మెగాహీరో వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ 'కొరియన్ కనకరాజు'. హారర్ కామెడీగా తీసిన ఈ చిత్రం గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చింది. మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ మంచి వసూళ్లు సాధించింది. మూడు రోజుల్లోనే రూ.35 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకుంది. అలానే అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ అయిపోయింది.
(ఇదీ చదవండి: దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ)
గత కొన్నాళ్లుగా గని, గాంఢీవధారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్, మట్కా సినిమాలతో వరస డిజాస్టర్లు అందుకున్న వరుణ్ తేజ్.. ఈ మూవీతో మళ్లీ దారిలో పడ్డాడు. ఈ వీకెండ్ వరకు 'కొరియన్ కనకరాజు' జోరు ఉండేలా అనిపిస్తుంది. కొరియన్ బ్యాక్ డ్రాప్ హారర్ కథతో తీసిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ హీరోయిన్. కమెడియన్ సత్య కీలక పాత్ర చేశాడు. మేర్లపాక గాంధీ దర్శకుడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)


