సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా సాంగ్ రిలీజ్ | Singeetham Srinivasa Rao Movie Sing Geetham lyrcial Song out now | Sakshi
Sakshi News home page

Sing Geetham Movie: సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా సాంగ్ రిలీజ్

Jun 7 2026 6:30 PM | Updated on Jun 7 2026 6:30 PM

Singeetham Srinivasa Rao Movie Sing Geetham lyrcial Song out now

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన తాజా చిత్రం సింగ్ గీతం. సంగీతమే ప్రధానంగా ఈ మూవీని తెరకెక్కించారు. 94 ఏళ్ల వయసులో ఈ సినిమాను రూపొందించడం విశేషం. ఈ మూవీ జూన్ 11న రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సింగ్ గీతం మూవీ నుంచి క్రేజీ సాంగ్ విడుదల చేశారు. ఓరి జీవుడా జీవుడా అంటూ సాగా పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా.. శంకర్‌బాబు ఆలపించారు. ఈ సాంగ్‌ను దేవీశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. తాజాగా రిలీజైన ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.

 

Advertisement
 
Advertisement
Advertisement