సింగ్ గీతం.. 94 ఏళ్ల వయసులో అదే డెడికేషన్..! | 94 year old Singeetham Srinivasa Rao wrapped Sing Geetham just 77 days | Sakshi
Sakshi News home page

Sing Geetham Movie: సింగ్ గీతం.. కేవలం 77 రోజులేనా?

Jun 12 2026 5:18 PM | Updated on Jun 12 2026 5:26 PM

94 year old Singeetham Srinivasa Rao wrapped Sing Geetham just 77 days

సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కిచిన తాజా చిత్రం సింగ్ గీతం. ఆయన ఇంటి పేరుతోనే వచ్చిన ఈ మూవీకి 94 ఏళ్ల వయసులో దర్శకత్వం వహించారు. ఈ వయసులో సినిమాకు దర్శకత్వం వహించడం అంటే మాటలు. దాదాపు 90 ఏళ్లు పైబడిన వ్యక్తి సెట్‌కు వచ్చి తెరకెక్కించడం సవాల్‌తో కూడుకున్న పనే. అయినా కూడా ఆయన పట్టుదలతో ఈ మూవీని రూపొందించారు. ఈ వయసులో కూడా కథ చెప్పడం పట్ల ఆయనకున్న అభిరుచి, నిబద్ధతతో ఇప్పటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ చిత్రాన్ని కేవలం 77 రోజుల్లోనే పూర్తి చేయడం మరో విశేషం. ఈ విషయాన్ని మూవీ టీమ్ సన్నిహితులు వెల్లడించారు.

ఈ మూవీ కోసం సింగీతం శ్రీనివాసరావు పనిచేసిన తీరును కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ పంచుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు  ఎలా దర్శకత్వం వహించారో వివరించారు. ఈ మూవీ కోసం ఎన్నో సర్దుబాట్లు అవసరమయ్యాయని  అన్నారు. చెన్నైలో షూటింగ్ బాగానే జరిగిందని.. కానీ  హైదరాబాద్‌లో మాత్రం కష్టంగా అనిపించిందని చెప్పారు. ఆయన ప్రయాణించలేని సమయంలో ఇంట్లోనే ఒక వర్చువల్ మానిటర్‌ను ఏర్పాటు చేశారు. సింగీతం హెడ్‌సెట్ ద్వారా నటీనటులకు, సిబ్బందికి మార్గనిర్దేశం చేస్తూ వచ్చారు. దూరం నుంచే షూటింగ్‌ను పర్యవేక్షించారు.

అయినప్పటికీ ఆయన ఎక్కువ భాగం ఆయన భౌతికంగా సెట్‌లోనే ఉన్నారని తెలిపారు. ఈ మూవీ చివరి రెండు నెలల్లో దర్శకుడికి దగ్గు రావడం.. అది తీవ్రమై ఇన్ఫెక్షన్‌గా మారిందని నాగ్ అశ్విన్ గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో కొంచెం బరువు తగ్గారని.. కానీ అదేమీ ఆయన ఉత్సాహాన్ని తగ్గించలేదన్నారు. సింగీతం అభిరుచి ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తుందని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. కాగా.. ఈ చిత్రంలో అయాన్, అహల్యా బమ్రూ,  శాలిని కొండేపూడి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement