breaking news
singitham srinivas
-
టాలీవుడ్లో హిట్ టాక్.. అక్కడ కూడా సింగ్ గీతం రిలీజ్
ఇటీవలే టాలీవుడ్లో రిలీజై హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ సింగ్ గీతం. ఈ సినిమాకు 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి కల్కి డైరెక్టర్ నిర్మాతగా ఉన్నారు. ఈ చిత్రంలో అయాన్, అహిల్య బమ్రు, శాలిని కోడెపూడి ప్రధాన పాత్రల్లో నటించారు.టాలీవుడ్లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కోలీవుడ్ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ మూవీని కోలీవుడ్లోనూ రిలీజ్ చేసేందుకు రెడీ అయిపోయారు. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏజీఎస్ సినిమాస్ ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేయనుంది. జూన్ 26న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ఏజీఎస్ సినిమాస్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. కాగా.. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్, రాహుల్ రామకృష్ణ, శివన్నారాయణ ముఖ్య పాత్రల్లో కనిపించారు. From our hearts to the big screen...#SingGeetham releases on June 26th ❤️All set for a Grand Tamil Nadu Release through @agscinemas 🔥#SingGeethamFromJune26#SingeethamSrinivasaRao @ThisIsDSP @nagashwin7 @archanakalpathi @aishkalpathi @Nivetha_Tweets @23_rahulr… pic.twitter.com/sNAkVFmIiC— AGS Cinemas (@agscinemas) June 23, 2026 -
వందో సినిమాకు కథ అందిస్తున్న బాలయ్య
డిక్టేటర్ తో 99 సినిమాలు పూర్తి చేసిన బాలకృష్ణ, వందో సినిమాను సెట్స్ మీదకు తీసుకురావడానికి రెడీ అవుతున్నాడు. తన కెరీర్ లో ల్యాండ్ మార్క్ సినిమా కావటంతో ఈ మూవీ ప్రతిష్టాత్మకంగా ఉండేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకు తగ్గట్టుగానే రోజుకో వార్త టాలీవుడ్ సర్కిల్స్ ఓ వినిపిస్తోంది. ఇప్పటికే బాలయ్య వందో సినిమాకు ఇద్దరు స్టార్ డైరెక్టర్ల పేర్లు వినిపిస్తుండగా తాజాగా మరో కొత్త దర్శకుడు కూడా లైన్ లోకి వచ్చాడు. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త నందమూరి అభిమానులను ఖుషీ చేస్తోంది. తన వందో సినిమాకు తానే స్వయంగా కథ అందించాడట బాలయ్య. ఇప్పటికే బాలకృష్ణ చెప్పిన లైన్ ను డెవలప్ చేసిన సింగీతం శ్రీనివాసరావు పక్కా స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నాడు. ఆదిత్య 369కు సీక్వెల్ గా ఈ సినిమాకు తెరకెక్కించాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు అఫీషియల్ గా కన్ఫామ్ చేయకపోయినా, తన సొంత కథతోనే బాలయ్య వందో సినిమా ఉంటుందంటున్నారు ఫ్యాన్స్.


