‘సింగ్‌ గీతం’పై చిరు ట్వీట్‌ | Chiranjeevi Tweet On Sing Geetham Movie | Sakshi
Sakshi News home page

‘సింగ్‌ గీతం’పై చిరు ట్వీట్‌

Jun 11 2026 1:22 PM | Updated on Jun 11 2026 7:37 PM

Chiranjeevi Tweet On Sing Geetham Movie

లెజండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన కొత్త మూవీ ‘సింగ్‌ గీతం’. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్‌ పై నాగ్‌ అశ్విన్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది.  ఈ నేపథ్యంలో చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌  చెబుతూ చిరంజీవి ట్వీట్‌ చేశాడు.

‘శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు..తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన ఒక భీష్మాచార్యుడు. ఆయన ఒక అమూల్యమైన ఆస్తి, ఒక నిధి. దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా, ఎంతోమంది కళాకారులకు అవకాశాలు కల్పించి వారి జీవితాలకు మార్గదర్శకుడయ్యారు. అలాంటి మహోన్నత వ్యక్తి దర్శకత్వంలో ఈ నెల 12 వ తేదీన సింగ్‌ గీతం సినిమా విడుదల అయ్యి, ఇండియన్ సినిమాలో మరొక మైలురాయి గా నిలుస్తుందని, పెద్ద విజయం సాధించాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

అలాగే ఇలాంటి పెద్దలను గౌరవిస్తూ, వారి అనుభవాన్ని కొత్త తరానికి అందించే ఆలోచనతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాత నాగ్ అశ్విన్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఒకవైపు ఆ నాటి తరానికి ప్రతినిధిగా నిలిచిన సింగీతం శ్రీనివాసరావు, మరోవైపు ఈ తరం ఆలోచనలను ప్రతిబింబించే నాగ్‌ అశ్విన్‌..వీరి కలయిక ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది.

అలాగే ఈ చిత్రానికి, నాకెంతో ఇష్టమైన దేవిశ్రీ  ప్రసాద్‌ సంగీతం అందించడం మరింత ఉత్సాహాన్ని కలగజేస్తుంది. నాగ అశ్విన్ కి, స్వప్న సినిమా, వైజయంతి మూవీస్‌కి,అలాగే ఈ చిత్రం లో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని చిరంజీవి ట్వీట్‌ చేశాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement