45 ఏళ్లుగా ఆ సినిమా చేయలేకపోయాం: కమల్‌ హాసన్‌ | Kamal Haasan Interesting Comments On Singeetam Srinivasa Rao And Sing Geetam Movie | Sakshi
Sakshi News home page

సింగీతం దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేయాలని ఉంది: కమల్‌ హాసన్‌

Jun 7 2026 5:11 PM | Updated on Jun 7 2026 5:23 PM

Kamal Haasan Interesting Comments On Singeetam Srinivasa Rao And Sing Geetam Movie

కమల్‌ హాసన్‌-సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్పక విమానం’ ఎంత సూపర్‌ హిట్‌ అయిందో అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా హిట్‌ అయిన తర్వాత సింగీతం శ్రీనివాస రావు మరో కథను కూడా కమల్‌కు వినిపించాడట. 45 ఏళ్ల క్రితమే ఆ సినిమాను తెరకెక్కించాలని భావించారట కానీ, అది సాధ్యం కాలేదు.

 దాదాపు 45 ఏళ్ల తర్వాత ఇప్పుడు తెరపైకి వచ్చింది. అదే ‘సింగ్‌ గీతం’. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్‌ అశ్విన్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని చెన్నైలో నిర్వహించారు. ప్రముఖ హీరో కమల్‌ హాసన్‌ ముఖ్య అథితిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన సింగీతం శ్రీనివాసరావుతో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ.. ‘సింగ్‌ గీతం’సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘నాకు 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడు సింగీతం శ్రీనివాసరావుతో పరిచయం ఏర్పడింది. మా తొలి సినిమా అనుకోకుండా తెరకెక్కింది. ఆ తర్వాత నాకు రెండు కథలు వినిపించాడు. అందులో పుష్పక విమానం తెరకెక్కింది. రెండో కథ మాత్రం అలానే ఉండిపోయింది. దాని గురించి 45 ఏళ్లుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ చేయలేకపోయాం. అదే సింగ్‌ గీతం. 

45 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సింగీతం శ్రీనివాసరావుకు వయసు అనేది కేవలం ఒక నెంబర్‌ మాత్రమే. ఆలోచన విషయంలో ఆయన ఇప్పటికీ జెన్‌ జీ కన్నా ఒక అడుగు ముందే ఉంటాడు. ఆయన నుంచి ఇంకా నేర్చుకుంటున్నా. సింగీతం దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేయాలని ఉంది’ అని కమల్‌ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement