breaking news
Sing Geetham Movie
-
సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
అయానే, అహల్య, షాలినీ ప్రధాన పాత్రలు చేసిన మూవీ 'సింగ్ గీతం'. సింగీతం శ్రీనివాసరావు దర్శకుడు కాగా.. కల్కి, మహానటి మూవీస్ తీసిన నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరించాడు. ఇందులో డైలాగ్స్ తక్కువగా ఉంటాయి. పాటలే ఎక్కువగా ఉంటాయి. అత్యాశ అనే కాన్సెప్ట్‌తో దీన్ని తెరకెక్కించారు. గత నెల 11వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈనెల జూలై 08 నుంచే ఓటీటీ ప్రియులకు నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి రానుంది.తాజాగా ఈ మూవీ నుంచి ఓరి జీవుడా అనే సాంగ్ ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించారు. ఈ సాంగ్‌ను శంకర్ బాబు ఆలపించగా.. దేవీశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. ఈ పాట థియేటర్లలో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో సాంగ్ మీరు కూడా చూసేయండి. -
ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'లెనిన్' రిలీజ్ కానుంది. దాదాపు మూడేళ్ల తర్వాత అఖిల్ బాక్సాఫీస్ బరిలో ఉన్నాడు. అంచనాలైతే పర్లేదనిపించేలా ఉన్నాయి. దీనితోపాటు వసుదేవసుతం, చంద్రప్పన్ అనే తెలుగు చిత్రాలు కూడా లిస్టులో ఉన్నాయి. అలానే పృథ్వీరాజ్ సుకుమారన్ 'ఐ నోబడీ', 'హృదయం మురళి', నాగదుర్గ 'లవ్ ఓ లవ్', ధమాల్ 4 అనే డబ్బింగ్, హిందీ చిత్రాలు కూడా విడుదల కానున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వడ్డే నవీన్ రీఎంట్రీ సినిమా)ఓటీటీ రిలీజుల విషయానికొస్తే.. ఈ వారమే 'పెద్ది' రానుంది. దీనితో పాటు మ్యూజికల్ మూవీ 'సింగ్ గీతం' కూడా స్ట్రీమింగ్ కానుంది. బల్టీ, పరిమళ అండ్ కో చిత్రాలు కూడా ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు పలు సిరీస్‌లు, సినిమాలు కూడా ఉన్నాయండోయ్. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ కానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూలై 06 నుంచి 12వ తేదీ వరకు)నెట్ఫ్లిక్స్సింగ్ గీతం (తెలుగు మూవీ) - జూలై 08ఐ యామ్ నాట్ అఫ్రైడ్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 08సల్సేడో, లెదర్ అండ్ బోగాలో (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 08నథింగ్ టూ లూజ్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 08పెద్ది (తెలుగు సినిమా) - జూలై 09లిటిల్ హౌస్ ఆన్ ద ప్రయిరే (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 09పతి పత్ని ఔర్ వో దో (హిందీ మూవీ) - జూలై 10ఇక్కా (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 10షిప్ రెక్డ్: నైట్ మేర్ ఎట్ సీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - జూలై 10ద అపార్ట్మెంట్ జాబ్ (కొరియన్ సిరీస్) - జూలై 11సుసాన అండ్ ఎల్విరా: నో ప్లాన్ బి (కొలంబియన్ మూవీ) - జూలై 12హాట్స్టార్ద ఫైవ్ స్టార్ వీకెండ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 10సోనీ లివ్బల్టీ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 10అమెజాన్ ప్రైమ్ద వెస్టీస్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 12జీ5ఫ్రేమ్ (మరాఠీ సినిమా) - జూలై 10పరిమిళ అండ్ కో (తమిళ మూవీ) - జూలై 10లయన్స్ గేట్ ప్లేద సెంటినల్స్ (ఫ్రెంచ్ సిరీస్) - జూలై 10ఆపిల్ టీవీ ప్లస్ట్రైయింగ్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 08(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన వివాదాస్పద సినిమా) -
ఓటీటీలోకి 'సింగ్ గీతం' సినిమా.. అధికారిక ప్రకటన
రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పోలిస్తే అప్పుడప్పుడు కాస్త డిఫరెంట్ మూవీస్ కూడా రిలీజ్ అవుతుంటాయి. అలాంటి వాటిలో 'సింగ్ గీతం' ఒకటి. 94 ఏళ్ల వయసులోనూ సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని తీశారు. ఇప్పుడీ సినిమాకు సంబంధించిన ఓటీటీ అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంతకీ ఇది ఎందులోకి ఎప్పుడు రానుంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వడ్డే నవీన్ రీఎంట్రీ సినిమా)అయానే, అహల్య, షాలినీ అని కొత్త నటీనటులు ప్రధాన పాత్రలు చేసిన మూవీ 'సింగ్ గీతం'. సింగీతం శ్రీనివాసరావు దర్శకుడు కాగా కల్కి, మహానటి మూవీస్ తీసిన నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరించాడు. ఇందులో డైలాగ్స్ తక్కువగా ఉంటాయి. పాటలే ఎక్కువగా ఉంటాయి. అత్యాశ అనే కాన్సెప్ట్‌తో దీన్ని తెరకెక్కించారు. గత నెల 11వ తేదీన థియేటర్లలో రిలీజైంది. పర్లేదనిపించింది. ఇప్పుడు ఈ బుధవారం(జూలై 08) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా అప్డేట్ ఇచ్చారు.'సింగ్ గీతం' విషయానికొస్తే.. జైలు నుంచి బయటకొచ్చిన ప్రతాప్, తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూములు కుబేరపురం అనే ఊరిలో ఉన్నాయని తెలుసుకుని అక్కడికి వెళ్తాడు. అయితే అవి సాధారణ భూములు కాదని వాటిలో బంగారు గనులున్నయాని తెలుస్తుంది. అయితే ఇదే ఊరిలో ఉన్న ఏకైక చెట్టుని తల్లిలా చూసుకుంటుంది గౌరి(అహల్య). బంగారం తవ్వేందుకు ఈ చెట్టుని కొట్టేసిన తర్వాత ఊరంతటికి శాపం తగులుతుంది. దీంతో అందరి నోటి నుంచి మాటలకు బదులు పాటలు వస్తుంటాయి. మరి ఈ శాపం నుంచి విముక్తి ఎలా పొందారు? మనుషుల్లోని అత్యాశ వల్ల ఎన్ని ఇబ్బందులొచ్చాయి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన వివాదాస్పద సినిమా) -
టాలీవుడ్లో హిట్ టాక్.. అక్కడ కూడా సింగ్ గీతం రిలీజ్
ఇటీవలే టాలీవుడ్లో రిలీజై హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ సింగ్ గీతం. ఈ సినిమాకు 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి కల్కి డైరెక్టర్ నిర్మాతగా ఉన్నారు. ఈ చిత్రంలో అయాన్, అహిల్య బమ్రు, శాలిని కోడెపూడి ప్రధాన పాత్రల్లో నటించారు.టాలీవుడ్లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కోలీవుడ్ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ మూవీని కోలీవుడ్‌లోనూ రిలీజ్ చేసేందుకు రెడీ అయిపోయారు. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏజీఎస్ సినిమాస్ ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేయనుంది. జూన్ 26న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ఏజీఎస్ సినిమాస్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. కాగా.. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్, రాహుల్ రామకృష్ణ, శివన్నారాయణ ముఖ్య పాత్రల్లో కనిపించారు. From our hearts to the big screen...#SingGeetham releases on June 26th ❤️All set for a Grand Tamil Nadu Release through @agscinemas 🔥#SingGeethamFromJune26#SingeethamSrinivasaRao @ThisIsDSP @nagashwin7 @archanakalpathi @aishkalpathi @Nivetha_Tweets @23_rahulr… pic.twitter.com/sNAkVFmIiC— AGS Cinemas (@agscinemas) June 23, 2026 -
పాట పాడతానంటూ రెబల్ స్టార్ రచ్చ..!
-
'మూవీ రిలీజ్ తర్వాత ట్రైలర్..' జూనియర్ ఎన్టీఆర్ ఫిదా
దాదాపు 94 ఏళ్ల వయసులో డైరెక్షన్ అంటే ఎవరికైనా అసాధ్యమే. అదేం కాదంటూ సింగీతం శ్రీనివాసరావు నిరూపించాడు. వయసులో సెంచరీ కొట్టినా కూడా దర్శకత్వం చేయొచ్చనే సంకేతాలిచ్చాడు. ఇదంతా చూస్తుంటే సినిమా అంటే ఆయనకు ఎంత పిచ్చో అన్నది మనకు అర్థమైపోతోంది. తాజాగా సింగ్ గీతం అనే మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సరికొత్త ప్రయోగంతో తన దర్శకత్వ టాలెంట్‌ను ఈ వయసులోనూ చూపించారు.దీంతో ఈ మూవీపై టాలీవుడ్ అగ్రతారలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, కమల్ హాసన్ ఈ సినిమాను అభినందించారు. తాజాగా ఈ లిస్ట్ మన యంగ్ టైగర్ కూడా చేరిపోయారు. సింగ్ గీతం ట్రైలర్ రిలీజ్ చేసిన జూనియర్.. సింగీతం శ్రీనివాసరావును కొనియాడారు. ఈ మూవీ తన హృదయానికి హత్తుకుందన్నారు. 94 ఏళ్ల వయసులోనూ ఆయన సృజనాత్మకత, వివేకాన్ని ప్రదర్శించడం ఎంతో స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.ఎన్టీఆర్ తన ట్వీట్లో రాస్తూ.. "నా హృదయాన్ని హత్తుకున్న ఒక అందమైన చిత్రం సింగ్ గీతం. 94 ఏళ్ల వయసులోనూ సింగీతం శ్రీనివాసరావు గారు తనదైన శైలి, సృజనాత్మకత, వివేకాన్ని ప్రదర్శించడం ఎంతో స్ఫూర్తిదాయకం. దేవి శ్రీ ప్రసాద్ సినిమా అంతటా అదరగొట్టారు. ప్రతి సన్నివేశానికీ మ్యాజిక్ తీసుకొచ్చారు. నాగ్ అశ్విన్ ఆయన 40 ఏళ్ల కలను నెరవేర్చడం దైవ వరమే. వైజయంతి ఫిల్మ్స్ కలిసి సింగీతం గారికి మీరిచ్చిన అద్భుతమే ఈ చిత్రం. చిత్ర బృందానికి నా అభినందనలు. సింగీతం శ్రీనివాసరావు గారి సినిమాలు ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరిచినట్లే.. మూవీ విడుదలైన తర్వాత ట్రైలర్ విడుదల చేయడం అతిపెద్ద ఆశ్చర్యం. ఈ ట్రైలర్ మీ అందరికీ అందించడం నాకు దక్కిన గౌరవం. థియేటర్లలోకి వెళ్లి సినిమాను ఆస్వాదించండి." అంటూ పోస్ట్ చేశారు.కాగా.. నాగ్ అశ్విన్ నిర్మించిన 'సింగ్ గీతం' జూన్ 12న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ అందుకుంటోంది. ఇందులో శాలిని కొండేపూడి, అహల్య, అయాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ బంగారు గనులు ఉన్న కుబేరపురం అనే గ్రామంలో జరుగుతుంది. సంపద కోసం గనులను అమ్మి, చెట్లను నరికివేయాలన్న గ్రామస్తుల ప్రణాళికను వ్యతిరేకించే ఒక యువతి కథే సింగ్ గీతం. ఈ పోరాటంలో ఆమెకు ఒక యువకుడు మద్దతుగా నిలుస్తాడు. కానీ గ్రామ దేవత శాపం కారణంగా గ్రామస్తులు సాధారణ సంభాషణలకు బదులుగా.. కేవలం పాటల ద్వారా మాత్రమే మాట్లాడుకోవడంతో వారి పోరాటం ఊహించని మలుపు తీసుకుంటుంది. ఆ తర్వాత ఏమైందన్నదే ఈ మూవీ కథ. #SingGeetham is a beautiful film that touched my heart. Legendary Singeetham Srinivasarao garu at 94 delivering creativity and wisdom like only he can is deeply inspiring to witness.https://t.co/V3I1C0jAth @ThisIsDSP, you nailed it throughout! You brought magic to every…— Jr NTR (@tarak9999) June 15, 2026 -
నా కెరీర్ ముగిసిందనుకున్నా.. ఆయన మళ్లీ లైఫ్ ఇచ్చారు: టాలీవుడ్ హీరోయిన్
అలా వైకుంఠపురములో, బ్రోచేవారెవరురా, పాగల్, రెడ్ లాంటి టాలీవుడ్ సినిమాల్లో అలరించిన బ్యూటీ నివేదా పేతురాజ్. 2023లో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన దాస్ కా ధమ్కీలో కనిపించింది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత వెండితెరపై మెరిసింది. ఇటీవలే థియేటర్లలో విడుదలైన సింగ్ గీతంలో మెరిసింది. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు.ఈ ఈవెంట్‌కు హాజరైన హీరోయిన్ నివేదా పేతురాజ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన కెరీర్ ఇక ముగిసిపోయిందేమో అనుకున్నాననని తెలిపింది. 2023లో సినిమాలు మానేయాలని నిర్ణయించుకున్నానని వెల్లడించింది. ఆ తర్వాత నుంచి తన ప్లాన్ అంతా రాంగ్ రూట్లోనే వెళ్లిందని చెప్పుకొచ్చింది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత సింగ్ గీతంతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చానని ఆనందం వ్యక్తం చేసింది. కానీ నాగ్ అశ్విన్ తనకు మళ్లీ లైఫ్ ఇచ్చారని ఆనందం వ్యక్తం చేసింది. లేదంటే ఇప్పటికే హిమాలయాల్లో ఉండేదాన్నేమోనని కామెంట్స్ చేసింది. కాగా.. ఇటీవల రిలీజైన సింగ్ గీతం మూవీకి 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించగా.. నాగ్ అశ్విని నిర్మించారు.చదవండి: పెళ్లి రద్దుపై తొలిసారి స్పందించిన హీరోయిన్ -
‘సింగ్-గీతం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
అది సింగీతంగారి గొప్పతనం: నాగ్ అశ్విన్
‘‘సింగ్ గీతం’కి పని చేసిన ప్రతి ఒక్కరి నిజాయితీ తెరపై కనిపించింది. అలాంటి మ్యాజిక్‌ను ప్లాన్ చేసి చేయలేం. ‘మహానటి’ తర్వాత ప్రేక్షకులు ఇంతగా ఓన్ చేసుకున్న సినిమా ఇదే. అది సింగీతంగారి గొప్పతనం’’ అన్నారు నాగ్ అశ్విన్ . అయాన్ , అహల్యా బుమ్రూ, షాలిని కొండెపూడి ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘సింగ్ గీతం’. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది. ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని యూనిట్ పేర్కొంది.ఈ సందర్భంగా ఆదివారం జరిగిన గోల్డెన్ బ్లాక్‌బస్టర్ ఈవెంట్లో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ– ‘‘సావిత్రిగారి గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు తొలిసారి సింగీతంగారిని కలిశాను. లెజెండరీ ఫిల్మ్ మేకర్ అయిన ఆయన్ను ఒకసారి కలవడమే జీవితాంతం గుర్తుండి΄ోయే మెమరీ. కానీ ఆ జర్నీ ఇంత దూరం వస్తుందని ఊహించలేదు. ఆయన కలకు తెర రూపం ఇవ్వడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు తామే పాటలు పాడారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అద్భుతంగా కుదిరింది. ఈ సినిమాకు మరో దర్శకుడు సంకల్ప్.94 ఏళ్ల దర్శకుడు, 24 ఏళ్ల దర్శకుడు కలిసి అందమైన మ్యాజిక్‌ను సష్టించారు’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చాలా బాగుంది. సింగీతంగారు ఏడేళ్ల క్రితమే నాకీ కథ చె΄్పారు. చాలామంది నిర్మాతలను కలిసినా కుదర్లేదు. ఇప్పుడు నాగ్ అశ్విన్ రూపంలో అది సాధ్యమైంది’’ అని అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఎప్పటినుంచో మంచి మ్యూజికల్ సినిమా చేయాలన్న నా ఆకాంక్ష ‘సింగ్ గీతం’తో నెరవేరింది. సింగీతంగారి 40 ఏళ్ల కల ఈ సినిమా. ఈ కలలో మేం భాగం కావడం హ్యాపీగా ఉంది.ఈరోజు ఈ సెలబ్రేషన్ జరుగుతోందంటే దానికి ప్రధాన కారణం నాగ్ అశ్విన్‌గారు. ఎన్నో సినిమాలు బ్లాక్‌బస్టర్ అవుతాయి, డబ్బులు, పేరు తెస్తాయి. కానీ ఒక క్రియేటర్‌కు నిజమైన సంతృప్తినిచ్చే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. నాకలాంటి సంతృప్తినిచ్చిన సినిమా ‘సింగ్ గీతం’’ అని చె΄్పారు. ‘‘సింగీతంగారిలాంటి లెజెండరీ దర్శకుడి సినిమాకి పని చేయడం మా అదృష్టం’’ అని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంకల్ప్, నటీనటులు నివేదా పేతురాజ్, అహల్య, శాలిని, అయాన్, రాహుల్ రవీంద్రన్, బెనర్జీ, శివన్నారాయణ తదితరులు పేర్కొన్నారు. -
పెళ్లి రద్దు! తొలిసారి స్పందించిన టాలీవుడ్ హీరోయిన్
కొందరు హీరోయిన్లు వయసులోనే పెళ్లి చేసుకుంటే.. మరికొందరు మాత్రం కాస్త ఏజ్ బార్ అయిపోయిన తర్వాత వైవాహిక బంధంలోకి అడుగుపెడుతుంటారు. రీసెంట్ టైంలో చూసుకుంటే రష్మిక, కీర్తి సురేశ్ తదితరులు కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే తాము ప్రేమించిన వాళ్లతో కొత్త జీవితాలు ప్రారంభించేశారు. అయితే టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ మాత్రం గతంలో ప్రియుడిని పరిచయం చేసింది. పెళ్లికీ సిద్ధమైంది. ఏమైందో ఏమో గానీ అన్నింటినీ రద్దు చేసుకుంది. ఇప్పుడు 'సింగ్ గీతం' మూవీతో నటిగా రీఎంట్రీ ఇచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా)ఈ చిత్ర సక్సెస్ మీట్ ఆదివారం జరగ్గా.. ఇందులోనే తన కెరీర్ గురించి మాట్లాడిన నివేదా పేతురాజ్ పరోక్షంగా తన ప్రేమ, ప్రియుడు, పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 2023లో నేను సినిమాలు మానేయాలి అని నిర్ణయించుకున్నాను. తర్వాత కొన్ని రాంగ్ డెసిషన్స్ లాంటివి తీసుకున్నా. ఫైనల్‌గా 'సింగ్ గీతం'తో రీ ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా అనిపించింది అని నివేదా చెప్పుకొచ్చింది.నివేదా చెప్పిన వాటిలో రాంగ్ డెసిషన్స్ అనేవి ప్రియుడు, పెళ్లి గురించే అనిపిస్తోంది. దుబాయికి చెందిన రజిత్ ఇబ్రాన్ అనే బిజినెస్‌మ్యాన్‌తో ప్రేమలో ఉన్నట్లు ఈ హీరోయిన్.. 2023లో వెల్లడించింది. కానీ మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారు. కాకపోతే దీని గురించి ఎక్కడ మాట్లాడని నివేదా.. ఇన్ స్టాలో ఫొటోలని డిలీట్ చేసింది. 'సింగ్ గీతం'తో రీఎంట్రీ ఇచ్చిన ఈమె ప్రస్తుతం వెంకటేశ్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం', చిరంజీవి-బాబీ మూవీలోనూ కీలక పాత్రలు చేస్తోంది.(ఇదీ చదవండి: పెళ్లిరోజు స్పెషల్.. సర్ప్రైజ్ ఇచ్చిన ఉపాసన) -
సింగ్ గీతం.. 94 ఏళ్ల వయసులో అదే డెడికేషన్..!
సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కిచిన తాజా చిత్రం సింగ్ గీతం. ఆయన ఇంటి పేరుతోనే వచ్చిన ఈ మూవీకి 94 ఏళ్ల వయసులో దర్శకత్వం వహించారు. ఈ వయసులో సినిమాకు దర్శకత్వం వహించడం అంటే మాటలు. దాదాపు 90 ఏళ్లు పైబడిన వ్యక్తి సెట్‌కు వచ్చి తెరకెక్కించడం సవాల్‌తో కూడుకున్న పనే. అయినా కూడా ఆయన పట్టుదలతో ఈ మూవీని రూపొందించారు. ఈ వయసులో కూడా కథ చెప్పడం పట్ల ఆయనకున్న అభిరుచి, నిబద్ధతతో ఇప్పటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ చిత్రాన్ని కేవలం 77 రోజుల్లోనే పూర్తి చేయడం మరో విశేషం. ఈ విషయాన్ని మూవీ టీమ్ సన్నిహితులు వెల్లడించారు.ఈ మూవీ కోసం సింగీతం శ్రీనివాసరావు పనిచేసిన తీరును కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ పంచుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు ఎలా దర్శకత్వం వహించారో వివరించారు. ఈ మూవీ కోసం ఎన్నో సర్దుబాట్లు అవసరమయ్యాయని అన్నారు. చెన్నైలో షూటింగ్ బాగానే జరిగిందని.. కానీ హైదరాబాద్‌లో మాత్రం కష్టంగా అనిపించిందని చెప్పారు. ఆయన ప్రయాణించలేని సమయంలో ఇంట్లోనే ఒక వర్చువల్ మానిటర్‌ను ఏర్పాటు చేశారు. సింగీతం హెడ్సెట్ ద్వారా నటీనటులకు, సిబ్బందికి మార్గనిర్దేశం చేస్తూ వచ్చారు. దూరం నుంచే షూటింగ్‌ను పర్యవేక్షించారు.అయినప్పటికీ ఆయన ఎక్కువ భాగం ఆయన భౌతికంగా సెట్లోనే ఉన్నారని తెలిపారు. ఈ మూవీ చివరి రెండు నెలల్లో దర్శకుడికి దగ్గు రావడం.. అది తీవ్రమై ఇన్ఫెక్షన్గా మారిందని నాగ్ అశ్విన్ గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో కొంచెం బరువు తగ్గారని.. కానీ అదేమీ ఆయన ఉత్సాహాన్ని తగ్గించలేదన్నారు. సింగీతం అభిరుచి ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తుందని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. కాగా.. ఈ చిత్రంలో అయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండేపూడి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించారు. -
‘సింగ్ గీతం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: సింగ్ గీతంనటీనటులు: అయాన్, అహల్య బమ్రూ, షాలిని కొండేపూడి, తులసి, బెనర్జీ, శివనారాయణ, అగు స్టాన్లీ తదితరులునిర్మాణ సంస్థ: వైజయంతీ మూవీస్, స్వప్న సినిమానిర్మాత: నాగ్ అశ్విన్దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావుసంగీతం: దేవిశ్రీ ప్రసాద్విడుదల తేది: జూన్ 12, 2026ట్రెండ్‌కి భిన్నంగా ఆలోచించే దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. అన్ని జానర్లో సినిమా తీయడమేకాదు.. అందులో కొత్త ప్రయోగాలు చేసి విజయం సాధించాడు. ఆదిత్య 369, విచిత్ర సోదరులు, భైరవద్వీపం, మైఖెల్ మదన కామ రాజు.. ఇలా అప్పట్లోనే ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసి మెప్పించాడు. చాలా ఏళ్ల తర్వాత మెగా ఫోన్ చేతపట్టి ‘సింగ్ గీతం’అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సారి కూడా మరో కొత్త ప్రయోగమే. మాటలనే పాటగా మార్చి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. మరి 94 ఏళ్లు యువకుడు తీసిన చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. కుబేర పురం అనే ఒక ఫిక్షనల్ విలేజ్ చుట్టూ ఈ సినిమా కథనం తిరుగుతుంది. ఆ ఊరంతా బంగారమే ఉంటుంది. దాన్ని దోచుకోవడానికి రేణూ (షాలిని కొండేపూడి), ఆమె తండ్రి మైనింగ్ సాగిస్తుంటారు. ఆ మైనింగ్‌ను ఓ విదేశీ వ్యాపారాస్తుడికి అమ్మేయడానికి ప్లాన్ చేస్తారు. అదే సమయంలో తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూములు అక్కడ ఉన్నాయని తెలుసుకుని ప్రతాప్ (అయాన్) ఆ ఊరికి వస్తాడు. తన భూమిలో బంగారు గనులున్నాయని తెలుసుకొని రేణూతో చేతులు కలుపుతాడు. బంగారాన్ని దోచుకోవడానికి ఆ ఊర్లో ఉన్న ఆఖరి చెట్టుని కూడా నరికేస్తారు. ఆ చెట్టుని తన తల్లిలా భావించి గౌరి(అహల్య) వద్దని అడ్డుకున్నా ఆ చెట్టుని తొలగిస్తారు. దీంతో ఆ ఊరి దేవుడు కుబేరుడికి కోపం వస్తుంది. ఆ ఊరికి ఓ శాపం ఇస్తాడు. ఎవరి నోట్లోంచి మాటే రాదు. కేవలం పాట మాత్రమే వస్తుంది. ఏం మాట్లాడాలన్నా పాట రూపంలోనే మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంతేకాదు నిజాలు మాత్రమే బయటకు వస్తుంటాయి. మరి ఈ పాటల వల్ల, వాళ్లు చెబుతున్న నిజాల వల్ల వారి జీవితాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేది మిగతా కథ. ఎలా ఉందంటే.. మాటలు లేకుండా పాటలతో సినిమా చేయడం.. వినడానికి ఇప్పటికీ విచిత్రంగా ఉంది కదా? కానీ 40 ఏళ్ల కిందటే సింగీతం శ్రీనివాసరావు ఈ ఆలోచన చేశాడు. ఇలాంటివి పేపర్‌పై రాసుకోవడానికి బాగుంటాయి. కానీ ఆచరణలో పెట్టడమే చాలా కష్టం. ప్రతి మాట.. ఎమోషన్ని పాట రూపంలో చెప్పడం అంత ఈజీ కాదు. కానీ సింగీతం అది చేసి చూపించాడు. 40 ఏళ్ల కింద రాసుకున్న కథ అయినప్పటికీ.. నేటికీ నవ్యత లోపించలేదు. నేటితరానికి ఇవ్వాల్సిన మంచి సందేశం ఈ కథలో ఉంది. ప్రకృతి ఎంత గొప్పదో చెబుతూనే.. మనిషి అత్యాశతో పర్యావరణాన్ని ఎలా నాశనం చేస్తున్నాడో ఇందులో చూపించాడు. అయితే ఈ సినిమా మొత్తం పాటలే ఉన్నాయా? మాటలు లేవా? అంటే ఉన్నాయి. సినిమా ప్రారంభం నుంచి తొలి 20 నిమిషాలు మూములుగానే కథనం సాగుతుంది. సాధారణ సినిమాల్లోలాగే మాటలు ఉంటాయి. ప్రతాప్ కుబేరపురం రావడం.. ఆ ఊరి ప్రజల పరిచయం.. మైనింగ్ మాఫియా నేపథ్యం అంతా రొటీన్‌గానే సాగుతుంది. ఎప్పుడైనే ఊరికి శాపం తగులుతుందో అప్పటి నుంచి మాటలు కాస్త పాటలుగా మారుతాయి.‘ఏమయ్యింది.. ఏమయ్యింది..’ అంటూ ఊరంతా పాడుకోవడం నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. పాట వరకు సరదాగే సాగినా.. ఆ తర్వాత మాటలు కూడా పాటలుగా రావడం బోరింగ్‌గా అనిపిస్తుంది. దానికి తోడు ఆయా సన్నివేశాలన్నీ సినిమాటిక్‌గానే అనిపిస్తాయి తప్ప ఎక్కడ సహజంగా అనిపించదు. ఇంటర్వెల్ వరకు ఇలానే సాగుతుంది. ఇక సెండాఫ్లో మాత్రం దర్శకుడు కథపై ఫోకస్ పెట్టాడు. ద్వితియార్థంలో బలమైన కథను చెప్పే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ హృదయాలను హత్తుకుంటుంది. ఆ తర్వాత ప్రతాప్ మారిపోవడం.. ఆస్తిపై కీలక నిర్ణయం తీసుకోవడం, ఈ తర్వాత నడిచే డ్రామా ఆకట్టుకుంటుంది. ప్రీక్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సింగీతం మరోసారి తన మార్క్ చూపించాడు. ఇక చివరిలో విజయ్ దేవరొకండ ఎంట్రీ సర్ప్రైజ్ చేస్తుంది. పార్ట్ 2 ఉంటుందన్నట్లుగా విజయ్ ఈ గెస్ట్ ఎప్పీరియన్స్ ఉంది. మరి సీక్వెల్ ఉంటుందా లేదా? అనేది చూడాలి. ఎవరెలా చేశారంటే..సినిమాలో ప్రధాన పాత్రలు పోషించినవారంతా కొత్తవాళ్లే అయినా చక్కగా నటించారు. చెట్టులో తల్లిని చూసుకునే గౌరి పాత్రలో అహల్య ఒదిగిపోయింది. అయితే ఆమె డబ్బింగ్ మాత్రం కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. నెగెటివ్ షేడ్స్ ఉండే ప్రతాప్ పాత్రలో అయాన్, రేణూ పాత్రలో షాలిని తమదైన సహజ నటనతో మెప్పించారు. రాహుల్ రవీంద్రన్, నివేదా పేతురాజ్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. సినిమాకు వాళ్ల పాత్రలే చాలా కీలకం. సీనియర్ నటి తులసికి ఈ సినిమాలో మంచి పాత్ర లభించింది. అతిథి పాత్రలు చేసిన అనుదీప్, విజయ్ దేవరకొండతో పాటు మిగిలినవారు కూడా తమ పాత్రల పరిధిమేర బాగానే చేశారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. సినిమా మొత్తం పాటలే ఉంటాయి. మాటలను కూడా పాటలుగా ట్యూన్ చేసిన తీరు బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. ఆయన కెరీర్లో ఇదొక డిఫరెంట్ చిత్రంగా నిలుస్తుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు బాగోలేదు. ఊరుతో పాటు సినిమాలో వేసిన ప్రతి సెట్.. ఆర్టిఫియల్గానే కనిపిస్తాయి తప్ప.. ఎక్కడ కూడా సహజంగా కనిపించవు. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
సింగ్ గీతంలాంటి సినిమా ఇప్పటివరకూ రాలేదు: నిర్మాత నాగ్ అశ్విన్
‘‘సింగీతం శ్రీనివాసరావుగారు 14 ఏళ్ల తర్వాత మళ్లీ దర్శకత్వం వహించిన చిత్రం ‘సింగ్ గీతం’. ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు’’ అని నిర్మాత నాగ్ అశ్విన్ తెలిపారు. ఆయాన్, అహల్యా బమ్రూ జంటగా శాలిని కొండెపూడి కీలక పాత్ర పోషించిన చిత్రం ‘సింగ్ గీతం’. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్‌పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ మూవీ నేడు విడుదలవుతోంది.ఈ సందర్భంగా బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ– ‘‘ఏడాదిగా నేను, దేవిశ్రీ ప్రసాద్‌గారు, మా టీమ్ అందరం సింగీతంగారితో ప్రయాణం చేసి, ఇలాంటి సినిమా ఎలా తీయాలో నేర్చుకుంటూ ఈ చిత్రాన్ని రూపొందించాం. సింగీతంగారి స్టైల్లో చేసిన మరో సరికొత్త ప్రయోగం ఇది. నేను 10 ఏళ్ల వయసులో ‘ఆదిత్య 369’ సినిమా చూసి, స్ఫూర్తి పొందాను. ఇప్పుడు ఆయనతో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా చూసి మరో 10 ఏళ్ల కుర్రాడు కూడా స్ఫూర్తి పొందాలన్నది మా ఆశ’’ అని పేర్కొన్నారు. -
‘సింగ్ గీతం’పై చిరు ట్వీట్
లెజండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన కొత్త మూవీ ‘సింగ్ గీతం’. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ చిరంజీవి ట్వీట్ చేశాడు.‘శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు..తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన ఒక భీష్మాచార్యుడు. ఆయన ఒక అమూల్యమైన ఆస్తి, ఒక నిధి. దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా, ఎంతోమంది కళాకారులకు అవకాశాలు కల్పించి వారి జీవితాలకు మార్గదర్శకుడయ్యారు. అలాంటి మహోన్నత వ్యక్తి దర్శకత్వంలో ఈ నెల 12 వ తేదీన సింగ్ గీతం సినిమా విడుదల అయ్యి, ఇండియన్ సినిమాలో మరొక మైలురాయి గా నిలుస్తుందని, పెద్ద విజయం సాధించాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.అలాగే ఇలాంటి పెద్దలను గౌరవిస్తూ, వారి అనుభవాన్ని కొత్త తరానికి అందించే ఆలోచనతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాత నాగ్ అశ్విన్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఒకవైపు ఆ నాటి తరానికి ప్రతినిధిగా నిలిచిన సింగీతం శ్రీనివాసరావు, మరోవైపు ఈ తరం ఆలోచనలను ప్రతిబింబించే నాగ్ అశ్విన్..వీరి కలయిక ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది.అలాగే ఈ చిత్రానికి, నాకెంతో ఇష్టమైన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం మరింత ఉత్సాహాన్ని కలగజేస్తుంది. నాగ అశ్విన్ కి, స్వప్న సినిమా, వైజయంతి మూవీస్‌కి,అలాగే ఈ చిత్రం లో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని చిరంజీవి ట్వీట్ చేశాడు. "శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు"తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన ఒక భీష్మాచార్యుడు. ఆయన ఒక అమూల్యమైన ఆస్తి, ఒక నిధి. దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా, ఎంతోమంది కళాకారులకు అవకాశాలు కల్పించి వారి జీవితాలకు మార్గదర్శకుడయ్యారు.అలాంటి మహోన్నత వ్యక్తి దర్శకత్వంలో ఈ… pic.twitter.com/tA6rvr14Il— Chiranjeevi Konidela (@KChiruTweets) June 11, 2026 -
సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా సాంగ్ రిలీజ్
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన తాజా చిత్రం సింగ్ గీతం. సంగీతమే ప్రధానంగా ఈ మూవీని తెరకెక్కించారు. 94 ఏళ్ల వయసులో ఈ సినిమాను రూపొందించడం విశేషం. ఈ మూవీ జూన్ 11న రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ సందర్భంగా సింగ్ గీతం మూవీ నుంచి క్రేజీ సాంగ్ విడుదల చేశారు. ఓరి జీవుడా జీవుడా అంటూ సాగా పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా.. శంకర్‌బాబు ఆలపించారు. ఈ సాంగ్‌ను దేవీశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. తాజాగా రిలీజైన ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. -
45 ఏళ్లుగా ఆ సినిమా చేయలేకపోయాం: కమల్ హాసన్
కమల్ హాసన్-సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్లో వచ్చిన ‘పుష్పక విమానం’ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా హిట్ అయిన తర్వాత సింగీతం శ్రీనివాస రావు మరో కథను కూడా కమల్‌కు వినిపించాడట. 45 ఏళ్ల క్రితమే ఆ సినిమాను తెరకెక్కించాలని భావించారట కానీ, అది సాధ్యం కాలేదు. దాదాపు 45 ఏళ్ల తర్వాత ఇప్పుడు తెరపైకి వచ్చింది. అదే ‘సింగ్ గీతం’. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని చెన్నైలో నిర్వహించారు. ప్రముఖ హీరో కమల్ హాసన్ ముఖ్య అథితిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన సింగీతం శ్రీనివాసరావుతో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ.. ‘సింగ్ గీతం’సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘నాకు 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడు సింగీతం శ్రీనివాసరావుతో పరిచయం ఏర్పడింది. మా తొలి సినిమా అనుకోకుండా తెరకెక్కింది. ఆ తర్వాత నాకు రెండు కథలు వినిపించాడు. అందులో పుష్పక విమానం తెరకెక్కింది. రెండో కథ మాత్రం అలానే ఉండిపోయింది. దాని గురించి 45 ఏళ్లుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ చేయలేకపోయాం. అదే సింగ్ గీతం. 45 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సింగీతం శ్రీనివాసరావుకు వయసు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే. ఆలోచన విషయంలో ఆయన ఇప్పటికీ జెన్ జీ కన్నా ఒక అడుగు ముందే ఉంటాడు. ఆయన నుంచి ఇంకా నేర్చుకుంటున్నా. సింగీతం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయాలని ఉంది’ అని కమల్ అన్నారు. నాకు 20 ఏళ్ల వయసున్నప్పుడు సింగీతం గారితో మొదటిసారి ఈ సినిమా గురించి మాట్లాడాను... మాట్లాడుకుంటున్నాం కానీ చేయలేకపోయాం. ఇప్పుడు నాకు 71... ఇప్పటికి ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయింది. Some Ideas are Ageless - Ulaganayagan #KamalHaasan #SingGeetham pic.twitter.com/fjHwUA5p0O— Sai Satish (@PROSaiSatish) June 7, 2026 -
నేలపై కూర్చుకున్న నాగ్ అశ్విన్.. 'కల్కి' దర్శకుడి వీడియో వైరల్
ఈ రోజుల్లో చిన్న సినిమాలు చేసిన కొద్దిమంది నటులు, దర్శకులే తాము పెద్ద సెలబ్రిటీలమనే రేంజ్లో ఫీల్ అవుతూ గాల్లో తేలిపోతుంటారు. కానీ, ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్స్‌తో 'కల్కి 2898 AD' లాంటి గ్లోబల్ పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ సినిమా తీసిన స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాత్రం తన సింప్లిసిటీతో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన నిరాడంబరతకు అద్దం పట్టే ఒక అరుదైన ఘటన తాజాగా చెన్నైలో చోటుచేసుకుంది.లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో, వైజయంతీ మూవీస్ సమర్పణలో 'సింగ్ గీతం' అనే సినిమాను నాగ్ అశ్విన్ నిర్మించాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చెన్నైలో ఒక ప్రత్యేక ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు కోలీవుడ్ విశ్వనాయకుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు రావడంతో వేదికపై మరియు గెస్టుల గ్యాలరీలో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. వచ్చిన అతిథులకు, ప్రత్యేక ఆహ్వానితులకు కూర్చోవడానికి సీట్లు సరిపోలేదు. తన సినిమా ఈవెంట్‌కు వచ్చిన అతిథులకు ఇబ్బంది కలగకూడదని భావించిన నాగ్ అశ్విన్.. ఏమాత్రం ఈగోకు పోకుండా, తాను ఒక స్టార్ డైరెక్టర్ ని అనే విషయాన్ని పక్కన పెట్టి, సోఫాల పక్కనే కింద నేల మీద కూర్చుండిపోయారు. కమల్ హాసన్ లాంటి లెజెండ్ పక్కన కూర్చునే అవకాశం ఉన్నప్పటికీ, అతిథుల సౌకర్యం కోసం నాగ్ అశ్విన్ కింద కూర్చోవడం చూసి అక్కడి వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవ్వడంతో నాగ్ అశ్విన్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. Producer Nag Ashwin @nagashwin7 at #SingGeetham movie pre release event.. 🙏 pic.twitter.com/NJgolG5BNG— H A N U (@HanuNews) June 7, 2026 -
94 ఏళ్ల వయసులో ఇలాంటి సినిమా.. భవిష్యత్తులో కూడా కష్టమే : నాగ్ అశ్విన్
‘‘సింగీతం శ్రీనివాసరావుగారు ఎప్పుడూ అంతర్జాతీయ స్థాయిలోనే ఆలోచిస్తారు. ‘సింగ్ గీతం’లాంటి సినిమా ప్రపంచంలో ఎక్కడా రాలేదని ఆయన చెప్పేవారు. ఈ సినిమా పూర్తయ్యాక చూస్తుంటే నిజంగానే ఈ తరహా సినిమా ఇప్పటివరకు రాలేదనిపిస్తోంది. భవిష్యత్‌లో కూడా ఇలాంటి సినిమా రావడం కష్టమే. మన తరానికి సింగీతంగారు ఈ సినిమా ఇస్తున్నారంటే మనం అదృష్టవంతులమనే చెప్పాలి. పదేళ్ల తర్వాత గుర్తుండిపోయే సినిమా తీయాలనే ఉద్దేశంతో ఈ ‘సింగ్ గీతం’ చిత్రం చేశాం’’ అని దర్శక–నిర్మాత నాగ్ అశ్విన్ చెప్పారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి నటించిన సినిమా ‘సింగ్ గీతం’. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ చెప్పిన విశేషాలు... → ‘పుష్పక విమానం’ సినిమాకు ముందే సింగీతంగారు ‘సింగ్ గీతం’ కథను కమల్‌హాసన్‌గారికి చెప్పారు. అయితే సింగీతంగారికి ఉన్న కొన్ని ప్రాజెక్ట్స్ కారణంగా ఈ చిత్రాన్ని అప్పట్లో చేయడం ఆయనకు సాధ్యపడలేదు. ఇప్పుడు కుదిరింది. సింగీతంగారి సినిమాల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. ‘పుష్పక విమానం, ఆదిత్య 369, భైరవద్వీపం’ ఇలా ఆయన డైరెక్షన్లో వచ్చిన ఏ సినిమాను తీసుకున్నా టైమ్‌లెస్‌గా ఉంటాయి. ‘పుష్పక విమానం’ ఇప్పటికి సంబంధించిన సినిమాలానే ఉంటుంది. ‘సింగ్ గీతం’ కూడా ఈ జనరేషన్ కోసం తీసిన కథలానే అనిపిస్తుంది. → ‘మహానటి’ సినిమా తర్వాత సింగీతంగారు నాకు ‘సింగ్ గీతం’ సినిమా కథ చెప్పారు. ఇది కల్పిత కథ. కుబేరపురంలో గోల్డ్ మైన్స్ ఉంటాయి. ఆ ఊరికి, ఆ గోల్డ్ మైన్స్‌కు ఉన్న సంబంధం ఏంటి? అనేది సింగీతంగారి శైలిలో హ్యూమర్, హ్యుమానిటీల మేళవింపుతో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా ఒక ప్రత్యేక ప్రపంచంలో జరుగుతున్నట్లుగా సాగుతుంది. కాబట్టి పెద్ద స్టార్స్ అయితే వారి ఇమేజ్ ప్రభావం ఈ కథపై పడే అవకాశం ఉంది. ఈ సినిమా ప్రపంచాన్ని ప్రేక్షకులు కొత్తగా, సహజంగా ఫీలవ్వాలనే ఉద్దేశంతో సింగీతంగారు కొత్తవారిని తీసుకున్నారు. → ఈ సినిమా కోసం సింగీతంగారితో రెండేళ్లు ప్రయాణించాను. ఒకసారి ఆయన ఏదైనా చెప్పి, ఆ తర్వాత అది ఆయనకే నచ్చకపోతే మార్చేస్తారు. ‘మీరే చెప్పారు కదా?’ అంటే... ‘నేను తప్పు చేయకూడదా?’ అంటారు. నేను కొత్తతరం దర్శకుడినా? కాదా అనే సందేహం నాకు అప్పుడప్పుడు వస్తుంటుంది (సరదాగా). కానీ సింగీతంగారు 94 ఏళ్ల వయసులో కూడా ఓ టీనేజర్ తీసినట్లే ఈ సినిమా తీశారు. ఈ ప్రాజెక్ట్ ప్రతి అడగులో నేను ఉన్నాను. సింగీతంగారి విజన్‌ను స్క్రీన్‌పై తీసుకురావడానికి ఒక అసిస్టెంట్ డైరెక్టర్లా ఉన్నానని అనుకోవచ్చు. → మ్యూజిక్ పరంగా ఇది చాలెంజింగ్ సినిమా. ఇందులో డైలాగ్స్ అన్నీ పాటల్లా వస్తాయి. కానీ మ్యూజిక్ వింటున్నాం అనే ఫీలింగ్ రాదు. దేవిశ్రీ ప్రసాద్‌గారు మంచి సంగీతం ఇచ్చారు. → ఏ సినిమా సక్సెస్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ కథను నిజాయితీగా చెప్పడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ‘పుష్పక విమానం’ కథను సింగీతంగారు చెప్పినప్పుడు కూడా ‘మాటలు లేకుండా సినిమా ఏంటి?’ అని చాలామంది అనుకుని ఉంటారు. నేను ‘మహానటి’ తీస్తానంటే ‘ఇప్పుడు ఇలాంటి సినిమా ఎవరు చూస్తారు?’ అనే మాటలు వినిపించాయి. సినిమా పూర్తయ్యేవరకు ఎవరూ అంచనా వేయలేరు. నిజాయితీని నమ్మితే విజయం దానంతట అదే వస్తుంది. → నా డైరెక్షన్‌లోని ‘కల్కి 2’ చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభమైంది. వచ్చే నెల నుంచి కంటిన్యూస్‌గా షూటింగ్ జరపడానికి ప్లాన్ చేశాం. రిలీజ్ ఎప్పుడనే విషయంపై ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేను. -
సింగ్ గీతం చేయడం నా అదృష్టం: దేవిశ్రీ ప్రసాద్
‘‘సింగీతం శ్రీనివాసరావుగారు చేసినన్ని ప్రయోగాలు ఎవ్వరూ చేసి ఉండరు. ‘సింగ్ గీతం’ ప్రాజెక్ట్ చేస్తున్నామని మూడేళ్ల క్రితం ఆయన చెప్పినప్పుడు హ్యాపీ అనిపించింది. నాగ్ అశ్విన్‌గారు, స్వప్నగారు, వైజయంతి మూవీస్‌తో కలిసి ఈ సినిమా రూపొందడం మరింత ఆనందాన్నిచ్చింది. ఈ సినిమా చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు.ఆయాన్, అహల్యా బమ్రూ జంటగా శాలిని కొండెపూడి కీలక పాత్ర పోషించిన చిత్రం ‘సింగ్ గీతం’. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్‌పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ చెప్పిన విశేషాలు.⇒ నేను సింగీతంగారికి వీరాభిమానిని. మా నాన్న సత్యమూర్తిగారిని కలవడానికి వచ్చినప్పుడు వాళ్లు మాట్లాడుకుంటుంటే నేను ఆరాధనగా చూసేవాడిని. అలాంటిది సింగీతంగారితో కలిసి పని చేయడం ఒక ఆశీర్వాదంగా అనిపించింది. సింగీతంగారు ఎప్పుడూ ట్రెండ్‌కి తగ్గట్టు కథలు ఆలోచించలేదు. ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంటే అది ఇంతకు ముందు రానిది, తర్వాత కూడా రానిదిగా ఉంటుంది. ‘పుష్పక విమానం’ ఇప్పటికీ చాలా అడ్వాన్డ్స్ మూవీ. ‘సింగ్ గీతం’ ఐడియా కూడా అంతే కొత్తగా ఉంటుంది. ⇒ ఒక గ్రామం మొత్తం మాట్లాడలేక కేవలం పాటల రూపంలోనే సంభాషించే కథ ఇప్పటివరకు రాలేదు. అది ‘సింగ్ గీతం’లో కొత్తగా ఉంటుంది. నా కెరీర్లో సవాల్‌తో కూడుకున్న సినిమా ఇది. ఇది కేవలం కామెడీ సినిమా కాదు... అద్భుతమైన భావోద్వేగాలు కూడా ఉన్నాయి. కమల్‌హాసన్‌గారు సినిమా చూసి, ‘ఇలాంటి సినిమాలో నేను కూడా భాగం కావాల్సింది’ అనడం మాకు ఆనందాన్నిచ్చింది. ⇒ చిన్నప్పటి నుంచి ప్రతి అక్ష రాన్ని సంగీతంగా మార్చే అలవాటు నాకుండేది. అప్పుడు న్యూస్‌పేపర్ తీసుకుని అందులో ఉన్న వార్తలనే ట్యూన్స్‌గా మార్చుకునేవాడిని. అది ‘సింగ్ గీతం’కి ఉపయోగపడింది. ఈ సినిమా కోసం ప్రతిదీ ముందుగానే మ్యూజికల్‌గా చేసి ఇచ్చాం. తర్వాత షూట్ చేశారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ పాడగలిగారు. 94 ఏళ్ల వయసులోనూ కొత్త ఆలోచనతో, ఉత్సాహంగా సినిమా చేసిన సింగీతంగారి నుంచి ప్రేక్షకులు స్ఫూర్తి పొందుతారు. -
సింగ్ గీతంలో నాది బలమైన పాత్ర
‘‘సింగీతం శ్రీనివాస్‌గారి సినిమాల్లో మహిళల పాత్రలు బలంగా ఉంటాయి. ‘సింగ్ గీతం’లో నాది కూడా బలమైన వ్యక్తిత్వం కలిగిన పాత్ర’’ అని అహల్య బమ్రూ తెలిపారు. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన చిత్రం ‘సింగ్ గీతం’. ఆయాన్, అహల్యా బమ్రూ హీరో హీరోయిన్లుగా శాలిని కొండెపూడి కీలక పాత్ర పోషించారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్‌పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా అహల్య బమ్రూ మాట్లాడుతూ– ‘‘మాది పుదుచ్చేరి. ఇంగ్లిష్, ఫ్రెంచ్, బెంగాలీ వంటి భాషలు మాట్లాడే ఒక ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో పెరిగాను. నేను ఎప్పుడూ నటిని అవ్వాలని అనుకోలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ క్రియేట్ చేస్తుంటాను. నాగ్ అశ్విన్‌గారు నా కంటెంట్ చూసి ‘సింగ్ గీతం’ గురించి చెప్పారు. నా ఆడిషన్ కూడా ఇన్‌స్టా్రగామ్ ద్వారానే ఇచ్చాను. 94 ఏళ్ల వయసులో మోడ్రన్ ఆలోచనతో సినిమా చేయడం సింగీతంగారికే సాధ్యం. నిర్మాతగానే కాదు.. క్రియేటివ్ ్ర΄ాసెస్లో కూడా నాగ్ అశ్విన్‌గారు కీలక ΄ాత్ర ΄ోషించారు. తెలుగులో మహేశ్‌బాబుగారు అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు. -
ఆ ఊరిలో పాటల రూపంలో మాట్లాడతారు.. అదే ‘సింగ్ గీతం’
‘‘సింగ్ గీతం’ పూర్తిగా ఒరిజినల్ కాన్సెప్ట్. భారతీయ సినీ చరిత్రలోనే తొలి మ్యూజికల్ కామెడీ ఫిల్మ్. కుబేరపురం అనే ఒక ఫిక్షనల్ గ్రామంలో జరుగుతుంది. ఆ ఊరిలో అందరూ పాటల రూపంలో ఎందుకు మాట్లాడతారు? అనేది థియేటర్లో చూసి ఆస్వాదించాల్సిందే. ఇలాంటి జానర్లో ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదు’’ అని శాలిని కొండెపుడి తెలిపారు.లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘సింగ్ గీతం’. ఆయాన్, అహల్యా బమ్రూ జంటగా శాలిని కొండెపూడి కీలక పాత్ర పోషించారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్‌పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శాలిని కొండెపుడి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మై డియర్ దొంగ, జయమ్మ పంచాయితీ, శుభం’ వంటి చిత్రాలు చేశాను.‘సింగ్ గీతం’లో నా పాత్ర నెగటివ్ షేడ్‌లో ఉంటుంది. తాను అనుకున్నది సాధించాలనుకునే మనస్తత్వంతో పాటు తాను నమ్మిందే నిజమని భావించే పాత్ర నాది. ఇలాంటి పాత్రలు అరుదుగా వస్తాయి. సింగీతం, నాగ్ అశ్విన్గార్ల విజన్‌తో పాటు వారి సెన్సిబిలిటీస్ కూడా ఈ మూవీలో కనిపిస్తాయి. సింగీతంగారి దర్శకత్వంలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. దేవిశ్రీ ప్రసాద్‌గారు మాటలను పాటలుగా అద్భుతంగా మార్చారు. నాగ్ అశ్విన్‌గారు నిర్మించిన ఈ మూవీ హిట్ కావాలని కోరుకుంటున్నాను. నా తర్వాతి సినిమా కోసం కథ రాస్తున్నాను. ఈ మూవీకి నేనే దర్శకత్వం వహిస్తాను’’ అని తెలిపారు.


