సింగ్‌ గీతంలాంటి సినిమా ఇప్పటివరకూ రాలేదు: నిర్మాత నాగ్‌ అశ్విన్‌ | nag ashwin interview about sing geetham | Sakshi
Sakshi News home page

సింగ్‌ గీతంలాంటి సినిమా ఇప్పటివరకూ రాలేదు: నిర్మాత నాగ్‌ అశ్విన్‌

Jun 12 2026 2:15 AM | Updated on Jun 12 2026 2:15 AM

nag ashwin interview about sing geetham

‘‘సింగీతం శ్రీనివాసరావుగారు 14 ఏళ్ల తర్వాత మళ్లీ దర్శకత్వం వహించిన చిత్రం ‘సింగ్‌ గీతం’. ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు’’ అని నిర్మాత నాగ్‌ అశ్విన్‌ తెలిపారు. ఆయాన్, అహల్యా బమ్రూ జంటగా శాలిని కొండెపూడి కీలక పాత్ర పోషించిన చిత్రం ‘సింగ్‌ గీతం’.  సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్‌పై నాగ్‌ అశ్విన్‌ నిర్మించిన ఈ మూవీ నేడు విడుదలవుతోంది.

ఈ సందర్భంగా బుధవారం నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ– ‘‘ఏడాదిగా నేను, దేవిశ్రీ ప్రసాద్‌గారు, మా టీమ్‌ అందరం సింగీతంగారితో ప్రయాణం చేసి, ఇలాంటి సినిమా ఎలా తీయాలో నేర్చుకుంటూ ఈ చిత్రాన్ని రూపొందించాం. సింగీతంగారి స్టైల్లో చేసిన మరో సరికొత్త ప్రయోగం ఇది. నేను 10 ఏళ్ల వయసులో ‘ఆదిత్య 369’ సినిమా చూసి, స్ఫూర్తి పొందాను. ఇప్పుడు ఆయనతో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా చూసి మరో 10 ఏళ్ల కుర్రాడు కూడా స్ఫూర్తి పొందాలన్నది మా ఆశ’’ అని పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement