ఫస్ట్ టైమ్ ఈ మూవీలో ఫైట్స్ చేశాను | Actress Anjali About Makutam Movie Action Scenes | Sakshi
Sakshi News home page

Anjali: తమిళంలో వరస సినిమాలతో అంజలి బిజీ

Aug 10 2026 8:41 AM | Updated on Aug 10 2026 9:07 AM

Actress Anjali About Makutam Movie Action Scenes

అంజలి తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళంలో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది పరందు పో చిత్రంలో మెరిసింది. ఈమె నటిస్తున్న తమిళ మూవీస్ వరసగా రిలీజ్‌కి సిద్ధమవుతున్నాయి. విశాల్‌కు జంటగా నటించిన మకుటం.. ఈ శుక్రవారం తెలుగు, తమిళంలో విడుదల కానుంది. 'ఏళు కడల్‌ ఏళు మలై' త్వరలో విడుదల కానుంది. వీటితో పాటు ఈగై అనే మరో తమిళ చిత్రం, ఒరు పెరుంగలియాట్టం అనే మలయాళ సినిమా ఈమె చేతిలో ఉన్నాయి.

(ఇదీ చదవండి: ఇప్పటివరకు అలాంటిదేం జరగలేదు: జ్యోతిక)

కాగా ఇటీవల చైన్నెలో జరిగిన 'మకుటం' మీడియా సమావేశంలో పాల్గొన్న అంజలి.. తన మిత్రుడు విశాల్‌ దర్శకుడిగా తొలి హిట్ అందుకోవాలని విషెస్ చెప్పింది. తమిళ కెరీర్‌లో తొలిసారి ఇందులోనే ఫైట్ సీన్స్ చేశానని చెప్పుకొచ్చింది. ఇదే మూవీలో అంజలి, విశాల్‌ చేసిన నచ్చావు మచ్చాన్‌ అనే పాట ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. కాగా వరుసగా విడుదలవుతున్న తన చిత్రాలతో ఈ బ్యూటీ మరోసారి తన సత్తాని చాటుకోబోతుంది.

(ఇదీ చదవండి: సినిమా ఫ్లాప్‌ని ఒప్పుకొన్న తెలుగు దర్శకుడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement