నేలపై కూర్చుకున్న నాగ్‌ అశ్విన్‌.. 'కల్కి' దర్శకుడి వీడియో వైరల్‌ | Nag Ashwin Sitting On The Floor At Singeetam Movie Event At Chennai | Sakshi
Sakshi News home page

నేలపై కూర్చుకున్న నాగ్‌ అశ్విన్‌.. 'కల్కి' దర్శకుడి వీడియో వైరల్‌

Jun 7 2026 3:46 PM | Updated on Jun 7 2026 4:20 PM

Nag Ashwin Sitting On The Floor At Singeetam Movie Event At Chennai

ఈ రోజుల్లో చిన్న సినిమాలు చేసిన కొద్దిమంది నటులు, దర్శకులే తాము పెద్ద సెలబ్రిటీలమనే రేంజ్‌లో ఫీల్ అవుతూ గాల్లో తేలిపోతుంటారు. కానీ, ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్స్‌తో 'కల్కి 2898 AD' లాంటి గ్లోబల్ పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ సినిమా తీసిన  స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాత్రం తన సింప్లిసిటీతో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన నిరాడంబరతకు అద్దం పట్టే ఒక అరుదైన ఘటన తాజాగా చెన్నైలో చోటుచేసుకుంది.

లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో, వైజయంతీ మూవీస్ సమర్పణలో 'సింగ్ గీతం' అనే సినిమాను నాగ్‌ అశ్విన్‌ నిర్మించాడు.  తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా  ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చెన్నైలో ఒక ప్రత్యేక ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు కోలీవుడ్ విశ్వనాయకుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు రావడంతో వేదికపై మరియు గెస్టుల గ్యాలరీలో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. వచ్చిన అతిథులకు, ప్రత్యేక ఆహ్వానితులకు కూర్చోవడానికి సీట్లు సరిపోలేదు. తన సినిమా ఈవెంట్‌కు వచ్చిన అతిథులకు ఇబ్బంది కలగకూడదని భావించిన నాగ్ అశ్విన్.. ఏమాత్రం ఈగోకు పోకుండా, తాను ఒక స్టార్ డైరెక్టర్ ని అనే విషయాన్ని పక్కన పెట్టి, సోఫాల పక్కనే కింద నేల మీద కూర్చుండిపోయారు. కమల్ హాసన్ లాంటి లెజెండ్ పక్కన కూర్చునే అవకాశం ఉన్నప్పటికీ, అతిథుల సౌకర్యం కోసం నాగ్ అశ్విన్ కింద కూర్చోవడం చూసి అక్కడి వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవ్వడంతో నాగ్ అశ్విన్ పై నెటిజన్లు  ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement