breaking news
SINGEETHAM SRINIVAS RAO
-
సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
అయానే, అహల్య, షాలినీ ప్రధాన పాత్రలు చేసిన మూవీ 'సింగ్ గీతం'. సింగీతం శ్రీనివాసరావు దర్శకుడు కాగా.. కల్కి, మహానటి మూవీస్ తీసిన నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరించాడు. ఇందులో డైలాగ్స్ తక్కువగా ఉంటాయి. పాటలే ఎక్కువగా ఉంటాయి. అత్యాశ అనే కాన్సెప్ట్‌తో దీన్ని తెరకెక్కించారు. గత నెల 11వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈనెల జూలై 08 నుంచే ఓటీటీ ప్రియులకు నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి రానుంది.తాజాగా ఈ మూవీ నుంచి ఓరి జీవుడా అనే సాంగ్ ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించారు. ఈ సాంగ్‌ను శంకర్ బాబు ఆలపించగా.. దేవీశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. ఈ పాట థియేటర్లలో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో సాంగ్ మీరు కూడా చూసేయండి. -
సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా సాంగ్ రిలీజ్
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన తాజా చిత్రం సింగ్ గీతం. సంగీతమే ప్రధానంగా ఈ మూవీని తెరకెక్కించారు. 94 ఏళ్ల వయసులో ఈ సినిమాను రూపొందించడం విశేషం. ఈ మూవీ జూన్ 11న రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ సందర్భంగా సింగ్ గీతం మూవీ నుంచి క్రేజీ సాంగ్ విడుదల చేశారు. ఓరి జీవుడా జీవుడా అంటూ సాగా పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా.. శంకర్‌బాబు ఆలపించారు. ఈ సాంగ్‌ను దేవీశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. తాజాగా రిలీజైన ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. -
సింగీతంకు హెచ్ఎం రెడ్డి పురస్కారం
సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు తొలి తెలుగు టాకీ దర్శకనిర్మాత ‘హెచ్ఎం రెడ్డి స్మారక అవార్డు’ ప్రదానం చేశారు. ఆకృతి సుధాకర్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ ఈ పురస్కారాన్ని అందించారు. సింగీతం బహుముఖ ప్రజ్ఞాశాలని జస్టిస్ చంద్రకుమార్ కొనియాడారు. ఏ ఉద్దేశం, లక్ష్యం కోసం జన్మించామో తెలుసుకొని ఆ దిశగా పయనించి సమాజంలో వెలుగులు నింపాలని యువతకు ఆయన సూచించారు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె.పద్మనాభయ్య, టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కేవీ రమణాచారి, నవీన సుభాన్‌రెడ్డి, సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్, లయన్ జయప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు. అంతకముందు పలువురు గాయకులు ఆలపించిన సింగీతం సినీ గీతాల విభావరి అలరించింది.


