే ఉన్నాయా? మాటలు లేవా? అంటే ఉన్నాయి. సినిమా ప్రారంభం నుంచి తొలి 20 నిమిషాలు మూములుగానే కథనం సాగుతుంది. సాధారణ సినిమాల్లోలాగే మాటలు ఉంటాయి. ప్రతాప్ కుబేరపురం రావడం.. ఆ ఊరి ప్రజల పరిచయం.. మైనింగ్ మాఫియా నేపథ్యం అంతా రొటీన్‌గానే సాగుతుంది. ఎప్పుడైనే ఊరికి శాపం తగులుతుందో అప్పటి నుంచి మాటలు కాస్త పాటలుగా మారుతాయి.‘ఏమయ్యింది.. ఏమయ్యింది..’ అంటూ ఊరంతా పాడుకోవడం నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. పాట వరకు సరదాగే సాగినా.. ఆ తర్వాత మాటలు కూడా పాటలుగా రావడం బోరింగ్‌గా అనిపిస్తుంది. దానికి తోడు ఆయా సన్నివేశాలన్నీ సినిమాటిక్‌గానే అనిపిస్తాయి తప్ప ఎక్కడ సహజంగా అనిపించదు. ఇంటర్వెల్ వరకు ఇలానే సాగుతుంది. ఇక సెండాఫ్లో మాత్రం దర్శకుడు కథపై ఫోకస్ పెట్టాడు. ద్వితియార్థంలో బలమైన కథను చెప్పే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ హృదయాలను హత్తుకుంటుంది. ఆ తర్వాత ప్రతాప్ మారిపోవడం.. ఆస్తిపై కీలక నిర్ణయం తీసుకోవడం, ఈ తర్వాత నడిచే డ్రామా ఆకట్టుకుంటుంది. ప్రీక్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సింగీతం మరోసారి తన మార్క్ చూపించాడు. ఇక చివరిలో విజయ్ దేవరొకండ ఎంట్రీ సర్ప్రైజ్ చేస్తుంది. పార్ట్ 2 ఉంటుందన్నట్లుగా విజయ్ ఈ గెస్ట్ ఎప్పీరియన్స్ ఉంది. మరి సీక్వెల్ ఉంటుందా లేదా? అనేది చూడాలి. ఎవరెలా చేశారంటే..సినిమాలో ప్రధాన పాత్రలు పోషించినవారంతా కొత్తవాళ్లే అయినా చక్కగా నటించారు. చెట్టులో తల్లిని చూసుకునే గౌరి పాత్రలో అహల్య ఒదిగిపోయింది. అయితే ఆమె డబ్బింగ్ మాత్రం కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. నెగెటివ్ షేడ్స్ ఉండే ప్రతాప్ పాత్రలో అయాన్, రేణూ పాత్రలో షాలిని తమదైన సహజ నటనతో మెప్పించారు. రాహుల్ రవీంద్రన్, నివేదా పేతురాజ్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. సినిమాకు వాళ్ల పాత్రలే చాలా కీలకం. సీనియర్ నటి తులసికి ఈ సినిమాలో మంచి పాత్ర లభించింది. అతిథి పాత్రలు చేసిన అనుదీప్, విజయ్ దేవరకొండతో పాటు మిగిలినవారు కూడా తమ పాత్రల పరిధిమేర బాగానే చేశారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. సినిమా మొత్తం పాటలే ఉంటాయి. మాటలను కూడా పాటలుగా ట్యూన్ చేసిన తీరు బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. ఆయన కెరీర్లో ఇదొక డిఫరెంట్ చిత్రంగా నిలుస్తుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు బాగోలేదు. ఊరుతో పాటు సినిమాలో వేసిన ప్రతి సెట్.. ఆర్టిఫియల్గానే కనిపిస్తాయి తప్ప.. ఎక్కడ కూడా సహజంగా కనిపించవు. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
94 ఏళ్ల వయసులో ఇలాంటి సినిమా.. భవిష్యత్తులో కూడా కష్టమే : నాగ్ అశ్విన్
‘‘సింగీతం శ్రీనివాసరావుగారు ఎప్పుడూ అంతర్జాతీయ స్థాయిలోనే ఆలోచిస్తారు. ‘సింగ్ గీతం’లాంటి సినిమా ప్రపంచంలో ఎక్కడా రాలేదని ఆయన చెప్పేవారు. ఈ సినిమా పూర్తయ్యాక చూస్తుంటే నిజంగానే ఈ తరహా సినిమా ఇప్పటివరకు రాలేదనిపిస్తోంది. భవిష్యత్‌లో కూడా ఇలాంటి సినిమా రావడం కష్టమే. మన తరానికి సింగీతంగారు ఈ సినిమా ఇస్తున్నారంటే మనం అదృష్టవంతులమనే చెప్పాలి. పదేళ్ల తర్వాత గుర్తుండిపోయే సినిమా తీయాలనే ఉద్దేశంతో ఈ ‘సింగ్ గీతం’ చిత్రం చేశాం’’ అని దర్శక–నిర్మాత నాగ్ అశ్విన్ చెప్పారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి నటించిన సినిమా ‘సింగ్ గీతం’. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ చెప్పిన విశేషాలు... → ‘పుష్పక విమానం’ సినిమాకు ముందే సింగీతంగారు ‘సింగ్ గీతం’ కథను కమల్‌హాసన్‌గారికి చెప్పారు. అయితే సింగీతంగారికి ఉన్న కొన్ని ప్రాజెక్ట్స్ కారణంగా ఈ చిత్రాన్ని అప్పట్లో చేయడం ఆయనకు సాధ్యపడలేదు. ఇప్పుడు కుదిరింది. సింగీతంగారి సినిమాల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. ‘పుష్పక విమానం, ఆదిత్య 369, భైరవద్వీపం’ ఇలా ఆయన డైరెక్షన్లో వచ్చిన ఏ సినిమాను తీసుకున్నా టైమ్‌లెస్‌గా ఉంటాయి. ‘పుష్పక విమానం’ ఇప్పటికి సంబంధించిన సినిమాలానే ఉంటుంది. ‘సింగ్ గీతం’ కూడా ఈ జనరేషన్ కోసం తీసిన కథలానే అనిపిస్తుంది. → ‘మహానటి’ సినిమా తర్వాత సింగీతంగారు నాకు ‘సింగ్ గీతం’ సినిమా కథ చెప్పారు. ఇది కల్పిత కథ. కుబేరపురంలో గోల్డ్ మైన్స్ ఉంటాయి. ఆ ఊరికి, ఆ గోల్డ్ మైన్స్‌కు ఉన్న సంబంధం ఏంటి? అనేది సింగీతంగారి శైలిలో హ్యూమర్, హ్యుమానిటీల మేళవింపుతో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా ఒక ప్రత్యేక ప్రపంచంలో జరుగుతున్నట్లుగా సాగుతుంది. కాబట్టి పెద్ద స్టార్స్ అయితే వారి ఇమేజ్ ప్రభావం ఈ కథపై పడే అవకాశం ఉంది. ఈ సినిమా ప్రపంచాన్ని ప్రేక్షకులు కొత్తగా, సహజంగా ఫీలవ్వాలనే ఉద్దేశంతో సింగీతంగారు కొత్తవారిని తీసుకున్నారు. → ఈ సినిమా కోసం సింగీతంగారితో రెండేళ్లు ప్రయాణించాను. ఒకసారి ఆయన ఏదైనా చెప్పి, ఆ తర్వాత అది ఆయనకే నచ్చకపోతే మార్చేస్తారు. ‘మీరే చెప్పారు కదా?’ అంటే... ‘నేను తప్పు చేయకూడదా?’ అంటారు. నేను కొత్తతరం దర్శకుడినా? కాదా అనే సందేహం నాకు అప్పుడప్పుడు వస్తుంటుంది (సరదాగా). కానీ సింగీతంగారు 94 ఏళ్ల వయసులో కూడా ఓ టీనేజర్ తీసినట్లే ఈ సినిమా తీశారు. ఈ ప్రాజెక్ట్ ప్రతి అడగులో నేను ఉన్నాను. సింగీతంగారి విజన్‌ను స్క్రీన్‌పై తీసుకురావడానికి ఒక అసిస్టెంట్ డైరెక్టర్లా ఉన్నానని అనుకోవచ్చు. → మ్యూజిక్ పరంగా ఇది చాలెంజింగ్ సినిమా. ఇందులో డైలాగ్స్ అన్నీ పాటల్లా వస్తాయి. కానీ మ్యూజిక్ వింటున్నాం అనే ఫీలింగ్ రాదు. దేవిశ్రీ ప్రసాద్‌గారు మంచి సంగీతం ఇచ్చారు. → ఏ సినిమా సక్సెస్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ కథను నిజాయితీగా చెప్పడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ‘పుష్పక విమానం’ కథను సింగీతంగారు చెప్పినప్పుడు కూడా ‘మాటలు లేకుండా సినిమా ఏంటి?’ అని చాలామంది అనుకుని ఉంటారు. నేను ‘మహానటి’ తీస్తానంటే ‘ఇప్పుడు ఇలాంటి సినిమా ఎవరు చూస్తారు?’ అనే మాటలు వినిపించాయి. సినిమా పూర్తయ్యేవరకు ఎవరూ అంచనా వేయలేరు. నిజాయితీని నమ్మితే విజయం దానంతట అదే వస్తుంది. → నా డైరెక్షన్‌లోని ‘కల్కి 2’ చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభమైంది. వచ్చే నెల నుంచి కంటిన్యూస్‌గా షూటింగ్ జరపడానికి ప్లాన్ చేశాం. రిలీజ్ ఎప్పుడనే విషయంపై ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేను. -
జూన్‌లో సింగ్ గీతం
మూకీ చిత్రం ‘పుష్పక్’, టాకీ సినిమాలు ‘విచిత్ర సహోదరులు’, ‘మైఖేల్ మదన కామరాజన్ ’, ‘ఆదిత్య 369’ వంటి ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను తెరకెక్కించిన సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలోని తాజా సినిమాకు ‘సింగ్ గీతం’ అనే టైటిల్ ఖరారైంది. 94 సంవత్సరాల వయసులో ఆయన దర్శకత్వం వహిస్తున్న ఈ మ్యూజికల్ ఫాంటసీ సినిమాలో అయాన్, అహల్య బమ్రూ, షాలిని కొండేపూడి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పతాకంపై నాగ్ అశ్విన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసి, ఈ సినిమాను జూన్ 11న రిలీజ్ చేయనున్నట్లుగా వెల్లడించారు మేకర్స్. ‘కుబేరపురం... అసలు ఎందుకు వదిలేసి వెళ్లిపోయాడు అంకుల్ మా నాన్న ఈ ఊరిని... రాజా ట్రీట్మెంట్ ఇక్కడ..., మనకు ఒక ఫారిన్ డీల్ ఓకే అయ్యింది’ అనే డైలాగ్స్ ఈ సినిమా టీజర్లో ఉన్నాయి. ‘‘ఒక మిస్టీరియస్ విలేజ్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ప్రతాప్ అనే యువకుడి కథ చుట్టూ తిరుగుతుంది. అవకాశాల కోసం ప్రయత్నించే ప్రతాప్ జీవితం అనుకోని మార్గం లోకి వెళుతుంది. కనిపించేదంతా నిజం కాని ప్రపంచంలోకి అడుగుపెడతాడు. దీంతో ఓ సంఘర్షణలో చిక్కుకుని తన నిర్ణయాలు, నమ్మకాలు, లక్ష్యాలను ప్రశ్నించుకునే పరిస్థితి వస్తుంది. యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. బెనర్జీ, శివనారాయణ, అగు స్టాన్లీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
సింగీతం శ్రీనివాసరావు కొత్త సినిమా ప్రకటన
లెజెండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు 94ఏళ్ల వయసులో మళ్లీ మెగా ఫోన్ పెట్టారు. దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రలో ఆయన ఎన్నో గొప్ప సినిమాలు తెరకెక్కించారు. తన దర్శకత్వ ప్రతిభతో ప్రేక్షకలోకాన్ని పుష్పక విమానంపై ఊయలలూగించారు. జానపదాన్ని ప్రేమించడమేకాదు, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని అద్భుత ప్రయోగాలతో అపురూప కళాఖండాలను ఆవిష్కరించిన తెరమాంత్రికుడాయన. కేవలం దర్శకుడిగానే కాదు, సంగీతంలోను ఔరా అనుపించుకున్నారు. ఆదిత్య 369, భైరవ ద్వీపం, పుష్పక విమానం, మయూరి, బృందావనం వంటి అద్భుతమైన చిత్రాలను ఆయన తెరకెక్కించారు.ప్రయోగాత్మక చిత్రాలు తీయాలంటే సింగీతం శ్రీనివాసరావు తర్వాతనే ఎవరైనా అనేలా చెరగని ముద్ర వేశారు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఆయన ఒక కొత్త సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ నిర్మిస్తుండగా రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటం విశేషం. ఈ మూవీని ప్రకటిస్తూ చిత్ర యూనిట్ ఒక వీడియోను పంచుకుంది. అయితే, సినిమా పేరుతో పాటు నటీనటుల విషయాలను త్వరలో ప్రకటించనున్నారు. -
లెజండరీ డైరెక్టర్ సింగీతం ఇంట విషాదం
లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం నెలకొంది. ఆయన సతీమణి లక్ష్మీ కల్యాణి కన్నుమూశారు. అనారోగ్య కారణంతో శనివారం రాత్రి చెన్నైలో ఆమె మృతి చెందారు. ‘నా భార్య లక్ష్మీ కల్యాణి శనివారం రాత్రి 9.10గంటలకు తుదిశ్వాస విడిచింది. 62ఏళ్ల సుదీర్ఘమైన మా భాగస్వామ్యానికి ముగింపు పడింది’అని సింగీతం సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. భార్య లక్ష్మీ కల్యాణితో సింగీతం 1960లో సింగీతం శ్రీనివాసరావు, లక్ష్మీకల్యాణిల వివాహం జరిగింది.సింగీతం సీనీ కెరీర్లో ఆమె కీలక పాత్ర పోషించారు. సినిమా స్క్రిప్ట్ రాయడంలో ఆయనకు సహాయం చేసేశారు. లక్ష్మీ కల్యాణి గురించి ఆయన ‘శ్రీకల్యాణీయం’అనే ఓ పుస్తకాన్ని కూడా రాశారు. ప్రస్తుతం సింగీతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రభాస్ నటించబోతున్న తాజా చిత్రం ‘ప్రాజెక్ట్ కే’మూవీకి తొలుత కన్సల్టెంట్ గా వ్యవహరించేందుకు ఒప్పుకున్నారు కానీ ఆ తర్వాత అనారోగ్య కారణాల వల్ల తప్పుకున్నారు. -
హైదరాబాద్‌కు దీపికా పదుకొణె.. ప్రభాస్ కొత్త సినిమా షూటింగ్ కోసం !
Deepika Padukone Begins Shooting For Prabhas New Movie: బాలీవుడ్ నటి దీపికా పదుకొణె తన సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉంటుంది. అందుకోసం అనేక ప్రయాణాలు చేస్తుంటుంది. తాజాగా డిసెంబర్ 4న దీపికా హైదరాబాద్‌కు వెళ్తుండగా ముంబై విమానాశ్రయంలో తళుక్కుమంది. ఈ ప్రయాణం తన రాబోయే సినిమా షూటింగ్ కోసమే అని తెలుస్తోంది. ఆ సినిమా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న 'ప్రాజెక్ కె' (Project K) అని పలు నివేదికలు తెలిపాయి. ఈ క్రేజీ ప్రాజెక్టులో అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారని సమాచారం. దీపికా తెల్లటి క్రాప్ టాప్‌తో లైలాక్ ప్యాంట్ సూట్ ధరించి, చిరునవ్వుతో పలకరించి ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ 'ప్రాజెక్ట్ కె' చిత్రం ఒక సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ఉండనుంది. ఈ సినిమాతో దీపికా పదుకొణె టాలీవుడ్లో అరంగ్రేటం చేయనుంది. అయితే ఈ చిత్రానికి తాత్కాలికంగా ప్రాజెక్ట్ కె అని పేరు పెట్టారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం 2022లో ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది. వైజయంతీ మూవీస్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనుంది. ప్రముఖ చిత్ర దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ బృందానికి మెంటార్‌గా వ్యవహరించనున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా డానీ శాంచెజ్ లోపెజ్ చేయగా, మిక్కీ జె మేయర్ సంగీతం అందించనున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో అమితాబ్ బచ్చన్‌తో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ చిత్రంలో బిగ్ బి పాత్ర గురించి నాగ్ అశ్విన్ మాట్లాడుతూ 'బచ్చన్ సర్ మా సినిమాలో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనది పూర్తి నిడివి ఉన్న పాత్ర. ఆ పాత్రకు ఆయన తప్పకుండా న్యాయం చేస్తారని నమ్ముతున్నాను.' అని అన్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
Singeetham Srinivasarao Birthday Special:అద్భుత ప్రయోగాల తెరమాంత్రికుడు
-
అద్భుత ప్రయోగాల తెరమాంత్రికుడు
సాక్షి, హైదరాబాద్: తొంభై వసంతాల నిత్యయవ్వనుడు సింగీతం శ్రీనివాసరావు. దశాబ్దాల తెలుగు సినిమా పరిణామ క్రమానికి ప్రత్యక్ష సాక్షి. తన దర్శకత్వ ప్రతిభతో ప్రేక్షకలోకాన్ని పుష్పక విమానంపై ఊయలలూగించారు. జానపదాన్ని ప్రేమించడమేకాదు, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని అద్భుత ప్రయోగాలతో అపురూప కళాఖండాలను ఆవిష్కరించిన తెరమాంత్రికుడాయన. కేవలం దర్శకుడిగానే కాదు, సంగీతంలోను ఔరా అనుపించుకున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్బంగా స్పెషల్ స్టోరీ... -
లెజెండరీ డైరెక్టర్‌కు కరోనా పాజిటివ్
టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన బుధవారం ఫేస్బుక్ వీడియో ద్వారా అభిమానులకు తెలియజేశారు. కోవిడ్-19 లక్షణాలతో సెప్టెంబర్ 9న చెన్నైలో పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతం ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు పేర్కొన్నారు. మంగళవారం(సెప్టెంబర్ 22) నాటితో ఆయన క్వారంటైన్ గడువు ముగుస్తుందని తెలిపారు. అయితే అంతకు ముందు రోజే ఆయన పుట్టినరోజు కావడం విశేషం. తనకు కరోనా సోకిన విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. 65 ఏళ్లుగా నేను పాజిటివ్‌గా ఉన్నా, కానీ డాక్టర్లు ఇప్పుడు కొత్తగా కోవిడ్ పాజిటివ్ అన్నారంటూ సరదాగా మాట్లాడారు. హోమ్ ఐసోలేషన్‌లో భాగంగా ప్రత్యేక గదిలో ఉన్నానని, ఇది తనకు హాస్టల్ రోజులను గుర్తు చేస్తోందంటూ చమత్కరించారు. మాస్కులు పెట్టుకున్నా, భౌతిక దూరం పాటించినా, ఎన్ని జాగ్రత్తలు పడ్డా ఆ వైరస్ తనకు సోకిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. కాగా సింగీతం శ్రీనివాసరావు ‘బృందావనం’, ‘భైరవద్వీపం’, ‘శ్రీకృష్ణార్జున విజయం’, 'ఆదిత్య369' వంటి పలు హిట్ చిత్రాలకుదర్శకత్వం వహించారు. చివరిసారిగా 2005లో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన" ముంబై ఎక్స్‌ప్రెస్" చిత్రానికి డైరెక్టర్‌గా పని చేశారు. (చిరంజీవి గుండు వెనుక ఉన్న అసలు నిజం ఇదే!) -
ఆయన నా మనసుకి అంత దగ్గర..
రావి కొండలరావుతో నాది దాదాపు 60 ఏళ్ల పరిచయం. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నప్పుడే ఆయన తెలుసు. కొండలరావుగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఆ రోజుల్లోనే డబ్బింగ్ ఆర్టిస్టుగా చేసేవారు. నాటకాల్లో నటించడమే కాకుండా రచనలు కూడా చేసేవారు. కొండలరావుగారు, ఆయన భార్య రాధాకుమారి.. మేమంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్. మా ఇంటికి వాళ్లు రావటం, వాళ్లింటికి మేం వెళ్లటం జరుగుతూ ఉండేది. నేను దర్శకుడైన తర్వాత దాదాపు ప్రతి సినిమాలోను ఆయన ఉన్నాడు. నా సినిమాల్లో ఆయన లేని సినిమా లేదు. ఆయన నా మనసుకి అంత దగ్గరివాడు. విజయావారి ‘విజయచిత్ర’ పత్రికలో ఆయన సంపాదకునిగా చేసినప్పుడు కొన్ని ఆర్టికల్స్ రాసే విషయంలో నన్ను సంప్రదించేవారు. (పెద్ద దిక్కును కోల్పోయాం : చిరంజీవి) షూటింగ్‌లు ఉన్నప్పుడు రోజూ కలిసేవాళ్లం. లేకపోయినా కూడా విజయా స్టూడియోలో వారం వారం తప్పనిసరిగా కలిసేవాళ్లం. విజయా వాళ్లు మళ్లీ సినిమాలు తీస్తారు అనుకున్నప్పుడు కూడా ఆయనతో ‘బృందావనం’, ‘భైరవద్వీపం’ చిత్రాలకు కలిసి పని చేశాం. నటన విషయం పక్కన పెడితే మనిషిగా ఆయన చాలా గొప్పవాడు. ఎంత గొప్ప మనిషంటే ఏదైనా విమర్శించాల్సి వచ్చినా సెన్సాఫ్ హ్యూమర్‌తో విమర్శించేవాడే కానీ, ఎవరినీ నొప్పించేవాడు కాదు. అది ఎంతో గొప్ప గుణం. అది అందరిలో ఉండదు. అతనికి వ్యక్తిగతంగా ఒక్క శత్రువు కూడా లేరంటే అందరూ నమ్మాల్సిందే. సినిమా పరిశ్రమలో అందరికీ పాలిటిక్స్ ఉంటాయి కానీ, ఆయనకు ఏ రాజకీయాలూ తెలియవు. అంత గొప్ప మనిషి. సినిమా పరిశ్రమ బహుముఖ ప్రజ్ఞాశాలిని కోల్పోయింది. ఆయన అకాల మరణం నన్ను ఎంతో బాధకు గురి చేస్తోంది. -
శిష్యుడి కోసం...
విరాజ్ అశ్విన్, నేహా కృష్ణ జంటగా నటిస్తున్న చిత్రం ‘వాళ్లిద్దరి మధ్య’. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అర్జున్ దాస్యం నిర్మిస్తోన్న ఈ చిత్రానికి వీయన్ ఆదిత్య దర్శకుడు. యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మొయినాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌కి చిత్రదర్శకుడు వి.యన్. ఆదిత్య గురువు, ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు çసతీసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆదిత్య మాట్లాడుతూ– ‘‘సింగీతంగారు దర్శకత్వం వహించిన ‘బృందావనం’, ‘భైరవద్వీపం’, ‘శ్రీకృష్ణార్జున విజయం’ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. అప్పట్లో 4 ఏళ్ల పాటు వాళ్లింట్లో భోజనం చేసి పెరిగాను. ఆయన మా షూటింగ్‌కి వచ్చి ఓ సన్నివేశానికి డైరెక్ట్ చేయటం, ఆయన అసిస్టెంట్‌గా ఆ సన్నివేశానికి నేను క్లాప్నివ్వటం.. చెన్నై వాహిని స్టూడియోలో నేను క్లాప్ కొట్టిన అనుభూతి మరలా పునరావృతమైంది’’ అన్నారు. నిర్మాత అర్జున్ మాట్లాడుతూ– ‘‘88 ఏళ్ల వయసులో సింగీతంగారి ఎనర్జీ చూసి ఆశ్యర్యపోయాము. ఎన్నో పాత విషయాలను గుర్తు చేసుకున్నారు. ఈ నెలాఖరు వరకు మా సినిమా షూటింగ్ పూర్తవుతుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత వివేక్ కూచిబొట్ల తదితరులు పాల్గొన్నారు. -
సింగీతానికి సాలూరి ప్రతిభా పురస్కారం
రసమయి సంస్థ ప్రతిష్టాత్మకంగా ప్రతీ సంవత్సరం ప్రధానం చేసే డాక్టర్ సాలూరి రాజేశ్వరరావు ప్రతిభా పురస్కారానికి ఈ సంవత్సరం ప్రముఖ సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారిని ఎంపిక చేశారు. సంగీత దర్శకులుగా తెలుగు సినీ రంగానికి సేవలందించిన సాలూరి రాజేశ్వరరావు రఘపతి వెంకయ్య అవార్డు, కళైమామని, సంగీత సామ్రాట్‌గా సినీ సంగీత ప్రపంచంలో సుప్రసిద్ధులు. ఆయన పేరున ఈ సంవత్సరం 18వ పురస్కారంగా సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు ఈ నెల 10 తేదీ సాయంత్ర 5.30 గంటలకు శ్రీ త్యాగరాయ గానసభలో ప్రధానం చేయడం జరుగుతుందని అదే సందర్భంలో రసమయి ప్రేరణతో సాలూరి రాజేశ్వరరావుగారిపై భారత ప్రభుత్వ పోస్టల్ డిపార్ట్మెంట్ రూపొందించిన సాలూరి రాజేశ్వరరావు ప్రత్యేక తపాల చంద్రిక (సాలూరి స్పెషల్ పోస్టల్ కవర్) ఆవిష్కరణ జరుగుతుందని రసమయి అధ్యక్ష్యులు ఎంకె రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో జంట నగరాల్లోని సుప్రిసిద్ధ గాయని గాయకులు సాలూరి రాజేశ్వరరావుగా రు స్వరపరచిన గీతాలను ఆలపిస్తారని తెలిపారు. సభకు ముఖ్యఅతిథిగా కె. రోశయ్య, సభాధ్యక్షులుగా శ్రీ రుద్రరాజు పద్మరాజు,. సాలూరి తపాలా చంద్రిక ఆవిష్కర్తగా బ్రిగేడియర్ చంద్రశేఖర్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో సాలూరి కోఠి, సాలూరి వాసూరావు, సాలూరి పూర్ణచంద్రరావు, మాధవ పెద్ది సురేష్ పాల్గొంటారని తెలిపారు. -
నాడు కమల్ హాసన్.. నేడు షారుక్ ఖాన్
సాక్షి, న్యూఢిల్లీ : షారుక్ ఖాన్ హీరోగా ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘జీరో’ తొలి టీజర్ విడుదలైన విషయం తెల్సిందే. వచ్చే డిసెంబర్ నెలలో విడుదల కానున్న ఈ చిత్రంలో షారుక్ ఖాన్ మరుగుజ్జు పాత్రలో ఎలా నటిస్తున్నారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. సరిగ్గా 29 ఏళ్ల క్రితం కమలా హాసన్ నటించిన ‘అపూర్వ సహోదరులు’ చిత్రాన్ని తమిళ, తెలుగుభాషల్లో విడుదల చేయగా కలెక్షన్లు హోరెత్తాయి. తమిళనాట అప్పటి వరకు నెలకొన్న అన్ని రికార్డులను ఆ సినిమా బద్ధలు కొట్టింది. ఆ తర్వాత ఆ సినిమా రికార్డును అధిగమించినది రజనీకాంత్ నటించిన ‘బాషా’ చిత్రం మాత్రమే. అపూర్వ సహోదరులు అంతటి ఆదరణ పొందడానికి కారణం ‘అప్పు’ పాత్రలో కమల్ హాసన్ మరుగుజ్జుగా కనిపించడమే. మోకాళ్ల వరకే పూర్తి కాలున్నట్లుగా కమల్ హాసన్ ఆ చిత్రంలో కనించడానికి కమలహాసన్‌తోపాటు దర్శకుడు ఎంతో కష్టపడ్డారు. అది ఎలా సాధ్యమైందన్న విషయాన్ని కమలా హాసన్గానీ, ఆ సినిమా దర్శకుడు సింగీతం శ్రీనివాస్ రావుగానీ వెల్లడించకుండా 2008 సంవత్సరం వరకు గోప్యంగా ఉంచారు. ఈ రహస్యం ఇప్పటి కూడా అందరికి తెలియకపోవచ్చు. ఆ చిత్రంలో మరుగుజ్జు పాత్ర కోసం ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్నిగానీ, గ్రాఫిక్స్గానీ ఉపయోగించలేదు. సింగీతం శ్రీనివాస్ రావు కథనం ప్రకారం. కమల్ హాసన్ ఎక్కువ వరకు వెనక కాళ్లు కనిపించకుండా మోకాళ్లపై నడిచారు. అందుకనే ఎక్కువ షాట్లు క్లోజప్లోనే ఉంటాయి. ఇక కమల్ హాసన్ పక్కకు తిరిగి నడుస్తున్నట్లుగా చూపించాల్సి వచ్చినప్పుడు కందకం తవ్వి అందులో మోకాలి వరకు కమల్‌ను నిలబెట్టి ఇసుకతో పూడ్చి నడిపించారు. మోకాళ్లపై నడుస్తున్నప్పుడు ఎక్కువ వరకు సహజంగా కనిపించేందుకు, మోకాలి చిప్ప నొప్పి పెట్టకుండా ఉండేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన బూట్లను వాడారు. ఇక తోటి నటుల మధ్య ఎదురుగా కాకుండా అటూ ఇటూగా ఉన్నప్పుడు కూడా కందకం టెక్నిక్‌నే వాడారు. పాటల సందర్భంలో, ముఖ్యంగా సర్కస్ మిత్రులతో కలిసి కాళ్లూపుతూ పాటలు పాడినప్పుడు కమల్ ప్రత్యేకంగా రూపొందించిన కత్రిమ కాళ్లను వాడారు. ఆ కాళ్లను వంచిన మోకాళ్లకు తగిలించి కదిలేలా చేశారు. అప్పు పాత్రలో కమల్ హాసన్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మోకాళ్ల వరకు కాళ్లను కత్తిరించినట్లు కనిపిస్తుంది తప్పా, పూర్తి సహజత్వం కనిపించదు. అయినప్పటికీ ఆ ప్రయోగం నచ్చడంతో సినిమా సూపర్ డూపర్ హిట్టయింది. ఆ తర్వాత 2001లో విడుదలైన ఆషిక్ సినిమాలో జానీ లివర్ ఇలాంటి టెక్నిక్కే ఉపయోగించి మరుగుజ్జు పాత్రలో నటించారు. ఇక 2006లో విడుదలైన ‘జాన్ ఏ మన్’ చిత్రంలో అనుపమ్ ఖేర్ మరుగుజ్జు పాత్రలో నటించారు. ఆ సినిమాలో ఆయన మోకాళ్ల వరకు కాళ్లు మడిచే నడిచారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా 40 రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్లో పాల్గొనడం వల్ల ఆయన మోకాలి చిప్పలు అప్పట్లో వాచి పోయాయి. ఇప్పుడు కూడా మెట్లు ఎక్కుతుంటే మోకాలి చిప్పలు కలుక్కుమంటున్నాయని అనుపమ్ ఖేర్ అప్పుడప్పుడు చెబుతుంటారు. ఇప్పుడు ‘జీరో’ చిత్రంలో షారూక్ ఖాన్ మరుగుజ్జుగా ఎలా నటిస్తున్నారన్నది ఆసక్తికరమైన తాజా ప్రశ్న. కమల్ హాసన్, అనుపమ్ ఖేర్లలాగా మోకాలి చిప్పలను దెబ్బతీసుకోకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడి షారుక్ ఖాన్ నటించారు. ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్, ది హాబిట్’ లాంటి చిత్రాల్లో ఉపయోగించిన పీటర్ జాక్సన్ ‘పర్స్పెక్టివ్ టెక్నిక్’ను ఇందులో ఉపయోగించారు. దీనికి విస్తతమైన సెట్లు అవసరం అవుతాయి. తోటి పాత్రలకన్నా షారుక్ ఖాన్‌ను చాలా దూరంగా ఉంచి షూటింగ్ చేయడం వల్ల షారుక్ ఖాన్ పొట్టిగా కనిపిస్తారు. ఆ తర్వాత పాత్రల మధ్య ఆ దూరం కనిపించకుండా కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగిస్తారు. ఇందులో కూడా కెమేరా పనితనం బాగా లేకపోయినా, కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో మిక్సింగ్ బాగాలేకున్నా, సినిమా మొత్తం నిడివిలో ఒకేతీరు పర్స్పెక్టివ్ లేకున్నా సహజత్వం లోపిస్తుంది. -
'ఆదిత్య 369'కు సీక్వెల్
దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 81 ఏళ్ల వయసులో మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు. యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా ఆయన గతంలో తీసిన 'ఆదిత్య 369' సినిమాకు సీక్వెల్ తీసే యోచనలో ఉన్నారు. టైమ్ మిషన్ కథాంశంగా 1991లో విడుదల ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. ఇందులో బాలకృష్ణ సరసన మోహిని హీరోయిన్గా నటించింది. ఈ సినిమా రిలీజైన రెండు దశాబ్దాల తర్వాత సింగీతం సీక్వెల తీయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇందులో కూడా టైమ్ మిషనే కథాంశమయినా స్ర్కీన్ ప్లే విభిన్నంగా ఉంటుందని శ్రీనివాసరావు తెలిపారు. ఈ ప్రాజెక్టు గురించి బాలకృష్ణతో త్వరలో చర్చించనున్నట్టు చెప్పారు. ఆయన తాజాగా దర్శకత్వం వహించిన 'వెలకమ్ ఒబామా' సినిమా శుక్రవారం విడుదల కాబోతోంది.


