‘‘సింగీతం శ్రీనివాస్‌గారి సినిమాల్లో మహిళల పాత్రలు బలంగా ఉంటాయి. ‘సింగ్ గీతం’లో నాది కూడా బలమైన వ్యక్తిత్వం కలిగిన పాత్ర’’ అని అహల్య బమ్రూ తెలిపారు. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన చిత్రం ‘సింగ్ గీతం’. ఆయాన్, అహల్యా బమ్రూ హీరో హీరోయిన్లుగా శాలిని కొండెపూడి కీలక పాత్ర పోషించారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్‌పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 11న విడుదల కానుంది.
ఈ సందర్భంగా అహల్య బమ్రూ మాట్లాడుతూ– ‘‘మాది పుదుచ్చేరి. ఇంగ్లిష్, ఫ్రెంచ్, బెంగాలీ వంటి భాషలు మాట్లాడే ఒక ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో పెరిగాను. నేను ఎప్పుడూ నటిని అవ్వాలని అనుకోలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ క్రియేట్ చేస్తుంటాను. నాగ్ అశ్విన్‌గారు నా కంటెంట్ చూసి ‘సింగ్ గీతం’ గురించి చెప్పారు.
నా ఆడిషన్ కూడా ఇన్‌స్టా్రగామ్ ద్వారానే ఇచ్చాను. 94 ఏళ్ల వయసులో మోడ్రన్ ఆలోచనతో సినిమా చేయడం సింగీతంగారికే సాధ్యం. నిర్మాతగానే కాదు.. క్రియేటివ్ ్ర΄ాసెస్‌లో కూడా నాగ్ అశ్విన్‌గారు కీలక ΄ాత్ర ΄ోషించారు. తెలుగులో మహేశ్‌బాబుగారు అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.


