టాలీవుడ్‌లో హిట్ టాక్.. అక్కడ కూడా సింగ్ గీతం రిలీజ్ | Tollywood Movie Sing geetham Movie Released In Kollywood also | Sakshi
Sakshi News home page

Sing geetham Movie: టాలీవుడ్‌లో హిట్ టాక్.. కోలీవుడ్‌లోనూ సింగ్ గీతం

Jun 23 2026 6:17 PM | Updated on Jun 23 2026 6:34 PM

Tollywood Movie Sing geetham Movie Released In Kollywood also

ఇటీవలే టాలీవుడ్‌లో రిలీజై హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ సింగ్ గీతం. ఈ సినిమాకు 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి కల్కి డైరెక్టర్ నిర్మాతగా ఉన్నారు. ఈ చిత్రంలో అయాన్, అహిల్య బమ్రు, శాలిని కోడెపూడి ప్రధాన పాత్రల్లో నటించారు.

టాలీవుడ్‌లో పాజిటివ్‌ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కోలీవుడ్‌ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ మూవీని కోలీవుడ్‌లోనూ రిలీజ్ చేసేందుకు రెడీ అయిపోయారు. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏజీఎస్ సినిమాస్ ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేయనుంది. జూన్ 26న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ఏజీఎస్ సినిమాస్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. కాగా.. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్, రాహుల్ రామకృష్ణ, శివన్నారాయణ ముఖ్య పాత్రల్లో కనిపించారు.
 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement